ఫోన్లలో మర్యాదగా మాట్లాడండి: ఉద్యోగులకు ప్రభుత్వ ఉత్తర్వులు

ఫోన్ లో ఎవరితోనైనా మాట్లాడేటపుడు మర్యాగా, మృదువుగా,  మెల్లిగా మాట్లాడండి అని మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరిని ఆదేశించింది.

కార్యాలయాల్లో ఉన్నపుడు ఫోన్లు ఎలా వాడాలి, ఎంతసేపు వాడాలి,ఏ ఫోన్ వాడాలి, భాష ప్రయోగం ఉండాలనే దాని మీద ప్రభుత్వ జిఎడి (general administration department) గైడ్ లైన్స్ జారీ చేస్తూ   ఈ ఉత్తర్వులు విడుదల చేసింది.

కార్యాలయాల్లో సాధ్యమైనంత వరకు  సెల్ ఫోన్ వాడకం తగ్గించాలని ప్రభుత్వం చాలా స్పష్టం గా చెప్పింది. పరిపాలన వ్యవహారాలకు సంబంధించిన కాల్స్ మొత్తం ల్యాండ్ లైన్ నుంచే చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఫోన్లలో మాట్లాడేటపుడు మర్యాదకరంగా మాట్లాడండి. మీరు ఫోన్లో మాట్లాడుతున్నపుడు చూట్టూరు కూడా ఉద్యోగులున్నారని, వాళ్లుకూడా పనులు చేస్తున్నారనే విషయం గుర్తంచుకోవాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫోన్లలో మాట్లాడేపుడు వాదులాడవద్దు, అభ్యంతరకర పదాలు వాడవద్దు అని కూడా పేర్కొన్నారు.

“When speaking on mobile phone, speak in a soft voice, do not argue and do not use unparliamentary language,” అని టెలిఫోన్ వాడకం గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు.

ఉద్యోగులకోసం జారీ చేసిన ఈగైడ్ లైన్స్ లో మరొక ముఖ్యాంశం టెక్స్ట్ మేసేసీలు.

అధికార సమాచారం పంపందుకు ఎపుడూ టెక్స్ట్ (Text) మేసేజీలనే వాడాలని నియమం పెట్టారు. అధికారిక పనులకు సోషల్  మీడియాను  వాడుకునేముందు టైం, భాషను గుర్తుంచుకోవాలని కూడా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *