GHMC, కంటోన్మెంట్లలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్

GHMC, కంటోన్మెంట్ ఏరియాలలో
ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆగష్టు 23 తేదీ నుండి 10 నుండి 15 రోజుల పాటు జరుగుతుంది.

GHMC లోని అన్ని 4846 కాలనీలు, మురికివాడలు, ఇతర ప్రాంతాలు మరియు కంటోన్మెంట్ జోన్‌లోని 360 ప్రాంతాలలో కొనసాగుతుంది. ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ యొక్క ప్రధాన లక్ష్యం హైదరాబాద్‌ను 100% కోవిడ్ టీకాలు వేసిన నగరంగా మార్చడం అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్శ కుమార్ తెలిపారు. శనివారం బి.ఆర్.కె.ఆర్. భవన్‌లో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి, GHMC కమిషనర్, కంటోన్మెంట్ బోర్డు అధికారులు, వైద్య శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

మొత్తం 175 మొబైల్ వ్యాక్సిన్ వాహనాలు టీకా కోసం ఉపయోగిస్తారు. GHMC ప్రాంతంలో 150, కంటోన్మెంట్ ప్రాంతాల్లో 25 వాహనాలు ఉంటాయి.

ప్రతి వాహనంలో ఇద్దరు టీకా వేసే సిబ్బంది మరియు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. ప్రతి కాలనీలో ఇద్దరు వ్యక్తులతో కూడిన మొబిలైజేషన్ టీమ్‌లు టీకాలు తీసుకోని వ్యక్తులను ముందుగానే గుర్తించి ఇంటింటికీ వ్యాక్సినేషన్ చేయిస్తారు.

టీమ్ ముందుగానే వ్యాక్సినేషన్ తేదీ  సమయంతో పాటు టీకాలు వేయించుకోవాలని ప్రజలకు తెలియజేస్తుంది. టీకాలు వేసిన తర్వాత టీకాలు వేసిన ప్రతి ఇంటి తలుపుల మీద స్టిక్కర్ అతికించబడుతుంది.
GHMC మరియు కంటోన్మెంట్ ప్రాంతాల్లోని అన్ని గృహలకు సరిపోయేంత తగిన పరిమాణంలో టీకా అందుబాటులో ఉంచబడుతుంది.

ప్రతి కాలనీలో ప్రజలకు స్పెషల్ డ్రైవ్ టీకాపై ఆడియో ప్రకటనతో పాటు బ్యానర్లు, ఆటో స్టిక్కర్లతో అవగాహన కల్పిస్తారు. టీకాలు వేయడం పూర్తయిన తర్వాత కాలనీ, మురికివాడలు 100% టీకాలు వేయడానికి ప్రోత్సహించడానికి మరియు చైతన్యపరచడానికి కాలనీ ఆఫీస్ బేరర్ల సమక్షంలో బ్యానర్‌ను విడుదల చేసే వేడుకను కాలనీలో నిర్వహిస్తారు.

100% టీకాలు విజయవంతంగా పూర్తి చేసిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (RWAS) కాలనీలకు GHMC కమిషనర్ ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో టీకాలు వేయించుకుని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ రిజ్వీ , జి.హెచ్.యం.సి కమీషనర్ శ్రీ లోకేశ్ కుమార్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ CEO శ్రీ అజిత్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్ రావు, ఓఎస్డి టు సిఎం డా.గంగాధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *