బతకాలంటే గంజాయే దిక్కు, పంటకు పర్మిషన్ కోరిన రైతు

ఇక లాభం లేదు, గంజాయి పంట ఒక్కటే దిక్కు అంటున్నాడు, మహారాష్ట్ర సోలాపూర్  జిల్లాకు చెందిన రైతు అనిల్ పాటిల్. ఆయన ఏ పంట వేసినా గిట్టుబాటు కావడం లేదు. సేద్యం మీద విసుగొచ్చింది.  వ్యవసాయం తప్ప మరొక పని తాను చేయలేడు, అందువల్ల ఇక మిగిలింది ఒకే  ఒక పంట, గంజాయి (Cannabis). గంజాయి పంటను సేద్యం చేసుకునేందుకు అనుమతి  నీయండని అనిల్ పాటిల్ జిలా అధికార్లకు వినతిపత్రం పంపించాడు.

భారతదేశంలో గంజాయి పంట నిషేధం. నార్కొటిక్ డ్రగ్స్ ఎండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్సెస్ (NDPS)చట్టం కింద గంజాయి పంట పండించడమే కాదు, దాని వ్యాపారం కూడా నిషేధం. ఇలాంటపుడు అనిల్ పాటిల్ పంపిన వినతి పత్రంతో  అధికారులు అవాక్కయ్యారు. ఇదో పబ్లిసిటీ స్టంట్ అనుకుని దరఖాస్తును పోలీసుకు పంపించారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఒక కథనం వచ్చింది..

సోలాపూర్  జిల్లా మోహోల్ ప్రాంతానికి చెందిన పాటిల్ మాత్రం తాను బతుకుదెరువుకే ఈ విజ్ఞప్తి  చేశానని  ఇందులో ఎలాంటి పబ్లిసిటీ స్టంట్ లేదంటున్నాడు.  ఏపంటకి స్థిరమయిన ధర లేదు.తన వ్యవసాయం నష్టాల్లో పడిపోయిందని ఆయన వాపోతున్నాడు.

పంటమీద వస్తున్న రాబడి బాగా తక్కువ. వ్యవసాయం చేయడం కష్టమవుతూ ఉంది. పంటవేస్తే పెట్టిన పెట్టుబడి కూడా గిట్టుబాటుకావడం లేదు. చెరకు పంట వేసిఫ్యాక్టరీలకు అమ్మితే, బకాయీలు చెల్లించడం లేదు. అందువల్ల వ్యవసాయం దండగ అనిపిస్తూఉంది. ఒక్క గంజాయి పంటకే మంచి ధర ఉందని తెలిసింది. అందువల్ల ఆపంట వేసేందుకు అనుమతి నీయండి అని, అయనవినతపత్రంలో పేర్కొన్నారు.

అంతేకాదు, అధికారులకు అల్టిమేటమ్ కూడా ఇచ్చాడు.

గంజాయి పంటవేసేందుకు సెప్టెంబర్ 15 లోపు అనుమతిరావాలని, అలాకాని పక్షంలో తాను గంజాయి విత్తనాలు చల్లేస్తానని కూడా హెచ్చరించారు. మరది ఆయన కడుపు మంట.

ఒకసారి విత్తనం వేశాక కేసులు బుక్ చేస్తే దానికి జిల్లా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా పాటిల్ హచ్చరించాడు.

తనకున్న భూమిలో రెండెకరాలలో గంజాయి పండించాలని పాటిల్ భావిస్తున్నాడు.

మోహోల్ పోలీసులు కూడా ఇది పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని, ఆయన పంటవేస్తే తాము కేసు బుక్ చేస్తామని సీనియర్ ఇన్స్ పెక్టర్ అశోక్ సేకార్ అన్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ రాసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *