ఒంటికాలి తో ఒలింపిక్ చరిత్ర సృష్టించిన జార్జ్

(సలీమ్ బాషా)

ఒలింపిక్ క్రీడలు ఛాంపియన్ల రికార్డులు, స్ఫూర్తినిచ్చే కథలతో నిండి ఉన్నాయి. ఈ క్రీడలు ఆసక్తికరమైన, భావోద్వేగల సమ్మేళనం కూడా!

అలాంటి ఒక ఛాంపియన్ కథ అమెరికాకు చెందిన జిమ్నాస్ట్ “జార్జ్ ఐసర్” ది. ఆగస్టు 30, 1870 లో జర్మనీలో పుట్టిన జార్జ్ పద్నాలుగేళ్ళ వయసులో తల్లిదండ్రులతో పాటు అమెరికా వలస వెళ్ళాడు. కొన్నేళ్లపాటు బుక్ కీపర్ గా పని చేశాడు. ఆ తర్వాత జిమ్నాస్టిక్స్ మీద ఇంట్రెస్ట్ తో నేర్చుకోవడం మొదలు పెట్టాడు. దురదృష్టవశాత్తు చిన్నప్పుడు ట్రైన్ ప్రమాదంలో జార్జ్ తన కుడి కాలిని కోల్పోయాడు. అయినా నిరాశ పడక దాని స్థానంలో ఒక చెక్క కాలు అమర్చుకున్నాడు. నిరంతర సాధన చేస్తూ పోయాడు.

మిస్సౌరీలోని సెయింట్ లూయిస్లో 1904 లో జరిగిన ఒలింపిక్ సమ్మర్ గేమ్స్ లో ఒకే రోజు లో ఆరు పతకాలు(మూడు బంగారం, రెండు రజతం, ఒకటి కాంస్యం) గెలుచుకున్నాడు. అప్పుడే యూఎస్ లో జర్మనీ నుంచి వలసవచ్చిన వారి కోసం స్థాపించిన టర్నర్ క్లబ్ లో చేరి సాధన చేయడం మొదలు పెట్టాడు.

సెయింట్ లూయిస్ లోని ఓహియో టర్నర్ క్లబ్ లో మెంబర్ గా చేరాడు. జార్జి 3 బంగారు పతకాలు సాధించింది, సమాంతర బార్లు, 25-అడుగుల తాడు ఎక్కడం , లాంగ్ హార్స్ వాల్ట్ విభాగాల్లో. అలాగే పొమ్మెల్ హార్స్ లో రజతం, హారిజంటల్ బార్ లో కాంస్యం గెలుచుకున్నాడు..అది కూడా ఒంటి కాలి తోనే. తన ఒలింపిక్ విజయం తరువాత, ఐసర్ కాంకోర్డియా క్లబ్ కోసం పోటీని కొనసాగించాడు. జర్మనీ లోని ఫ్రాంక్ ఫర్ట్ (1928) లో జరిగిన ఇంటర్నేషనల్ మీట్ లో, అలాగే 1909 సిన్సినాటి,ఓహియో పోటీల్లో పతాకాలు సాధించాడు.

జార్జి జీవితం, పోరాట మటిమ ఎంతోమందికి స్ఫూర్తి. ఒలింపిక్ క్రీడలలో ప్రోస్తెటిక్ లెగ్ తో (కృత్రిమ కాలు) రెండు కాళ్లు సక్రమంగా ఉన్న వారితో పోటీ పడటమే కాకుండా వారికి దీటుగా 6 పతకాలు కూడా సాధించిన మొదటి అథ్లెట్ గా జార్జి చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.

(సలీమ్ బాషా , స్పోర్ట్స్ జర్నలిస్ట్, హోమియో వైద్యుడు,93937 37937)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *