తుపాకుల రాజ్యం అఫ్గానిస్తాన్ లో మరొక జరలిస్టు హత్యకు గురయ్యాడు. ఆయన పేరు నేమాత్ రావాన్ (Nemat Rawan). గతంలో రావాన్ స్వతంత్ర వార్త సంస్థ టోలోన్యూస్ (Tolo News) కు యాంకర్ పనిచేశారు. కొంతమంది గుర్తు తెలియని సాయుధ దుండగులు గురువారం ఉదయం ఆయనను కాందహారులో హతమార్చారు. ఈ విషయాన్ని టోలోన్యూస్ ప్రకటించింది.
అఫ్గానిస్తాన్ చిత్రమయిన పరిస్థితిలోపడిపోయింది. ఎవరు తాబిబనో, ఎవరు టెర్రరిస్టో, ఎవరు గజదొంగో తెలియని పరిస్థితి. అందరి భుజానికి శక్తివంతమయిన మేడ ఇన్ యుఎస్ తుపాకులే ఉంటాయి. గిట్టని వాళ్లందరిని సాయుధులు చంపేస్తున్నారు. భద్రత ఇచ్చే దిక్కేలేని దేశమది.అందుకే రావాన్ దుండగులు కాల్చి చంపేసి పోయారు.
దీనిమీద జర్నలిస్టుల నుంచి నిరసన వెల్లువెత్తింది. అఫ్గాన్ జర్నలిస్టులకు భద్రత కల్పించాలని అఫ్గాన్ జర్నలిస్ట్స్ సేఫ్టీ కమిటీ ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది.
కాబూల్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ హత్యను ఖండించింది. ఇది తీవ్రవాద చర్యఅని పేర్కొంది. మరొకవైపు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఈ హత్యలో తాలిబన్ల పాత్ర లేదని ట్వీట్ చేశారు.
సెప్టెంబర్ 2020 నుంచి 2021 జనవరి 31 మధ్య దేశంలో 111 మంది మానవ హక్కలు వాదులను, జర్నలిస్టులను దుండగులు హతమార్చారని అఫ్గానిస్తాన్ యునైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ పేర్కొంది.
తాలిబన్లు కావాలనే జర్నలిస్టులమీద గురిపెడుతున్నారని హ్యమన్ రైట్స్ వాచ్ కూడా ఈఏడాది ఏప్రిల్ 2 న ఆరోపించింది.
ఈ ఏడాది జనవరి 1 వ తేదీన ఘోర్ నగరంలోని లోకల్ రేడియోస్టేషన్ నిర్వహించే జర్నలిస్టు బిస్మిల్లా ఆదిల్ ఐమాక్ ను దుండగులు హతమార్చారు.