ప్రొఫెషనల్ కోర్సుల్లో సర్కార్ స్కూళ్లకు కోటా: తమిళనాడు లో బిల్

ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తెచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం మరొక వినూత్న నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోవడంతో ఈ పరిస్థితిని సరిచేసేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.

ప్రొఫెషన్ కోర్సులలో ప్రవేశానికి ప్రభుత్వం పాఠశాలలకు కోటా కేటాయించాలని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నిర్ణయించారు.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నీరీ,ఫిషరీస్,లా, మెడిసిన్  కోర్సులలో  7.5 శాతం కోటాను  ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు కేటాయించేందుకు ఉద్దేశించిన బిల్లును ఈ రోజు ముఖ్యమంతి  స్టాలిన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

ఆరో తరగతి నుంచి  12 దాకా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు మాత్రమే ఈ కోటా వర్తిస్తుంది. ప్రభుత్వ ప్రొఫెషనల్ కాలేజీలోలనే కాదు,ఎయిడెడ్, ప్రవేటు కాలేజీలలో కూడా ఈ రిజర్వేషన్ ను అమలుచేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థుల సంఖ్య ప్రొఫెషనల్ కోర్సులలో తక్కువగా ఉందని, ఈ వ్యత్యాసాన్ని సరిచేసేందుకు  ఈ కోటా అవసరమవుతున్నదని బిల్ మీద ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నీరీ,ఫిషరీస్,లా, మెడిసిన్  కోర్సులలో  7.5 శాతంకోటాను  ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకే కేటాయించేందుకు ఉద్దేశించిన బిల్లును ఈ రోజు ముఖ్యమంతి ఎంకె స్టాలిన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆరోతరగతి నుంచి  12 దాకా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు మాత్రమే ఈ కోటా వర్తిస్తుంది. ప్రభుత్వ ప్రొఫెషనల్ కాలేజీలోలనే కాదు,ఎయిడెడ్, ప్రవేటు కాలేజీలలో కూడా ఈ రిజర్వేషన్ ను అమలుచేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థుల సంఖ్య ప్రొఫెషనల్ కోర్సులలో తక్కువగా ఉందని, ఈ వ్యత్యాసాన్ని సరిచేసేందుకు  ఈ కోటా అవసర మవుతున్నదని బిల్ మీద ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు.

 

One thought on “ప్రొఫెషనల్ కోర్సుల్లో సర్కార్ స్కూళ్లకు కోటా: తమిళనాడు లో బిల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *