శ్రీశైలంలో ఊయల సేవ

శ్రీశైలం : లోక కల్యాణం కోసం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున    దేవస్థానం శుక్రవారం సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయల సేవను నిర్వహించింది.

ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఊయల సేవను జరిపించబడుంతోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పటించారు.తరవాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించారు.

అనంతరం ఊయలలో   శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షాడశోపచార పూజ జరిపించారు.తరువాత విశేషంగా అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్ర నామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన జరిపించబడింది.

చివరిగా ఊయల సేవ నిర్వహించారు.ఊయల సేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించారు.

పుష్పాలంకరణకు గాను పలు పుష్పాలు వినియోగించడం జరిగింది.అర్చక స్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ ఊయలసేవ విశేషార్చనలను నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *