షూ లేకుండా పరిగెత్తి ఒలింపిక్ స్వర్ణం కొట్టేసిన ఎకైక అథ్లెట్

 

1960 లో సమ్మర్ రోమ్ ఒలింపిక్స్ లో , ఇంతకు అనామకుడైన మారథాన్ రన్నర్ అబేబే బికిలా (Abebe Bikila 1932-1973)  ప్రేక్షకులను అబ్బురపరిచాడు. ఇథియోపియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ 28 ఏళ్ల బాడీగార్డ్ రోమ్ లోని బండపరుపు వీధుల గుండా పరిగెత్తాడు. విజయతీరాలకు చేరాడు.

బికిలా ఎంత వేగంగా పరిగెత్తాడు అంటే రెండు గంటల, 15 నిమిషాల, 16.2 సెకండ్లలో లో మారథాన్ ఫినిష్ లైన్ దాటాడు. అలా ప్రపంచ మారథాన్ రికార్డును బద్దలు కొట్టాడు.

ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన మొదటి తూర్పు ఆఫ్రికా అయ్యాడు. అది కూడా బూట్లు లేకుండా. బూట్లు లేకుండా మారథాన్ను గెలుచుకున్న మొట్టమొదటి  ఆధునిక ఒలింపిక్ బికిలా. అతని వేగం, చురుకుదనం బంగారు పతకం సాధిస్తే, షూస్ లేకుండా పరిగెత్తడం అనేది అతన్ని లెజెండ్ గా నిలబెట్టింది.

వాస్తవానికి ఈ చారిత్రాత్మక పరుగు బికిలా చేయాల్సింది కాదు. ఇథియోపియన్ రన్నర్ వామి బిటాట్ సమ్మర్ ఒలంపిక్స్ లో పాల్గొనాల్సింది. అయితే బిటాట్ ఫుట్ బాల్ మ్యాచ్ లో గాయ పడినందువల్ల బికిలా కు అవకాశం వచ్చింది. మారథాన్ రేస్ కు కొన్ని రోజుల ముందు, బిటాట్ స్థానంలో బికిలా రోమ్ వెళ్ళాడు. శిక్షణా శిబిరంలో నుంచి చిరిగిపోయిన ఒక జత బూట్లు కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. ఒలింపిక్స్ మారథాన్ ముందే ప్రాక్టీస్ కోసం రోమ్ లో కొత్త బూట్లు కొన్నాడు. కానీ వాటిని వేసుకున్నప్పుడు కాళ్ళకి బొబ్బలు వచ్చాయి. బహుశా సైజు సరిపోలేదేమో. దాంతో మారథాన్ రోజు వట్టి కాళ్ళతోనే పరిగెత్తాలి నిర్ణయించుకున్నాడు. అలాగే పరిగెత్తాడు. ప్రపంచ రికార్డు సృష్టించాడు. మారథాన్ రేసులో బూట్లు వేసుకోకుండా (bare foot) పరిగెత్తడం లో ఇప్పటికీ ఆ రికార్డు అలాగే ఉంది.

తర్వాత జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో(1964) కూడా బికిలా మరో సారి మారథాన్ లో బంగారు పతకం సాధించాడు.అప్పటికి 40 రోజులు ముందు ఆయనకు అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది.అయినా సరే పరిగెత్తాడు. గోల్డ్ సాధించారు.కాకపోతే, టోక్యో  బూట్లు ధరించాడు. మూడో సారి ముచ్చట గో ల్డ్ సాధించే వాడేనేమో , 1968 మెక్సికో ఒలింపిక్స్ మారథాన్ లో పది మైళ్లుపరిగెత్తాక కాలు విరిగింది.దానితో ఆయన డ్రాప్ అయ్యాడు.

వట్టి కాళ్ళతో పరిగెత్తాలనే తన నిర్ణయం గురించి అడిగినప్పుడు, అతను ఇలా అన్నాడు:”నా దేశం ఇథియోపియా ఎప్పుడూ పట్టుదలతో, ధైర్యం తో గెలిచిందని ప్రపంచం తెలుసుకోవాలని నేను కోరుకున్నాను” అని అన్నాడు. ఒలింపిక్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.

(సలీమ్ బాషా స్పోర్ట్స్ జర్నలిస్టు, హోమియో వైద్యుడు, సెల్ 93937 37937)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *