నాటి మేటి ఫోటో…. గార గానుగ, ఇలాంటిదెపుడైనా చూశారా

ఈ కాలం వాళ్లకి ఇది పెద్దగా పరిచయం ఉండదు. ఈ విధానంలో మోర్టార్ తయారు చేసే  పద్ధతి పూర్తిగా 1970/80 దశకాలలోనే చాలా చోట్ల అంతరించిపోయింది.  ఆ రోజుల్లో భవనాలు నిర్మించేటపుడు   లైమ్ మోర్టార్  ను వాడేవారు. దీనిని గార (గచ్చు) అనే వాళ్లు.  సున్నం, ఇసుక నీళ్లు ఇలా గుండ్రంగా ఉండే గాడిలో వేసి దున్నల సాయంతో గానుగ తిప్పుతూ కలిపే వారు.

 

(pic credit: British Library Board)

సున్నం ఇసుక శాతం బట్టి ఈ గార క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. వందల సంవత్సరాల కిందట కనుగొన్న టెక్నాలజీ ఇది. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో ఈ పద్ధతే పాటించారు

A buffalo pulls the stone wheel around the trench of a gharat in the centre ,the masons names are included(top right),Dundlod (1888) (credit: NCSHS)

 

Lime mortar is prepared by mixing lime and, sand and water. Lime used for mortar may be fat lime (quick or hydrated) or hydraulic lime. Fat lime has high calcium oxide content. Its hardening property depends on the loss of water and absorption of carbon dioxide from the atmosphere and possible recrystallization in due course. Hydraulic lime contains silica, alumina, and iron oxide in small quantities. When mixed with water it forms putty or mortar having the property of setting and hardening with water. Slaked fat lime is used for plastering while hydraulic lime is used for masonry construction.

ఈ గారతోనే పూర్వకోటగోడలు, ఆనకట్టలు, రాజభవనాలు కట్టేవాళ్లు. అవి చెక్కుచెదరకుండా ఇప్పటికీ ఉన్నాయి. ఇపుడు సున్నం స్థానంలోకి సిమెంట్ వచ్చింది. ప్రత్యేకించి మిక్చర్లు వచ్చాయి.

ప్రఖ్యాత తెలుగు సంస్కృత పండితుడు వైద్యం వేంకటేశ్వరాచార్యులు (కర్నూలు) గార గురించి  చెప్పిన విశేషాలు

సంస్కృతం- క్షార
కన్నడం – గారె
తమిళం – కారై
అర్థం: గోడ మొదలయినవాటి పూతకోసం ఇసుకచేర్చి మెదిపిన సున్నం.

ఆంధ్రభాషాభూషణం అనే తెలుగు పద్యనిఘంటువులో గారకు ఉండే
పర్యాయ పదాలు ఇలా చెప్పినారు-

సీ. కంకర బెందడి గార పోద యనంగ
లేప విశేషమై తోప దగును (2.1)

ఉత్తరరామాయణంలో(2.292) కంకంటిపాపరాజకవి గార శబ్దాన్ని
ఇలా పద్యంలో ప్రయోగించినాడు–
సీ.చికిలిప్రాయంపుటిట్టికలగోడలువెట్టి
వజ్రంపు ‘గారల’పను లొనర్చి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *