’డల్లాస్ పోయి డంపింగ్ యార్డ్ అయింది తెలంగాణ ’: తెలంగాణ వెటరన్స్

తెలంగాణలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, హుజూరాబాద్ ఉపఎన్నిక తమ ధ్యేయం కాదని, ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టే లక్ష్యంతో  ‘తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక’ ముందుకు వెళుతుందని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో పలువరు వక్తలు అభిప్రాయ పడ్డారు.

రాష్ట్ర సమన్వయకర్త పాశం యాదగిరి అధ్యక్షత వహించగా గాదె ఇన్నయ నిర్వాహణ సారథ్యం వహించారు.

పోరాడగలిగిన ప్రతి ఒక్కరు పోరాడాల్సిన తరుణం వచ్చిందని, తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలకు పాల్గొన్నారని, అయితే ఫలితాలు మాత్రం ఒక కుటుంబం లాక్కుందని  పాశం యాదగిరి అభిప్రాయ పడ్డారు.

పేద ప్రజలకు సామాజిక ఆర్థిక విముక్తికై పాలకులకు పట్టింపు లేదని, ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయి కాబట్టి ‘దళిత బంధు’వంటి పథకాలు వస్తున్నాయని ఆయన  చెప్పారు.

వేలాదిమంది అమరుల త్యాగం ఒక కుటుంబానికి ఫలితాలు ఇస్తుందని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోవడంతో మరో ఉద్యమం అవసరం అయిందని పాశం యాదగిరి అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులను తరిమిన నేతలే, నేడు తెలంగాణను పాలిస్తున్నారని ఆయన అన్నారు.

ఆ ఐదుగురు తల్లులు:

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి సహకరించిన ఐదుగురు తల్లులు బెల్లీ లలిత, మీరా కుమార్, మాయావతి, సుష్మా స్వరాజ్, సోనియాగాంధీలకు రుణపడి ఉన్నామని, తెలంగాణ ప్రజలు వారిని తలుచుకోవాలని అన్నారు.

బిజెపి, కాంగ్రెస్ పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు అవినీతి రహిత ప్రజా తెలంగాణ సాధించుకునేందుకు అందరూ పోరాడటమే తక్షణ కర్తవ్యమని సీనియర్ పాత్రికేయులు, ఆకాంక్షల వేదిక సమన్వయ కర్త పాశం యాదగిరి అన్నారు.

తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష వేదికలో సమిష్టి నిర్ణయాలు, సమిష్టి నాయకత్వం ఉంటుందన్నారు. ‘ఆరోజు మాయలో ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. పిల్లి మెడలో గంట కట్టారు.. ఇక సమిష్టిగా ముందుకు వెళ్ళటమే ‘అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఉద్యమం ఇలాగే అంచెలంచెలుగా గ్రామ స్థాయికి తీసుకెళ్ళాలని ఆయన కోరారు.

పోలీసుల భుజంపై గన్ను పెట్టి..:

ఎన్నో ఇబ్బందులు వచ్చినా ముందుకు వెళ్ళటం, తెలంగాణ రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని అణగద్రొక్కుతున్నారని వారన్నారు. ఎన్నో ఇబ్బందులు వచ్చినా ముందుకు వెళ్ళటం, తెలంగాణ రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని అణగద్రొక్కుతున్నారని సభలో వక్తలు అభిప్రాయ పడ్డారు.

డల్లాస్ అన్నాడు డంపింగ్ యార్డ్ చేశాడు:

అందరు మాట్లాడేది విని కేసీఆర్ చివరకు అన్నీ కలిపి చెప్పేవాడని, డల్లాస్ చేస్తానన్నాడు.. కానీ డంపింగ్ యార్డులా కేసీఆర్ చేశాడని వారు అన్నారు.

ధర్నా చౌక్ ‘భయం’తోనే ఎత్తేశాడు:

ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడిందని, ఉద్యమ కారులను.. నోరు విప్పకుండా చేసిన నాయకుడు కేసీఆర్ అని, ధర్నా చౌక్ ఎత్తేశాడని, వేలాది మంది నిరుద్యోగులు ప్రాణాలు తీసుకున్నారని, ఇంటికి రెండు ఉద్యోగాలు అన్నాడు..ఈ వేదిక 4కోట్ల గొంతుగా ఉండాలని వారన్నారు. మొదటి ప్రాధాన్యత ఉద్యోగాల గురించి చేయాలని, ఇలాంటి పరిస్థితి వస్తోందని ఎవరూ ఊహించలేదని ఇన్నన్న తెరాస జెండా రూపకర్తని, పదవులు ఉన్నప్పుడు ఒక విధంగా లేనప్పుడు మరో విధంగా ఉండటం రాజకీయ నాయకులకు సహజమని, తెలంగాణ ఉద్యమ కారులకు పెన్షన్, 3 ఎకరాల జాగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇవే ముఖ్యం:

ప్రస్తుత పరిస్థితుల్లో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందని వారన్నారు.

అమరజ్యోతి యాత్ర:

అమరవీరుల కుటుంబాల ప్రస్తుత పరిస్థితిని వెలుగులోకి తెచ్చేందుకు, అమరవీరుల ఆత్మశాంతి కోసం అమరజ్యోతి యాత్ర చేయాలని సభ తీర్మానం చేసింది.

ఈ సభలో మాజీ మంత్రి చంద్రశేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శి కొనగంటి కేదారి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, రేగులపాటి రమ్యారావు, టిటిడిపి అధికార ప్రతినిధి అంబటి జోజిరెడ్డి, మాజీ మంత్రి విజయ రామారావు, మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరావు, సీనియర్ పాత్రికేయులు గోపిరెడ్డి సంపత్ కుమార్, సిలివేరి శ్రీశైలం, గంగాదేవి సంపత్ యాదవ్, తోటకూర మన్మథ రావు, బిజెపి నాయకులు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, న్యాయవాదులు బేతి మహేందర్ రెడ్డి, డొంకన రవి, బి. శ్రీధర్, కొరివి వెంకట స్వామి, సొల్లు అజెయ్ వర్మ, జనవిజ్ఞాన వేదిక రామరాజు, తెలుగుదేశం నాయకులు కళ్యాణపు ఆగయ్య, దామెర సత్యం, తెలంగాణ జన సంఘర్ష్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, విద్యార్థి సంఘాల నాయకులు మణికంఠ రెడ్డి, బుర్ర రవితేజ, సీనియర్ నాయకులు కటకం మృత్యుంజయం, చైతన్య కళా మండలి యాకయ్య, విశ్రాంత ఉద్యోగుల పక్షాన గండ్ర నర్సింహ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి, డిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు పద్మాకర్ రెడ్డి, కోట శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి

 

https://trendingtelugunews.com/top-stories/breaking/telangana-aspirations-need-new-forum-and-movenent/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *