మార్చి 13, 2015న కేరళ అసెంబ్లీలో జరిగిందిదే…

అది మార్చి 13, 2015.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యుడిఎఫ్  ప్రభుత్వం ఆరోజు కేరళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నది. ఆర్థిక మంత్రి కె ఎం మణి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. సభలో కొత్త స్పీకర్  ఎన్. శక్తన్ కు ఆ రోజు తొలిదినం.

మణి 2015-16 బడ్జెట్ ప్రసంగం చేయడానికి కొద్ది సేపటికి ముందే   సభలో భయంకరమయిన అలజడి మొదలయింది. బార్ల లైసెన్స్ ల కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న మణి కి బడ్జెట్ ప్రవేశపెట్టే అర్హత లేదని వామ పక్ష సభ్యులు ఆగ్రహంతో వూగిపోయారు.

సభలో నడవలోకి దూసుకు వచ్చారు. తన సీటు దగ్గిరకు స్పీకర్ శక్తన్ రాకుండా అడ్డున్నారు. వచ్చినా కూర్చునేందుకు సీటులేకుండా చేశారు. స్పీకర్ కూర్చునే  కుర్చీని   ఈడ్చి ఇవతలకు లాగి సభలో నడవలోకి విసిరేశారు.

అయితే, సభ లో ఉండే భద్రతా (Watch and Ward)సిబ్బంది స్పీకర్ ను పోడియం దాకా తీసుకువచ్చారు. అక్కడ నిలబెట్టారు. తర్వాత  గవర్నర్ కోసం పెట్టిన టెంపరరీ సీటు  వేసి కూర్చో బెట్టారు.

ఆ సీటులో కూర్చున్నా ఆయన సభని అదుపుచేయలేకపోయారు. కేవలం సైగ చేసి బడ్జెట్ ప్రవేశపెట్టు అని ఆర్థిక మంత్రిని పురమాయించారు. అనేక మంది ఎమ్మెల్యేలు వలయంగా ఏర్పడి మణి చేత బడ్జెట్ ప్రసంగం చేయించేందుకు పూనుకున్నారు.

నిజానికి మణిని సభలోకి రాకుండా అడ్డుకోవాలనుకున్నారు. అది మణి కి 13 వ బడ్జెట్.  12 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి మరొకరెవరూ దేశంలో లేరు. 13  వ బడ్జెట్ పెట్టాలనే ఉబలాటంతో ఆయన ఉన్నారు. ఏదిఏమయినా ఆయన 13 వ బడ్జెట్ ను ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలన్నది వామపక్ష సభ్యుల వూహం.

ఇది 13 నెంబర్ మహిమ (Charm of 13) అని మణి అంటూ ప్రతిపక్షాన్ని కవ్వించాడు. ‘ ఇది నాకు 13వ బడ్జెట్. ఈ రోజు శుక్రవారం 13వ తేదీ, నన్నెవ్వరాపలేరీవేళ’ అంటూ ఆయన బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు.

సమావేశాలకు రాకుండా మణి అడ్డుకుంటారని కట్టుదిట్టంగా 3000 మంది పోలీసులతో బందోబస్తు పెట్టారు. గుంపులను చెదరగొట్టేందుకు బాష్ఫవాయు గోళాలు ప్రయోగించారు.  మణిని అసెంబ్లీకి రాకుండా అడ్డుకోలేకపోయారు. అందుకే సభలో అడ్డుకోవాలని ప్రయత్నించారు.

సభలో  ఇరువర్గాల సభ్యులు కొట్టుకున్నారు. మీకు కనిపించిన వస్తువులన్నీంటిని విసిరేసుకున్నారు. కుర్చీలను కూడా మిసైల్స్ లాగా వాడుకున్నారు. టేబుల్స్ తోసేశారు. ఈ గొడవల్లో భద్రతా సిబ్బంది కూడా గాయపడ్దారు.

5గురు వామపక్షల ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఈ బీభత్సంత తర్వాత మార్చి 17  కేరళ అసెంబ్లీ 5 గురు ఎల్ డిఎఫ్ శాసన సభ్యులను 13  సెషన్ మొత్తం కాలానికి సస్పెండ్ చేసింది. ఆ రోజు సభలో మైకులు తుంచేశారు, విసిరేశారు, కంప్యూటర్లు ధ్వంసం చేశారు, బడ్జెట్ కాగితాలను చించి గాల్లోకి ఎగిరేశారు. సభ కొనసాగకుండా అడ్డుకున్నందుకు, స్పీకర్  తన పోడియం దగ్గిరకు రాకుండా అడ్డుకున్నందుకు,ఆయన కుర్చీని విసిరిపారేసినందుకు,  సభ అస్తులను ధ్వంసం చేసినందుకు వీరిని సస్పెండ్ చేశారు.

వీరిని సస్పెండ్ చేయాలంటూ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ స్వయంగా ప్రతిపాదన ప్రవేశపెట్టారు.  సస్పెండయిన శాసన సభ్యులు : ఇపి జయరాజ్, వి శివన్ కుట్టీ, కె కున్హమ్మీద్ (సిపిఎం), కె అజిత్ (సిపిఐ), కెటి జలీల్ (ఎల్ డిఎఫ్ , ఇండిపెండెంట్). ఎల్ డిఎఫ్ సభ్యుల విధ్వంస కాండ కేరళ అసెంబ్లీకే కాదు, మలయాళీ ప్రజలందరికి తలవంపులు తెచ్చిందని సస్పెన్షన్ ప్రతిపాదన చేస్తూ ముఖ్యమంత్రి చాందీ అన్నారు. మూడు రోజుల బడ్జెట్ సెషన్ ని ఒక రోజుకు కుదించాలని ఆయన స్పీకర్ నుకారు.

ఈ చర్యను అప్పటి ప్రతిపక్ష నాయకుడు వి అచ్యుతానందన్ ఖండించారు.

 

One thought on “మార్చి 13, 2015న కేరళ అసెంబ్లీలో జరిగిందిదే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *