శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద

కర్నాటకలో మంచి వర్షాలు కురియడంతో కృష్ణానదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ఇది నేటి రిజర్వాయర్ అప్ డేట్.

* శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 75,938 క్యూసెక్కులు వస్తుండటంతో..ఔట్ ఫ్లో 28,252 క్యూసెక్కులు కొనసాగుతోంది.

* శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 846.70 అడుగులు ఉంది.

* శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 73.2313 టీఎంసీలు ఉంది.

* శ్రీశైలం ఎడమగట్టు(తెలంగాణ) జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు28,252 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు

*శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *