బెన్ జాన్స్ న్ ఒలింపిక్ గోల్డ్ ఎలా చేజారిందంటే….

ఒలింపిక్స్ ఎన్నో చిత్ర విచిత్రాలకు నెలవు. అలాంటి ఒక చిత్రమే 1988 సియోల్ ఒలింపిక్స్ లో జరిగింది. 1988, సెప్టెంబర్ 24 న కెనడియన్ స్ప్రింటర్ బెన్ జాన్సన్ 9.79 సెకన్లలో 100 మీటర్ల రేసును చిరుతలా పరిగెత్తి స్వర్ణ పతకం సాధించాడు. కళ్ళు మూసి తెరిచేలోగా రికార్డు
బద్దలయ్యింది. కొత్త రికార్డ్ సృష్టించబడింది. చేతికి గోల్డ్ అందింది, అయితే, అంతలోనే చేజారిందది.ఏంజరిగింది?

బెన్ జాన్సన్  ముందు 1987 లో రోమ్లో జరిగిన వరల్డ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్షిప్లో, జాన్సన్ 100 మీటర్లను కేవలం 9.83 సెకన్లలో పరిగెత్తి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. మళ్లీ తన రికార్డును తానే బద్దలు కొట్టాడు.

1984 లో 100 మీటర్ల రేసు విజేత కార్ల్ లూయీస్ షాక్ నుంచి తేరుకోలేక పోయాడు. జాన్సన్ అంత వేగంగా ఎలా పరిగెత్త గలిగాడు అన్న విషయం జీర్ణించుకోలేకపోయాడు. విజయం సాధించిన తర్వాత జాన్సన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ” ఈ రికార్డు 100 సంవత్సరాలు ఉంటుంది. నా నుంచి బంగారు పతకం ఎవరు తీసుకోలేరు” అన్నాడు

అయితే నిజంగానే అతని బంగారు పతకాన్ని ఒలింపిక్ కమిటీ వెనక్కి తీసుకుంది. కాదు లాగేసుకుంది!

ఎందుకంటే, సెప్టెంబర్ 27 న, జాన్సన్ కు డోపింగ్ టెస్ట్ చేశారు. దాంట్లో జాన్సన్ కు స్టెరాయిడ్ పాజిటివ్ వచ్చింది.

అయితే అతను ఉద్దేశపూర్వకంగా స్టెరాయిడ్లను ఉపయోగించలేదని వాదించాడు. రేసు జరిగే ముందు తనకు ఇచ్చిన మూలికా కషాయం మాత్రమే తాగాను అని చెప్పుకొచ్చాడు.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అతని వివరణను అంగీకరించడానికి నిరాకరించింది. జాన్సన్ బంగారు పతకాన్ని వెనక్కి తీసుకుని, రెండో స్థానం లో వచ్చి రజతం సాధించిన కార్ల్ లూయీస్ కు ఆ బంగారు పతకాన్ని బహూకరించింది. తర్వాత బెన్ జాన్సన్ అది తన మీద జరిగిన కుట్ర గా పేర్కొన్నాడు. అయినప్పటికీ ప్రపంచ రికార్డు సాధించిన జాన్సన్ కు ఈ పతకం తో పాటు, రికార్డు సాధించిన క్రెడిట్ కూడా పోయింది, పైగా చెడ్డ పేరు వచ్చింది.

 

Saleem Basha

(సలీమ్ బాషా, స్పోర్ట్స్ జర్నలిస్టు,హోమియో వైద్యుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *