సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మానవతా దృక్పథంతో ఆఫీసులకు రావాలి

లాక్ డౌన్ ఎత్తేశాక చాలా రంగాల కార్యాలయాలు భౌతికంగా పనిచేయడం మొదలుపెట్టాయి. ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్తాయి సిబ్బందితో పని చేస్తున్నాయి. మార్కెట్లో మాల్స్, సూపర్ మార్కెట్లు, ఇతర కంపెనీలు పనిచేస్తున్నాయి. ఆంక్షలు లేకుండా మెట్రో రైళ్లు బస్సులు తిరుగుతున్నాయి. జూన్ 20 వ తేదీనుంచి తెలంగాణలో పూర్తిగా లాక్ డౌన్ ఎతేశాక, నెలరోజులు గడిచినా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల లేవు. అయినా సరే, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు సుముఖంగా లేరు.

అంతా ఇంటి దగ్గిర నుంచే పనిచేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇది నగరం ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నదని తెలంగాణ ఐటి ప్రిన్సిపల్  సెక్రెటరీ జయేష్ రంజన్ ఆందోళన వ్యక్తం చేశారు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కార్యాలయాలకు రావడానికి విశాల సాంఘిక ప్రయోజనాలున్నాయని , ఈ విషయాన్ని టెకీలు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.

హైదరాబాద్ లో దాదాపు ఆరులక్షల మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులున్నారు. వీళ్లంతా కార్యాలయాలకు వస్తే అనేక రంగాల వాళ్లకు ఉాపాధి లభిస్తుంది. వీళ్లని కార్యాలయాలకు చేరేవేస్తే రవాణా సిబ్బంది, కార్యాలయాల హౌస్ కీపింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, బయట ఉన్న హోటళ్లు, కార్యాలయాలో లోపల ఉన్న కెఫెటీరియా ఉద్యోగుల, ఇతర సహాయకులు రెండింతల దాకా ఉంటారు. అంటే పది పన్నెండు లక్షల మంది ఉంటారు.

సాఫ్ట్ వేర్  కార్యాలయాలు ప్రారంభమయితే వాళ్లందరికి ఉపాధి లభిస్తుంది.  ఇది ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతుంది. కాని  మెజారిటీ టెకీలు మళ్లీ కార్యాలయాలకు వచ్చేందుు సుముఖంగా లేరని ఆయన విచారం వ్యక్తం చేశారు. టెకీలు వీళ్ళందరి గురించి కూడా ఆలోచించాలి అని ఆయన అభిప్రాయపడ్డారు.

మొదటి విడత, రెండో విడత కోవిడ్ కేసులు చూశాక, ఇపుడు కార్యాలయాలకు వచ్చేందుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు జంకుతున్నట్లు ాయన చెప్పారు. ఇపుడలా భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇస్తున్నారు. ఎందుకంటే, లాక్ డౌన్ ఎత్తేసినా తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం లేదని దీనితో అనేక రంగాలలో కార్యాలయాలకు సిబ్బంది రావడం మొదలయిందని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఐటి ఉద్యోగులలో కూడా చైతన్యం తీసుకురావాలని ఆయన అన్నారు.

“During the first two waves, employees were not asked to come to work. However, though the lockdown has ended, we haven’t seen any spike in COVID -19 cases, even though there have been events, weddings and several offices have been opened. We need to sensitize IT professionals about those 20-30 lakh people whose basic needs depend on the ‘office opening’ again. This risk of COVID I much less, and still they don’t want to join back is not fair. All I can say is that it is very insensitive and very unfortunate,” ఆయన అన్నారు.

అయితే, ఆయన ఐటి ఉద్యోగులను మాత్రమే నిందించకుండా, ఐటి సంస్థలతో కూడా మాట్లాడే మళ్లీ కార్యాలయాలు ప్రారంభమయ్యేందుకు వాతావరణ అనుకూలం చేయాలి. ఎందుకంటే మరొక నాలుగయిదు నెలలు కార్యాలయాలను పున: ప్రారంభించేందుకు ఐటికంపెనీలు సుముఖంగా లేవు. ఇపుడున్న వర్క్ ఫ్రం హోమ్ (Work From Home) విధానం కొనసాగించాలనే అనుకుంటున్నాయి. ఎందుకంటే, కేసులు  తగ్గాయని అపుడే ఉద్యోగులందరిని అనుమతిస్తే  ప్రమాదకరమని, ఉద్యోగులను ఇలా ప్రమాదం లోకి నెట్టడం సరైంది కాదని కంపెనీలు భావిస్తున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *