ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా యుద్ధం పరాజయం తో ముగిసింది

 (డాక్టర్. యస్.  జతిన్ కుమార్)

ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా మద్దతుగల తోలుబొమ్మ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో సోమవారం[16-8-21] మధ్యాహ్నం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అమెరికా జాతీయ టెలివిజన్ లో ప్రసంగం చేశారు.

 “ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్ సామ్రాజ్యవాదం అనుభవించిన విపత్కరమైన వోటమి యొక్క స్థాయి, చారిత్రక ప్రభావం, అనేక విషయాల్లో వియత్నాం యుద్ధంలో దాని ఓటమిని కూడా అధిగమించింది” అని ఆయన అన్నారు. బహుశా ఈ  అర్ధ శతాబ్దంలో ఒక అమెరికన్ అధ్యక్షుడు చేసిన అవమానకర ప్రసంగం ఇది. 

ఈ ప్రసంగం లోని విశేషాలు:

అమెరికన్ యుద్ధం యొక్క ముగింపును బిడెన్ అంగీకరించాడు, నలుగురు అమెరికా అధ్యక్షులు ఈ సంఘర్షణను పర్యవేక్షించారని, దానిని ఐదవ అధ్యక్షునికి అందించటానికి తాను నిరాకరించానని ప్రకటించాడు. “ఆఫ్ఘనిస్తాన్ లో చనిపోవడానికి ఇంకా ఎంతమంది అమెరికన్లను పంపాలి” అని ఆయన అడిగారు, యుద్ధం ప్రజాదరణ పొందలేదని తనకు బాగా తెలుసునని ఆయన అన్నారు.

 ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసినప్పుడు  అమెరికా చెప్పిన సాకులు అబద్ధాలు అని బిడెన్ అంగీకరించాడు. అమెరికా ఆక్రమణ, ఆక్రమణ ముఖ్యలక్ష్యం ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ఆఫ్ఘన్ ప్రజల శ్రేయస్సు అని బుష్ పరిపాలన, మొత్తం మీడియా వాదనలు చేసినప్పటికి, యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడది అంత పట్టించుకోదని బిడెన్ ప్రకటించారు.

“ఆఫ్ఘనిస్తాన్ లో మా లక్ష్యం ఎన్నడూ దేశ నిర్మాణం కాదు,” “ఏకీకృత కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని సృష్టించాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆఫ్ఘనిస్తాన్ లో మా ఏకైక కీలకమైన జాతీయ ఆసక్తికి కారణం ఎప్పుడూ ఒకటే వున్నది. అది అమెరికన్ మాతృభూమిపై ఉగ్రవాద దాడిని నిరోధించటమే”అని అన్నారు.

మరో మాటలో చెప్పాలంటే, ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధాన్ని ప్రారంభించిన జార్జ్ డబ్ల్యు. బుష్ , “ఒక దేశ  ప్రజలను ఆకలి నుండి కాపాడటానికి, క్రూరమైన అణచివేత నుండి ఒక దేశాన్ని విముక్తి చేయడానికి” ప్రయత్నించానని చెప్పిన వాదన అబద్ధం.

“ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా పరాజయానికి  ఎవరినైనా నిందించాలంటే అది ముందుగా అఫ్ఘాన్ ప్రజలనే. రెండు దశాబ్దాలుగా వారిని హత్య చేయడం, హింసించడం, బాంబులు వేయడం లో గడిపిన యునైటెడ్ స్టేట్స్ మిలిటరీకి  ఆఫ్ఘన్ ప్రజలు కృతజ్ఞత చూపలేదు” అని బిడెన్ చెప్పారు.

‘ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు శ్రేయస్సును తీసుకురావడానికి కీ యుద్ధం’ అని బుష్ పరిపాలన అబద్ధం చెప్పిందని అతను అంగీకరించినప్పటికీ, బిడెన్ మరొక అబద్ధాన్ని మరింత బలీయం చేశాడు – ‘9/11 దాడుల నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరాడటానికి అమెరికా యుద్ధం ప్రారంభించింది’ అనేది ఆ అబద్ధం. 

 ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా జోక్యం 20 సంవత్సరాల క్రితమే ప్రారంభం కాలేదు, అంతకు ముందే 1978లో జిమ్మీ కార్టర్ అధ్యక్షతనే ప్రారంభమైంది. ఇది కాబూల్ లో సోవియట్ మద్దతుగల ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు దారులను సమీకరించడం ద్వారా అంతర్యుద్ధాన్ని ప్రేరేపించే ప్రయత్నంగా ప్రారంభమైంది. కార్టర్ యొక్క ప్రధాన వ్యూహకర్త జ్బిగ్నీవ్ బ్రెజిన్స్కి మాటల్లో మాస్కోకు “దాని స్వంత వియత్నాం”ను ఇచ్చింది.

రీగన్ పరిపాలనలో ఈ విధానం దూకుడుగా కొనసాగింది. సిఐఎ డైరెక్టర్ విలియం కేసీ, సౌదీ అరేబియా,పాకిస్తాన్ లను మధ్య ప్రాచ్యం నలుమూలల నుండి ఇస్లామిక్ ఛాందసవాదులను నియమించి, ఆయుధాలు ఇవ్వడానికి ప్రోత్సహించారు, ఇది అల్ ఖైదా, ఒసామా బిన్ లాడెన్ల  పెరుగుదలకు దారితీసింది.

ఆఫ్ఘనిస్తాన్ నుండి సోవియట్ వైదొలగిన తరువాత, యుఎస్ఎస్ఆర్ పతనం తరువాత తాలిబాన్ కూడా  ఇదే ప్రక్రియ నుండి ఉద్భవించింది. క్లింటన్ పరిపాలన- పాకిస్తాన్ ప్రభుత్వం ద్వారా పనిచేస్తూ, ఇస్లామిస్ట్ ఉద్యమాన్ని, స్థిరత్వం కోసం ఒక శక్తిగా, మధ్య ఆసియా యొక్క చమురు వనరులను అమెరికా అందుబాటులోకి తెచ్చుకోవడానికి అవకాశం కల్పించే ఒక వాహికగా ప్రోత్సహించింది.

బిడెన్  ప్రసంగం ఈ మునుపటి చరిత్రను తుడిచి వేసింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో గత రెండు దశాబ్దాల అమెరికన్ ప్రమేయం గురించి అతను చెప్పినది నాలుగు పరిపాలనల విధానాలను స్వీయ-బహిర్గతం చేసింది.

“నేను ఎల్లప్పుడూ మీతో దాపరికం లేకుండా ఉంటానని అమెరికన్ ప్రజలకు వాగ్దానం చేశాను” అని ఆయన ప్రకటించారు. 2001 ఆక్రమణకు కారణాలతో సహా యుద్ధం గురించి అమెరికా ప్రభుత్వం చెప్పిన ప్రతిదీ అబద్ధమని ఇది పరోక్ష అంగీకారం.

బిడెన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఒబామా పరిపాలనపై ఆయన పలుచటి ముసుగు వేశాడీ ప్రసంగంలో అని  గుర్తించదగినది. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా దళాలు పెరగడానికి 2009లో తన సొంత వ్యతిరేకతను ఆయన ఉదహరించారు, ఇది మొత్తం 100,000 కు చేరుకుంది. ముఖ్యంగా అమాయక ఆఫ్ఘన్ పౌరులలో క్షతగాత్రులను పెంచింది. ఇది యుఎస్ సైనికులలో మరణాల రికార్డు పెరుగుదలకు కూడా దారితీసింది.

ఒబామా 2008లో అధ్యక్ష పదవికి పోటీ చేసి, తాను అన్ని యుద్ధాలను వ్యతిరేకించనని, ఇరాక్ యుద్ధం వంటి “తెలివితక్కువవాటికి” మాత్రమే తాను వ్యతిరేకమని, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి మద్దతు ఇచ్చారు. ఒకసారి ఎన్నికైన తరువాత, అతను తన యుద్ధ వ్యతిరేక వేషధారణలను విరమించుకున్నాడు. అతని పరిపాలన రెండు తడవులూ  నిరంతర యుద్ధం  కొనసాగింది. యుఎస్ చరిత్రలో అలా పనిచేసిన మొదటి అధ్యక్షుడు ఒబామానే..

బిడెన్ ప్రసంగానికి కార్పొరేట్ మీడియా ప్రచ్చన్నమైన తేలిక పాటి శత్రుత్వంతో స్పందించింది. ఉగ్రవాదంపై పోరాడటం, ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం, మహిళల హోదాను పెంపొందించడంకోసం అని ఆఫ్ఘనిస్థాన్లో జోక్యాన్ని ప్రోత్సహించిన మీడియా, దీర్ఘకాలంగా  తాము దాచిన సత్యాలను అతను నిర్మొహమాటంగా బయట పెట్టాడని  మీడియా పండితులు ఆందోళన చెందుతున్నారు.

ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా, సిరియా, యెమెన్ లేదా సోమాలియాలో అమెరికన్ బాంబులు, డ్రోన్ క్షిపణుల ద్వారా భస్మం చేయబడిన మహిళల స్థితి గురించి గాని లేదా అమెరికన్ మిత్రులయిన సౌదీ అరేబియా, గల్ఫ్ షేక్ల పాలనలోవున్నక్రూరమైన ప్రవర్తన గురించి గాని ఏమీ చెప్పకూడదు

 ఆమెరికన్లతో పనిచేసిన ఆఫ్ఘన్ అనువాదకులు,రాయబార కార్యాలయ ఉద్యోగులు, అమెరికా ఆక్రమణకు సహకరించిన వారు, తాలిబాన్ల రాక నుండి భయపడి పారిపోతున్న ఇతరుల భవితవ్యంపై గత వారం చాలా పెడబొబ్బలు వినిపించాయి. అయితే  ఆఫ్ఘన్ తోలుబొమ్మ పాలకులచే  ఖైదు చేయబడిన పదుల వేల మంది గురించి, సిఐఎ లేదా దాని తాబేదారుల  చేత గాని  హింసకు గురయిన వారి సంగతి ఏమిటి ? ఇటీవలి వారాల్లో తాలిబన్లు వేగంగా ముందుకు సాగడంలో ఒక ముఖ్యమైన అంశం ప్రతి ప్రావిన్షియల్ రాజధానిలో చెరసాలలను తెరవడం, బాగ్రామ్ ఎయిర్ బేస్ లో 5,000 మంది ఖైదీలను, సెంట్రల్ కాబూల్ జైలు పుల్-ఎ-చార్ఖీలో మరో 5,000 మంది ఖైదీలను విడుదల చేశారు. 

  ఆఫ్ఘనిస్తాన్ లో  వచ్చిన విపత్తు యొక్క స్థాయి స్పష్టమవుతున్నప్పుడు, ఆదివారం ప్రచురించిన న్యూయార్క్ టైమ్స్ సంపాదకీయం, ఈ రెండు సాకులను నొక్కి చెప్పింది- మహిళల భవితవ్యం,అమెరికా ఆక్రమణ పాలనతో కలిసి పనిచేసిన వారి భవితవ్యం.  టైమ్స్ లో ఎప్పటిలాగే, ఈ మానవతా ఆందోళనలు అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క “ప్రజాస్వామ్య” వేషధారణలను బలపరచడానికి ఉపయోగించబడ్డాయి.

“ఆఫ్ఘనిస్తాన్ విషాదం” అనే శీర్షిక క్రింద, సంపాదకులు యుద్ధం యొక్క ఫలితానికి విలపించారు, ఎందుకంటే “పౌర హక్కులు, మహిళల సాధికారత మరియు మత సహన పాలన యొక్క విలువలను ప్రోత్సహించాలనే అమెరికన్ ఆకాంక్షలు కేవలం ఒక కలగా మారిపోయాయని. “అమెరికా దళాలతో కలిసి పనిచేసి కలలుగన్న ఆఫ్ఘన్ల భవితవ్యాన్ని, ప్రత్యేక౦గా సమానత్వాన్ని అ౦గీకరి౦చిన బాలికలు, స్త్రీల” భవితవ్యాన్ని గురించి అది ఆందోళన వెలిబుచ్చింది. 

9/11 దాడులకు ప్రతిస్పందనగా యుద్ధం ప్రారంభమైందని, ఆ తర్వాత “రెండు దశాబ్ధాల దేశ నిర్మాణ ప్రాజెక్టుగా పరిణామం చెందిందని” ఈ సంపాదకీయం పునరుద్ఘాటించింది, దీనిని “మిషన్ క్రీప్, అహంకారం యొక్క కథ” లేదా  “స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై అమెరికన్ శాశ్వత విశ్వాసం యొక్క కథ” అని పేర్కొంది.

వాస్తవానికి, 20 సంవత్సరాల యుద్ధంలో $ 2 లక్షల కోట్ల  దుబారా జరిగింది. సైనిక శక్తి ద్వారా ప్రపంచాన్ని జయించడానికి అమెరికన్ పాలక వర్గం యొక్క “శాశ్వత” నిబద్ధతకు అది నిదర్శనం. ఆఫ్ఘన్ పాలనలో అవినీతి గురించి ఇటీవలి రోజుల్లో అంతులేని నివేదన ఉంది- ఇప్పుడు అది కూలిపోయింది- కానీ యుద్ధం బొనాంజాగా ఉన్న మరింత అవినీతి కర అమెరికన్ కాంట్రాక్టర్లు, కార్పొరేషన్ల గురించి చాలా తక్కువ వచ్చింది. 

అధికారిక గణాంకాల ప్రకారం, యుద్ధంలో 100,000 మందికి పైగా ఆఫ్ఘన్లు చంపబడ్డారు, నిస్సందేహంగా ఇది చాలా  తక్కువ అంచనా. అమెరికా ఈ యుద్ధాన్ని “తిరుగుబాటు వ్యతిరేక” పద్ధతుల ద్వారా, అంటే ఉగ్రవాదం ద్వారా: వివాహ పార్టీలు, ఆసుపత్రులపై బాంబు లు వేయడం, డ్రోన్ హత్యలు, అపహరణలు, ద్వారా సాగించింది. హింస. యుద్ధం యొక్క దురాగతాలలో అతి దుర్మార్గమైనదానిలో, 2015 లో, యుఎస్ విమానం ఆఫ్ఘనిస్తాన్ లోని కుందుజ్ లోని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఆసుపత్రిపై అరగంట పాటు దాడి చేసి 42 మందిని చంపింది.

మరో మాటలో చెప్పాలంటే, ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర- యుద్ధంలో అమెరికా ఓడిపోయింది అనే వాస్తవం కాదు, కానీ అమెరికన్ సామ్రాజ్యవాదంతో చారిత్రాత్మకంగా అణచి వేయబడిన దేశం విషాదకరమైనస్థితిలోనూ ఎదురు దాడి చేసిందనే. [పాట్రిక్ మార్టిన్  — 17/08/2021 న  WSWS.org లో ప్రచురించబడింది]

[ బిడెన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రసంగం ఆధారంగా ]

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *