గన్నవరం నుంచి స్పైస్ జెట్ సర్వీసులు బంద్

 

గన్నవరం విమానాశ్రయంలోస్పైస్   జెట్ విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ప్రయాణికుల బుకింగ్ 30% కూడా లేకపోవడంతో ఈ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ లేనందున విమాన సర్వీసులు నడపలేమని స్పైస్ జెట్ యాజమాన్యం ప్రకటించింది.ఆన్లైన్ బుకింగ్ లను నిలిపివేసి రెండు నెలల పాటు విమానాలు తిప్పలేమన్న స్పైస్ జెట్ చెప్పింది.

రెండు నెలల తరువాత పరిస్థితి సమీక్షించి గన్నవరం విమానాశ్రయం లో సర్వీసులు నడిపేది లేనిది నవంబర్ లో ప్రకటిస్తామన్న స్పైస్ జెట్ సంస్థ పేర్కొంది.

బెంగుళూరు,హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు స్పైస్ జెట్ విమానాలు రద్దవడంతో ఒక్కసారిగా  గన్నవరం విమానాశ్రయం ఖాళీ అయింది.

గత ప్రభుత్వం లో స్పైస్ జెట్ ఫ్లైట్ ల్లో 80%పైగా ఉన్న బుకింగ్ లు… ఒక్కసారిగా 30% తగ్గిన బుకింగ్ లు

గన్నవరం విమానాశ్రయం పెరిగిన రన్ వే…తగ్గిన సర్వీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *