రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు

మొత్తానికి వరంగల్ సమీపంలో పురాతన రామప్ప గుడికి వారసత్వ సంపద గా యునెస్కో గుర్తింపు నిచ్చింది. అదివారంనాడు జరిగిన  వరల్డ్ హెరిటేజ్ కమిటీ  సమావేశంలో యునెస్కో ఈ మేరకు అంగీకారం తెలిపింది. ఈసారి నార్వే వ్యతిరేకించినా, రష్యా పట్టుబట్టడంతో రామప్ప గుడి  ప్రపంచ వారసత్వ సంపద  జాబితాలో చేరింది.

ఈ ఆలయ్యాన్ని 13 వ శతాబ్దంలో నిర్మించారు.కాకతీయ గుణపతి దేవుడి సేనాపతి రాచర్లు రుద్రయ్య దీనిని నిర్మించినట్లు చెబుతారు.1310 లో ఢిల్లీచక్రవర్తి అల్దావుద్దీన్ ఖిల్జీ సేనలు మాలిక్ కాఫూర్ నేతృత్వంలో దాడి చేసినపుడు ఆలయం కొద్ది గా దెబ్బతినింది. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో పెద్ద భూకంపం వచ్చింది. దానిని తట్టుకుని ఈ ఆలయం నిలబడటం విశేషం.

నిజానికి, రామప్ప రుద్వేశ్వర ఆలయాన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపునీయాలని 2020లోనే నామినేట్ చేశారు. ఇండియా నుంచి నామినేట్ అయిన పురాతన నిర్మాణం (The Glorious Kakatiya Temples and Gateways – Rudreshwara (Ramappa) Temple, Palampet, Jayashankar Bhupalpally District, Telangana State ) ఇదొక్కటే.

ప్రధాని మోదీ హర్షం

 

 

దేవాదాయ శాఖ మంత్రి హర్షం

అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కడం భారతీయులందరికీ, ప్రత్యేకంగా తెలంగాణకు గర్వకారణమని దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.  రామప్పకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కడం కాకతీయ శిల్పకళా వైభవానికి దక్కిన అరుదైన గౌరవమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *