‘బిజెపి ఒక మంచి నిర్ణయం తీసుకుంది’

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)

భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా రాయలసీమ , ఉత్తరాంధ్ర , కోస్తా ఆంధ్ర ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు కమిటీలు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

13 జిల్లాల ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఒకే రకమైన అభివృద్ధి చెందలేదు. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం పుట్టిన పిల్లలలో రాయలసీమలో 100 మందికి గాను దాదాపు 40 శాతం బలహీనంగా పుడుతున్నారు.

అదే ఉత్తరాంధ్రలో 34 మంది , మధ్య కోస్తా జిల్లాల్లో 23 మంది బలహీనంగా పుడుతున్నారు. ఈ లెక్కలు నేర్పుతున్నది. ప్రాంతాల మధ్య సమతుల్యత ఎంతగా దెబ్బతిందని ఈ వాస్తవాన్ని పాలకులు గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

నీటి వనరుల కేటాయింపు , సౌకర్యాలు చూస్తే కృష్ణా డెల్టాకు 90 శాతం ఉంటే రాయలసీమకు 13 శాతం హామీ ఇచ్చినా 7 శాతం కూడా ఇవ్వలేదు చిత్తూరు జిల్లాకు ఒక్క ఎకరాకు కూడా ఇవ్వలేదు. ఈ లెక్కలు చెపుతున్న సత్యం గత ప్రభుత్వాలు ప్రాంతాల మధ్య సమతుల్యత సాధించే దిశగా అడుగులు వేయలేదు. సరికదా వ్యత్యాసాన్ని పెంచే విధంగా పాలన సాగించాయి.

ఇలాంటి స్థితిలో రాజకీయ పార్టీలు , ప్రభుత్వాలు మూస పద్దతిలో , రాష్ట్రం మొత్తానికి ఒకే పాలనా పద్ధతులు మంచిది కాదు. జాతీయ పార్టీ అయిన బీజేపీ మూడు ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ప్రాంతీయ కమిటీలు ఏర్పాటు చేయడం మంచి పరిణామం.

ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని పేరుతో మహా నిర్మాణం , అందుకోసం రాష్ట్ర వనరులను ఖర్చు చేయడం మంచిది కాదు. శివరామకృష్ణన్ ” ఏపీకి ప్రస్తుత పరిస్థితుల్లో కావాల్సింది మహా నగరంతో కూడిన నూతన రాజధాని నిర్మాణం కాదు ప్రాంతాల మధ్య సమతుల్యత సాధించడం ముఖ్యం ” అందుకు భిన్నంగా రాష్ట్ర వనరులు , శక్తి సామర్ధ్యాలను రాజధాని నిర్మాణం కోసం వెచ్చించడం ఆత్మహత్య సాదృశ్యం అవుతుంది. చనిపోయే ముందు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి ప్రాజెక్టు విషయంలో పునరాలోచన చేసుకోవాలని రాసిన లేఖ సారాంశం.

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టు నుంచి వైదొలగడం మంచి నిర్ణయం. మూడు ప్రాంతాల్లో కీలక విభాగాల ఏర్పాటు చేయడం సముచితం. గతంలో రాయలసీమ డిక్లరేషన్ చేసిన బీజేపీ రెండవ రాజధానిగా రాయలసీమ ఉండాలని తీర్మానం చేసింది. నేడు మూడు ప్రాంతీయ కమిటీల ఏర్పాటు అన్ని ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధికి తగు ఆలోచనలు రావడానికి దోహదం చేస్తుంది. ఈ పరిణామాలు ఏపీలో అన్ని పార్టీలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దారి తీసేలా రాజకీయ నిర్ణయాలు జరగడానికి దారితీస్తుంది అనడంలో సందేహం లేదు.

(మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి,  రాయలసీమ విద్యావంతుల వేదిక, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *