తిరుమల లడ్డు కౌంటర్లు నడిపేలా బ్యాంకులను ఒప్పించలేరా?

తిరుమల ఆలయానికి చెందిన కొన్ని సేవలను ప్రయివేటు వాళ్ళకి  అప్పగించాలని స్పెసిఫైడ్ అధారిటీ నిర్ణయించడం మీద రకరకాల అనుమానాలు విమర్శులు వస్తున్నాయి. వీటిలో కొన్ని:

*తిరుమల వెంకన్న వేల కోట్ల సొమ్ము ,టన్నుల కొద్దీ బంగారు ఏ జాతీయ బ్యాంకులో టీటీడీ డిపాజిట్ చేశారు?

*ఆ జాతీయ బ్యాంకు ఉన్నతాధికారులను “స్పెసిఫైడ్ అథారిటీ”కి పిలిచి గతంలో లాగా లడ్డూ కౌంటర్ల సిబ్బందికి జీతాలు ఇచ్చే విధంగా ఒప్పించే ప్రయత్నం చేసి ఒప్పించండి,వడ్డీ కాసులవాడికి నెలకు 5 కోట్లు ఆధా చేసే ప్రయత్నం చేయండి “దేవుడు హర్షిస్తారు- భక్తులు అభినందిస్తారు”

*టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ, ప్రధాన గణాంక అధికారి జాతీయ బ్యాంకు అధికారులు సమిష్టిగా చర్చిస్తే “వెంకన్న” అనుగ్రహంతో సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం శ్రీవారి భక్తులలో ఉంది!

*శ్రీవారికి సేవ చేయలేని “జాతీయ బ్యాంకు”లకు తిరుమల కొండపైన బ్యాంకు లావాదేవీలు నిర్వహించడానికి వీలులేదు అని గట్టిగా ఎందుకు చెప్పరు “ధర్మ” ప్రభువులు!

*తిరుమల కొండపై ఉన్న జాతీయ బ్యాంకులు శ్రీవారి లడ్డు కౌంటర్ ల నిర్వహణ బాధ్యతను తిరస్కరించినప్పుడు ఆ బ్యాంకులను తిరుపతికి సాగనంపాలి కదా టీటీడీ “ధర్మ”రక్షకులు!

*జాతీయ బ్యాంకులను ఒప్పించడం “స్పెసిఫైడ్ అథారిటీ స్థాయి” సరిపోనప్పుడు నూతన ధర్మకర్తల మండలి వచ్చేవరకు ప్రైవేట్ ఏజెన్సీ ని పక్కన పెట్టి టిటిడి లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా కొద్దిరోజులు లడ్డు కౌంటర్ లను నిర్వహించండి వాళ్ళు బాధ్యతగా కూడా పనిచేస్తారు కదా!

-శ్రీవారి భక్తులు
నవీన్ కుమార్ రెడ్డి, తిరుపతి యాక్టివిస్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *