అసెంబ్లీలో ధ్వంసం చేస్తే కేసులు తప్పవు: ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు వార్నింగ్

అసెంబ్లీలో విధ్వంస కాండకు పాల్పడి, ప్రివిలేజెస్ అంటూ కేసు పెట్టకూడదంటే కుదరదు, అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

2015 మార్చి లో అప్పటి యుడిఎఫ్ ఆర్థిక మంత్రి కెఎం మణి  2015-16 బడ్జెట్ ప్రవేశపెడుతున్నపుడు ప్రతిపక్ష వామపక్షానికి చెందిన సభ్యులు సభలో బీభత్సం సృష్టించారు.

దీనికి సంబంధించిఆరుగురు సభ్యుల మీద   కేసులు పెట్టారు. వామపక్షప్రభుత్వం వచ్చాక ఈ కేసులను  ఉపసంహరించుకోవాంటే ప్రివిలేజెస్ అంశం ఆధారంగా వాదిస్తూ వస్తున్నది. ఈ ఇపుడు వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వచ్చింది. దీని మీద కొద్దిసేపటి కిందట  జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ల ధర్మాసనం తీర్పు చెప్పింది.

సభలో ప్రజల ఆస్తి(pubic Property) ని ధ్వంసం చేసినపుడు అది క్రిమినల్ చర్యే అవుతుందని, దానిమీద చట్టప్రకారం చర్య తీసుకోవాలసిందేనని కోర్టు స్పష్టం చేసింది.

సభలో జరిగిన గొడవల మీద ఎమ్మెల్యేలను ప్రాసిక్యూట్ చేయడాన్ని ఉపసంహరించుకోవాలని కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ తిరస్కరించారు.

ఆపైన ఈ మాజీ శాసన సభ్యుల మీద కేసులు విత్ డ్రా చేసుకోవాలని కేరళ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది.  హైకోర్టు  2021 మార్చి 12 న  కేరళ ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది.

చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నిర్ణయాన్నిసమర్థించింది. ఈ కేసులో ఆరుగురు వామ పక్ష సభ్యులున్నారు. ఇందులో ఇప్పటి మంత్రులు ఇపి జయరాజ్, కెటి జలీల్ కూడా ఉన్నారు. హైకోర్టు నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

సుప్రీం కోర్టులో కూడా కేరళ ప్రభుత్వానికి  ఎదురుదెబ్బ తగిలింది. నేరం చేసినపుడు ప్రజాప్రతినిధలమని  ప్రివిలేజెస్ ఉంటాయని కేసులు పెట్టకుండా మినహాయింపు ఉంటుదనే వాదన కుదరదని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఆయన ప్రివిలేజెస్, శాసన సభలో వాక్ స్వాతంత్య్రం గురించి చాలా ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేశారు.

“Privileges and immunity are not gateways to claim exemption from criminal law and that would be a betrayal to the citizens.  The entire withdrawal application was filed based on a misconception of Article 194,”అని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. పూర్తి తీర్పు పాఠం ఇంకా విడుదల కాలేదు. అయితే, ఆయన తీర్పులోని కొన్ని భాగాలను చదివి వినిపించారు.

The purpose of bestowing privileges on legislators is to enable them to perform their legislative functions without hindrance or without fear or favor. They are not a mark of status which keeps legislators on an equal pedestal.

Legislators should act within the parameters of the public trust imposed on them to do their duty.

To claim an exemption from application from the criminal law of legislators would be to betray the trust reposed on them by the public. Privileges and immunity are not gateways to claim exemption from criminal law.

Committing the destruction of property cannot be equated to freedom of speech in the House. The argument that the acts were done in protest is unsatisfactory. Criminal law must take its normal course.

Such a ruckus cannot be held to be a Parliamentary proceeding.

Allowing the withdrawal of application under these circumstances would amount to interference with the normal course of justice for illegitimate reasons.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/breaking/what-happened-in-kerala-assembly-on-march-13-2015/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *