జనచైనా జైత్ర యాత్రలో–వందేళ్ల కమ్యూనిస్ట్ పార్టీ

 (డాక్టర్ జతిన్ కుమార్, జయలక్ష్మి)

చైనా కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల ఉజ్వల చరిత్రకు సాక్షిగా ఈనాటి జనచైనా అరుణకాంతులతో వెలుగు లీనుతోంది. ఒక నిరుపేద స్థితి నుంచి రెండవ పెద్ద ఆర్ధిక శక్తి గా పురోగమించిన మహత్తర విప్లవ నిర్మాణానికి ఛిహనం గ వారి  ఎర్రజండా ఎగురుతోంది.  కడు  పేదరికాన్ని దేశం నుంచి పూర్తిగా  పారద్రోలిన శక్తిగా ఆ పార్టీ  ఈనాడు విజయగీతాలు ఆలపిస్తోంది.

140 కోట్ల ప్రజలకు భరోసాగా, వారి కలలకు. ఉజ్వల భవిష్యత్తుకు బాసటగా  నాయకత్వం వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది. ఇదంతా తేలికగా సాధ్యమయ్యింది కాదు. అకుంఠిత దీక్షతో ఆప్రజలు, పార్టీ  ఒక్క మాటగా, కలసికట్టుగా చేసిన జైత్ర యాత్ర.

అనేక కుట్రలను. శత్రు పూరిత చర్యలను తిప్పికొడుతూ తనను తాను నిరూపించుకుంటూ సాగిన మహాప్రయాణం .  ఎన్నో  అభూత కల్పనలతో , అంతర్ విద్వేషాలు రెచ్చగొట్టాలని చేసిన ప్రయత్నాలను తిప్పి కొడుతూ సాగిందో ఆ ప్రయాణం. విప్లవ కాలంలో,ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో, ప్రపంచ యుద్ధ కాలంలో చేసిన అపూర్వ త్యాగలే కాదు, విప్లవానంతరం చైనాను ఒక బలమైన సంపన్న సమాజం గా తీర్చి డీదటంలో ,మరీ ముఖ్యం గ 1980 ల నుండీ, దేశ పునర్నిర్మాణం  శరవేగంగా సాగించటంలో కమ్యూనిస్ట్ పార్టీ, చైనా ప్రజల మధ్య ఏర్పడిన అవిచ్చిన్న అనుబంధం అనుపమానమైనది.

credit: wikipedia

పార్టీ-ప్రజల ఐక్యతను  దెబ్బతీయటా నికి, పార్టీ పట్ల ప్రజలలో అసంతృప్తి , వ్యతిరేకత  రగిలించటానికి ప్రపంచ ఆధిపత్య శక్తులు సోషలిస్టు వ్యతిరేక శక్తులు,  అనేక ప్రయత్నాలు నిరంతరం కొనసాగిస్తున్నాయి. చైనాను అంతర్జాతీయ వేదికల నుండి దూరంగా వుంచటం నుండి, తైవాన్ ను అసలు చైనాగా భ్రమింప జేయటం నుండి, ఆదేశంలో మానవ హక్కుల హననం  జరుగుతోందని గగ్గోలు పెట్టటం వరకు ,చివరకు చైనా చుట్టూ పట్ల వున్న అన్నీ దేశాలను చైనా వ్యతిరేక కూటమిగా మార్చటానికి  ఆవిరామంగా కుటిల ప్రయత్నాలు సాగించటం వరకు చైనా ప్రజల అభివృద్ధి యాత్రకు అవరోధాలు కలిగించటమే వ్యూహంగా సామ్రాజ్యవాద  శక్తులు తమ విఫల ప్రయత్నాలు చేస్తూనే  వున్నారు. ఈ అన్నీ రకాల దుష్ట  ప్రయత్నాలను కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో  ఆ ప్రజలు  తిప్పికొట్టి తమ ‘భవ్యమైన చైనా కల’ ను  నిజం చేసుకుంటూ పురోగమిస్తున్నారు.

అమెరికా పెత్తందారులు చేసిన  అనేక  రకాల  విఫల ప్రయత్నాలలో భాగమే, సోషలిస్టు శక్తులు విజయవంతంగా నిలబడిన చారిత్రక ఘట్టమె  తీయానాన్మెన్ సంఘటనలుగా   పేరు పొందిన ఒక సందర్భం. చైనా పట్ల  పెట్టుబడిదారీ ప్రపంచం ఎంత తిరస్కార భావంతో వుందో ,చైనాను కూల్చి వేయటానికి ఎంతటి కుట్రలు  చేయగలదో విశదమైన ఒక  సందర్భం అది.

“ 1989జూన్4 నాడు “తియనన్మెన్ స్క్వేర్ లో పది వేల మంది విద్యార్థులను సైన్యం కాల్చి చంపిందని” అమెరికా, పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులు ఒక విషయ ప్రచారం చేశారు, చేస్తున్నారు ఆ ఘటనల వెనుక తాము నిర్వర్తించిన పాత్రను, తమ కుట్రను మాత్రం కప్పిపెట్టు కుంటారు. 

ఆనాడు నిజంగా ఏం జరుగుతున్నది అని పరిశీలించకుండా, ఒకరి కథనాల ఆధారంగా మరొకరు వార్తలను వండి వడ్డించారు; చైనా విద్యార్థుల్లో కొందరు కూడా అందులో భాగమయ్యారు. “ స్క్వేర్ లో పది వేల మంది హత్యాకాండ అనేది కట్టుకధ “  అనేకసార్లు ,అనేక మంది వాస్తవాలను బైటపెట్టారు. అయినప్పటికీ, చైనా వ్యతిరేక ప్రచారంలో భాగం గా ఇప్పటికీ ఆ సంఘటనలను ‘మారణ కాండగా’  తిరిగి తిరిగి ప్రచారం చేస్తూనే వున్నారు. 

“దేశంలో అమలు చేయవలసిన సంస్కరణలగురించి పార్టీ నాయకత్వంలోచర్చలు కొనసాగుతున్నకాలం . హద్దులు లేని లిబరలైజేషన్ వైపు మొగ్గిన నేతలు కొందరు. సంప్రదాయ మార్క్సిస్ట్ ఆలోచనల కే  పరిమితమైనవారు కొందరు. మార్క్సిజాన్ని  చైనా స్థితిగతుల కనుకూలంగా మలచి సోషలిస్ట్  మార్కెటవిధానాలు రూపు దిద్దవలసి వుందని భావిస్తున్నవాళ్ళు కొందరు. విభేదాలను వాడుకొని విద్యార్థులని ఎగదోసాయి పార్టీలోని కొన్ని శక్తులు, లాబీలు. దానికి ఆజ్యంపోసాయి విదేశాలు, విదేశీ మీడీయ. 

 అమెరికాతో ప్రభుత్వపరంగా సంబంధాలు ఏర్పడి,బయటి  వాతావరణం అప్పుడప్పడే తెలుసుకుంటున్న కాలం. ఆ విద్యార్థి తరంలో పాశ్చాత్యదేశాల స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వంల గురించిన పై పై అవగాహనే వుంది. వారికి  అమెరికా ఇచ్చిన  ప్రోత్సాహమూ  వుంది. పాశ్చాత్య పెట్టుబడిదారీ విధానపు బూర్జువా ప్రజాస్వామ్యం బండారం తెలియని  విద్యార్ధులు కొందరు .సంపూర్ణ పాశ్చయతీకరణ వైపు మొగ్గు చూపినవారు కొందరు.  

 ఈ పరిస్థితులలో  అభివృద్ధి, సంపదలు, సౌకర్యాలు, టెక్నాలజీలన్నీ కలిసి ‘సోషలిస్ట్ ఆలోచనా విధానాన్ని బలహీన పరుస్తాయేమో అని కొంత ఆందోళన కలిగింది.విదేశీ, దేశీ పెట్టుబడిదారులను అనుమతిస్తూనే స్వతంత్ర ‘నవచైనా నిర్మాణ స్వప్నం’ మొదలైంది.

అప్పటి నుంచి  “చైనా తరహా సోషలిజం” పేరిట అనుసరించిన వ్యూహం-ఎత్తుగడల  ఫలితాలు ఈనాడు ప్రపంచమంతా చూస్తున్నది. సిద్ధాంత సంక్షోభం తలెత్త నీయకుండా ఆ ప్రమాదాన్ని పసిగట్టే “బూర్జువా లిబరలైజేషన్’కి వ్యతిరేకంగా చైనా పార్టీ ఆనాడే (1987) ఒక ఉద్యమాన్ని నిర్వహించింది.

 “ఎన్ని సంస్కరణలు వచ్చినా నాలుగు మౌలికసూత్రాల (Four cardinal Principles) చట్రానికి లోబడి మాత్రమే వుండాలని చైనాపార్టీ, ప్రభుత్వమూ ఆదేశిక సూత్రాలను ప్రకటించారు. సంస్కరణలక్రమంలో పెచ్చరిల్లిన “బూర్జువా లిబరలైజేషన్ ని ఎదుర్కోవాలని, అందరూ కట్టుబడి వుండాల్సిన ఆ సూత్రాలను పునరుద్ఘాటించారు. అవి: సోషలిస్టు పథం, జనతా ప్రజాతంత్ర నియంతృత్వం, మా.లె. మావోసిద్ధాంత నేతృత్వం, అన్నిటికన్నా కీలకమైన పార్టీ నాయకత్వం. ఈ సూత్రాలను కాదనేవారు కొందరు పార్టీ, ప్రభుత్వ వ్యవస్థలపై దాడులను ఆర్గనైజు చేసారని;  ప్రజా చైనా, పార్టీల భవితవ్యాన్ని దెబ్బ తీయటానికి, సామ్రాజ్యవాదుల ప్రోత్సాహంతో జరిగిన తిరుగుబాటు కుట్ర స్వభావాన్ని అర్థం చేసుకోకుండా, దాన్ని బలపరిచి, కొద్దిమంది తీవ్రమైన తప్పుచేసార” ని వివరించారు.ఆ పరంపరలో వచ్చినవే తియనన్మెన్ స్క్వేర్ సంఘటనలు; హఠాత్తుగా వచ్చినవి కాదు. ఇలాటి ఎన్నో ప్రతిబంధకాలను ఎదుర్కొని నిలిచిన చరిత్ర చైనా కమ్యూనిస్ట్ పార్టీది. 

ఆ తరువాత నడిచిన చరిత్ర మొత్తం చైనా  వివరణలు. వారి సూత్రీకరణలు ఎంత సరైనవో  నిరూపించింది. తూర్పు యూరపులో, రష్యాల లో లాగే చైనా ప్రభుత్వమూ, పార్టీ పతనమవుతాయని సామ్రాజ్యవాదులు కన్న కలలు వమ్మయేట్టు చై నా కమ్యూనిస్టు పార్టీ తన ప్రస్థానం  కొనసాగిస్తున్నది. “ఆనాడు 500బిలియన్ డాలర్లున్న చైనా జీడీపీ నేడు 14000బిలియన్లకు చేరుకున్నది. చైనా ప్రజలు నేడు సంపన్నవంతులై, గర్వంతో తలఎత్తుకొని వున్నారు. ఇప్పటి చైనా మార్గం స్థానంలో “ప్రజాస్వామ్యం పేరిట మరోవ్య వస్థని కోరుకుంటున్న  సూచనలేవీ మెజారిటీ ప్రజల్లో కన్పించటం లేదు.”

“పాశ్చాత్యీకరించబడిన” ఆసియా అగ్రరాజ్యంగా చైనా వుండబోదు.  సోషలిస్టు మార్కెట్ విధానాలతో, ప్రపంచీకరణ  సమయంలో ఏర్పడ్డ సౌలభ్యాలని తమ జాతీయ అభివృద్ధికి మార్గం గా చేసుకుని  జన చైనా మహాప్రస్థానం సాగిస్తున్నది. , వంద సంవత్సరాల  చరిత్ర కలిగిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో  చైనా లక్షణాలతో సృజనాత్మకం గా  అభివృద్ధి  చేస్తున్న సోషలిస్ట్ రాజ్యంగా అప్రతిహతంగా, మును ముందుకు దూసుకు వెళుతున్నది.

 ఇది సహించలేని సామ్రాజ్య వాద  పెట్టుబడిదారీ  ఆధిపత్య వాదుల భయకంపిత  ఛిహనాలే , చైనా కు వ్యతిరేకంగా కూట ములు కట్టటం, చైనా లో భాగమైన  హాంకాంగ్ లో ప్రజాస్వామ్యం పేరిట ఆందోళన సృస్థించడం, ఒక చైనా అన్న సూత్రాన్ని అంగీకరిస్తున్నామని  చెబుతూనే తైవాన్ ను మెయిన్ లాండ్ కు వ్యతిరేకంగా ప్రోత్సహించడం, అడుగడుగునా చైనా వ్యతిరేక ప్రచారం కొనసాగించటం, వారి సంస్కృతిని, సాంకేతిక నైపుణ్యాన్ని కించపరచటం, వారి పై వాణిజ్య యుద్ధం ప్రకటించడం, కరోనా మిషతో అభాండాలు ప్రచారం చేయటం, వారు సాధించిన అద్భుత విజయాలను ఏమాత్రం గుర్తించకపోవటం,  అసలు ఈ ప్రపంచానికి  పెద్ద ప్రమాదం చైనా అనే బూటకపు వాదం యుద్ధభేరీలా మోగించటం. 

 అయితే  ప్రపంచ ప్రజల అబిప్రాయం భిన్నంగా వున్న ది. సామ్రాజ్యవాద ,ఆధిపత్య శక్తుల  దోపిడీ ప్రయోజనాలను, పీడక స్వభావాన్ని ప్రపంచ ప్రజలు అవగతం చేసుకుంటూ జన చైనా వెనుక నిలుస్తున్నారు, జేజేలు చెబుతున్నారు. వంద సంవత్సరాల చైనా కమ్యూనిస్టు పార్టీ   ఆవిర్భావ శత వార్షికోత్సవాన్ని ఆహ్వానిస్తున్నారు. తమ భూభాగం నుంచి , నిరు  పేదరికాన్ని పారద్రోలి మధ్యస్థ సంపన్న దేశంగా మార్చామని  ప్రకటించిన  చైనా పార్టీ నుంచి ప్రేరణ పొందుతూ , తమ దేశాలలో ఆ శుభ ఘడియ ఎప్పుడు? ఎలా తెచ్చుకోవాలి అని ఆలోచనల రెక్కలు విప్పుతున్నారు.  

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *