దేశానికి పళ్ల బుట్టగా మారిన ఆంధ్ర ప్రదేశ్

(పూనం మాలకొండయ్య IAS)

ఆంధ్రప్రదేశ్ లో17.84 లక్షల హెక్టార్లలో ఉద్యానవనసాగు జరుగుతోంది. 312 లక్షల మెట్రిక్‌ టన్నుల పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి.

ఏపీ ప్రూట్‌ బాస్కెస్‌ ఆఫ్‌ కంట్రీ. గడిచిన నాలుగు నెలలుగా అంటే కోవిడ్‌ రెండో దశ ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యానవన రైతులు వారి పంట ఉత్పత్తులు అమ్ముకోవాడనికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అనేక చర్యలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఒక్క ఉద్యానవన రంగంలో మొత్తం 256 ఎఫ్‌పీఓలు ఉన్నాయి. ఈ రైతుల సంఘాలను బయట వర్తకులు, మార్కెట్‌లతో అనుసంధానం చేశాం.

కోవిడ్‌ నిబంధలు దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్నా.. మన రాష్ట్రంలో మాత్రం ఈ ఉత్పత్తుల రవాణా,ఎగుమతులను ఎక్కడా ఆపలేదు. మన గైడ్‌లైన్స్‌ ప్రకారం వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులు రవాణాను ఎప్పుడూ ఆపలేదు. ఈ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎంగారు ప్రతి సమావేశంలోనూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

కర్ఫ్యూ సమయంలో కూడా 24 గంటల రవాణాకు అనుమతించాలని ఆదేశించారు. అలాగే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలతో కూడా మాట్లాడ్డం జరిగింది.

 

 

పూనమ్ మాలకొండయ్య

*ఇతర రాష్ట్రాల అధికారులతోనూ సమన్వయం*
ఏపీకి ప్రధాన మార్కెటింగ్‌ ఢిల్లీ, బొంబాయి, చెన్నైలో ఉంటుంది. వీళ్లందరితో అంటే అక్కడి కమిషనర్లు, మార్కెటింగ్‌ సెక్రటరీలతో పాటు పోలీసులతో కూడా మాట్లాడి రవాణా, ఎగుమతులుకు కావాల్సిన ఏర్పాట్లు చేశాం. వాస్తవానికి పండ్లు వంటి నిల్వ ఉండని ఉత్పత్తులు త్వరగా పాడయిపోయే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో పండ్ల ఉత్పత్తులు చాలా ఎక్కువగా ఉంటాయి. మన అవసరాల కోసం వినియోగించుకోవడంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతులు వెళ్తాయి.

విదేశాలకు కూడా మన పండ్ల ఉత్పత్తులు ఎగుమతి జరుగుతోంది. అయినా అరటి, టమోట, నిమ్మ, చీనీ, ఉల్లి పంటలుకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. చిన్న, చిన్న సమస్యలున్నచోట కూడా సీఎం గారి ఆదేశాల మేరకు వెంటనే జోక్యం చేసుకున్నాం. తమిళనాడులో కోవిడ్‌ కారణంగా మార్కెట్‌ పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం ఉద్యానవన పంటల కోత కూడా పూర్తి కావస్తుంది.మామిడి పంట కోత సాగుతోంది. ఈ పంటలో మన దగ్గర 46 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. ఇందులో ఇప్పటివరకు 70 శాతం కోత పూర్తయింది.

మామిడి ఎగుమతులకు 27 కిసాన్‌ రైళ్లు

మామిడిలో మనకు 25 ఫార్మర్‌ ప్రొడ్యూస్డ్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌పీఓ)లు ఉన్నాయి. వాళ్లతో సమన్వయం చేస్తూ.. బయట మార్కెట్ల్, మామిడి వ్యాపారుతో కూడా మాట్లాడ్డం జరిగింది. దీనిలో మన అవసరాలు కోసం 25 నుంచి 30 శాతం వినియోగించుకోగా… మిగిలినది నేరుగా మార్కెట్‌కు పోవడం తోపాటు ప్రాసెసింగ్‌కు పోతుంది. ఈదఫా వర్తకులు, ఎగుమతిదారులతో కూడా సమన్వయం చేయడంతో పాటు సీఎం గారి ఆదేశాల ప్రకారం రైల్వేశాఖతో మాట్లాడి ఢిల్లీ మార్కెట్‌ కోసం కిసాన్‌ రైళ్లు కూడా ఏర్పాటు చేశాం. కేంద్ర రైల్వే శాఖ మన రాష్ట్రం నుంచి 27 కిసాన్‌ రైళ్లను దేశంలో వివిధ ప్రాంతాలకు రవాణా చేపట్టంది.

మరోవైపు మన రాష్ట్రంలో ఎక్కువ మ్యాంగో ప్రాససింగ్‌ యూనిట్లు చిత్తూరులో ఉన్నాయి. చిత్తూరులో మామిడి సాగు ఆలస్యంగా అవుతుంది. ఇప్పటివరకు 70 శాతం మామిడి కోత పూర్తవగా… మిగిలిన 30 శాతం కూడా చిత్తూరుతో పాటు, ప్రకాశం జిల్లా ఉలవపాడు ప్రాంతంలో ఉంది. మే రెండో వారం నుంచి మేం ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ ప్రతినిధులతో మాట్లాడుతున్నాం. కోవిడ్‌ను సాకుగా చూపి రైతును ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశారు.

మామిడికీ ఇ–క్రాప్‌

మామిడితోటలన్నీ కూడా ఇ–క్రాప్‌లో రైతుభరోసా కేంద్రాల ద్వారా నమోదు అయి ఉన్నాయి. ఆర్బీకేలో నమోదైన డేటాను బట్టి అక్కడి ఉన్న అగ్రికల్చర్, హార్టి కల్చర్‌ అసిస్టెంట్లుకు ముందు గైడన్స్‌ ఇచ్చాం.
మే ఆఖరు వారం, జూన్‌ తొలివారంలో అకస్మాత్తుగా వర్షాలు విరివిగా కురిశాయి. అంతకంటే ముందు రెండు తుఫాన్లు వచ్చినా మనపై ఎక్కువ ప్రభావం లేదు. ఆ టైంలో కూడా వారికి నిరంతరం సూచనలు చేస్తూనే ఉన్నాం. మొత్తం పంటను ఒకేసారి కోత కొయ్యెద్దని చెప్పాం. రేపు పంట కోత మొదలుపెడతారంటే ఆ మర్నాడు పంటను ఎక్కడకు తీసుకెళ్లాలి అనేది కూడా రైతులుకు ముందే చెప్పాం. అంత సూక్ష్మంగా రైతులను మానిటరింగ్‌ చేశాం.

రైతులు మోసపోకుండా నిరంతర పర్యవేక్షణ

గత ఐదు వారాలుగా గ్రామ స్ధాయిలో రైతులకు సూచనలు చేస్తూనే, వారికి మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యాలను మండల స్ధాయిలో కల్పిండంతో పాటు, రైతులను మోసం చేసే అనధికార మార్కెట్‌లను మూసివేస్తూ కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఏఎంసీలను మాత్రమే అధికార మార్కెటింగ్‌ కేంద్రాలుగా గుర్తించాం. ఇక్కడ నుంచి మరలా పంట రెండు విధాలుగా ఒకటి కొనుగోలుదారులుకు, మరోవైపు ప్రాసెసింగ్‌ యూనిట్లుకు పోతుంది.
ఈ క్రమంలో పుడ్‌చైన్‌లో వెళ్లేదాన్ని ఏఎంసీలకు పంపించాం. రెండోది ఏఎంసీలకు వెళ్లి అక్కడ నుంచి ప్రాసెసర్స్‌కు వెళ్లేట్టు కాకుండా నేరుగా ప్రాససింగ్‌ ప్లాంట్లుకి తీసుకెళ్లాలని చెప్పాం. ఇలా చేయడం వల్ల అదనంగా రవాణా ఛార్జీలను తగ్గించగలిగాం.

తహసీల్దారు నుంచి డిప్యూటీ కలెక్టర్‌ వరకూ..

అలా మానిటరింగ్‌ చేయడం కోసం సీఎం గారి ఆదేశాల ప్రకారం ఏఎంసీల్లో సీనియర్‌ మార్కెటింగ్‌ అధికార్లను నియమించాం. వారు ఇప్పటికీ అక్కడ పనిచేస్తున్నారు. ప్రతి ప్రాససింగ్‌ ప్లాంట్‌ వద్ద మరలా రెవెన్యూశాఖ నుంచి తహసీల్ధార్‌ మొదలు పెద్ద ప్లాంట్లు అయితే డిప్యూటీ కలెక్టర్‌ స్ధాయి అధికారి వరకు నియమించాం. దీనివల్ల సరుకు రాగానే రైతులను ఎక్కువసేపు ఇబ్బంది పెట్టకుండా చూడ్డంతో పాటు వారికిచ్చే ధరలను కూడా నమోదు చేయడం జరిగింది. ఇదే విధానాన్ని చిత్తూరుతో పాటు మామిడి ప్రాససింగ్‌ జరిగే అన్నిచోట్ల నిరంతరం అనుసరించాం.

నాణ్యతకు తగిన ధర

దీనివల్ల రైతులకి కిలోకి రూ.9 నుంచి రూ.14 వరకు నాణ్యతను బట్టి ధర వచ్చింది. సరాసరి రూ.12 రేటు తగ్గకుండా కలెక్టరు పర్యవేక్షించారు. గత నాలుగు వారాలుగా చూస్తే రూ.9 నుంచి రూ.14 వరకు ఉంది. చిత్తూరులో ఇంకా 50 శాతం పంట ఇంకా కోతకు ఉంది. జూలై ఆఖరు వరకు ఇది సీజన్‌ ఉంటుంది. ఇప్పుడు వారికి ధర పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. కోవిడ్‌ మార్గదర్శకాల్లో కొంత మినహాయింపులు వచ్చాయి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్ధితి ఉంది.

*రైతుల్లో అనవసర భయాందోళనలు సృష్టించొద్దు*
ఈ పరిస్ధితుల్లో మేం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఒక్కటే… మామిడి రైతుల్లో అనవసర భయాందోళనలు సృష్టించవద్దు. వారికి సరైన ధర రాదు అనే భయాన్ని కల్పించవద్దు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఉద్యానవనశాఖ కమిషనర్‌ ప్రతివారం చిత్తూరు వెళ్లి పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. కలెక్టరు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా పండ్లు ఇతర ఉత్పత్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. కోవిడ్‌ టైంలో ఇది సవాళ్లతో కూడుకున్నది. అయితే మనం గర్వంగా చెప్పుకోవచ్చు.

మరే రాష్ట్రంలోనూ లేని వ్యవస్ధ– ఆర్బీకేలు

ఆంధ్రప్రదేశ్‌లో మరే రాష్ట్రంలో లేని వ్యవస్ధ ఉంది. ముఖ్యమంత్రి శ్వైయస్‌.జగన్మోహన్‌ రెడ్డి  ప్రవేశపట్టిన రైతు భరోసా కేంద్రం ప్రతి గ్రామంలోనూ ఉంది. ప్రతి ఆర్బీకేలో అర్హత కల్గిన అగ్రికల్చర్, హార్టికల్చర్‌ అసిస్టెంట్లు ఉన్నారు. వారికి శిక్షణనిచ్చాం. వారి ద్వారా సీఎంయాప్‌ ద్వారా ఏ రోజు కారోజు ఏ పంటకు సంబంధించి ఎంత రేటు ఉంది, మనం ఏస్ధాయిలో జోక్యం చేసుకోవాలి అనేది నిరంతరం అప్‌డేట్‌ జరుగుతుంది. దేశంలో ఎక్కడా ఈ వ్యవస్ధ లేదు. గ్రామాల నుంచి మార్కెట్‌యార్డుల వరకు ఉత్పత్తులు వెళతాయి. దీనికి సంబంధించిన పర్యవేక్షణ మనకు కేవలం ఆర్బీకేల వల్ల సులభం అయింది.

కేంద్రం ప్రకటించని వాటికీ ఎంఎస్‌పీ
దానికితోడు ముఖ్యమంత్రి గారు పండ్ల ఉత్పత్తులతో పాటు ఇతర పంటలకు సంబంధించి కూడా ఓ నిర్ణయం తీసుకున్నారు. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం కూడా కనీస మద్ధతు ధర ప్రకటించని కొన్ని పంటలకు ఎంఎస్‌పీ ప్రకటించారు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఆ ఉత్పత్తులు పండిస్తారు. వేరే రాష్ట్రంలో ఉండదు. మన రాష్ట్రంలో ఇంత మంది రైతులున్నారు. వీరందరికీ మేలు జరిగేలా సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు.

గతేడాది మిర్చి పంటకు సీఎం గారు క్వింటాలుకు రూ.7000 ధర ప్రకటించారు. అంటే దీనర్ధం మార్కెట్‌లో ఆ ధరకు రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాలి. కేంద్రం నుంచి ఏం రాదు. పసుపుకి కూడా క్వింటాలుకు రూ.6850 ప్రకటించారు. ఉల్లికి క్వింటాకు రూ.770, చిరుధాన్యాలకు క్వింటాలుకు రూ.2500లు, అరటి క్వింటాకు రూ.800, చీనీ రూ.1400 క్వింటాకు ప్రకటించారు. ఇవన్నీ ఉద్యానవన పంటలే.

పెరిగిన ఉద్యానసాగు విస్తీర్ణం

ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెరిగింది. మిర్చి పంటను గమనిస్తే… గతేడాది కంటే ఈ యేడు సాగు పెరిగింది. పత్తి పంట నుంచి రైతులు మిర్చి సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. పసుపు ధర కూడా బాగుంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఉద్యానవనశాఖ మార్కెట్‌ జోక్యం వల్ల రైతులకు భరోసా లభించింది. దీనివల్ల గతే ఏడాది కాలంలోనే రైతులు ఇతర పంటల నుంచి సుమారు 65 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలవైపు మొగ్గుచూపారు. ఇది మంచి పరిణామం. మెట్ట భూముల్లో, బోర్‌వెల్స్‌ కింద వరి పంట నుంచి ఇలాంటి పంటలవైపు మళ్లడం మంచిది.

గ్రేడెడ్ ఎంఎస్‌పీ సీఎం గారు గ్రేడెడ్‌ ఎంఎస్‌పీని కూడా ప్రకటించారు. అంటే వేరుశెనగ తీసుకుంటే ఏ– క్వాలిటీ ఉంటే ఇంత రేటు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. అదే బి క్వాలిటీ అయితే రైతులు ఏం చేయాలి. అలాగే పెసలు కూడా. మెట్ట ప్రాంతాల్లో చిన్న రైతులు ఎక్కువగా సాగుచేసే పంటలివి. వీరికి సీఎం గారు గ్రేడెడ్‌ ఎంఎస్‌పీ ప్రకటించారు. టొబాకో బోర్డు గుంటూరులో ఉంది. కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్ధితుల్లో వాళ్లు కూడా పెద్దగా ఏం చేయలేకపోయారు. ఆ టైంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకుని రైతులకు మంచి ధర వచ్చేటట్లు చేయగలిగాం.

కేంద్రప్రభుత్వానికి సంబంధించి నాఫెడ్, సీసీఐ వంటి ఏజెన్సీలున్నా….. కేవలం ఆర్బీకేల వల్ల రాష్ట్ర ప్రభుత్వం రైతులు గరిష్ట ప్రయోజనం చేకూరేలా వ్యవహరించింది. ప్రతి ఆర్బీకే ఇప్పుడో కొనుగోలు కేంద్రంగా మారుతుంది. ఆ మేరకు వాటిని మేం బలోపేతం చేస్తున్నాం. ప్రతి ఆర్బీకేలో మాయిశ్చోమీటర్లు, సీడ్‌ టెస్టింగ్‌ యూనిట్లు ఉన్నాయి. రశీదు ఇవ్వడం కోసం కంప్యూటర్లు కూడా పెడుతున్నాం. వీటికి తోడు ఇ–క్రాప్‌. ఇ–క్రాప్‌లో ఏరైతు పేరు వచ్చిందో అతనికే అమౌంట్‌ వెళ్తుంది. అంటే పారదర్శకంగా ఉంటుంది.

ఫిజికల్ రిసిప్ట్‌
సీఎం గారి ఆదేశాల ప్రకారం ఈ ఖరీప్‌ సీజన్‌ నుంచి ఇ–క్రాప్‌కు సంబంధించి మేం ఫిజికల్‌ రశీదు కూడా ఇవ్వబోతున్నాం. గతంలో డిజిటల్‌ రిసిప్ట్‌ ఇచ్చేవారం. దానిమీద ఆధారపడే అతనికి అన్ని బెనిఫిట్స్‌ వస్తాయి. పంట పోయినా ఇన్‌పుట్‌ సబ్సిడీ వస్తుంది. ప్రొక్యూర్‌మెంట్‌ వస్తుంది. రైతు భరోసా వస్తుంది. క్రాప్‌ ఇన్సూరెన్స్‌ వస్తుంది. అందుకనే ఫిజికల్‌గా రశీదు కూడా ఇస్తున్నాం.

వైయస్సార్‌ రైతు దినోత్సవం –2 వేల గోడౌన్లు
వీటికి అదనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జూలై 8న డాక్టర్‌ వైయస్సార్‌ రైతు దినోత్సవం నాడు 2 వేలు గోడౌన్లు నిర్మాణానికి శంకుస్ధాపన చేయబోతున్నారు. దశలవారీగా రానున్న ఏడాది కాలంలో ప్రతి మేజర్‌ పంచాయితీలో ఒక గోడౌన్, ప్రతి ఆర్బీకేలో 500 మెట్రిక్‌ టన్నుల గోడౌన్‌ నిర్మాణాం చేపట్టాలన్నది సీఎం గారి ఆలోచన. దీంతో 1000 మెట్రిక్‌ టన్నుల గోడౌన్స్‌ నిర్మాణానికి కూడా ప్లాన్‌ చేస్తున్నాం. అందువల్ల రైతులు వారి ఉత్పత్తులను అక్కడే నిల్వ చేసుకోవచ్చు.

కోల్డ్‌ స్టోరేజీ ప్లాంట్లు

ఇక ఉద్యానవనపంటల విషయానికొస్తే… వాటికోసం కోల్డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్లు కూడా ఏర్పాటుకు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇవి కూడా ప్రతి ఆర్బీకేలో ప్లాన్‌ చేస్తున్నాం. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియతో పాటు అన్ని పనులు పూర్తయ్యాయి. జూలై 8న వీటి నిర్మాణానికి శంకుస్ధాపన చేసుకోబోతున్నాం. ఇంత విస్తృతంగా పంట కోత నుంచి చేస్తున్నాం. అంతకంటే ముందు కూడా పొలంబడిì , నాణ్యమైన సర్టిపై చేసిన విత్తనాలు, ఎరువులు ఆర్బీకేల ద్వారా అందించాలన్న సీఎం గారి స్పష్టమైన ఆదేశాలను అమలు చేస్తున్నాం.

ప్రతి జిల్లాలో పుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లు

ప్రతి జిల్లాలో పుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ప్రణాళిక సిద్దం చేస్తున్నాం. నూజివీడులో మ్యాంగో ప్రాససింగ్‌ యూనిట్, తూర్పుగోదావరిలో కొబ్బరి ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నాం. అలా 25 చోట్ల ఫల ఉత్పత్తులకు సంబంధించి సుమారు రూ.2500 కోట్లతో నాబార్డ్‌ సహకారంతో సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్మాణం చేపడుతున్నాం.

వరి మినహా రూ.6 వేల కోట్ల ఆహారధాన్యాల కొనుగోలు

మరోవైపు గత రెండేళ్లలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో వరి కాకుండా సుమారు రూ.6 వేల కోట్లు విలువైన ఆహారఉత్పత్తులును కొనుగోలు చేశాం. ఇది కేవలం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్లే సాధ్యమైంది.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా గడిచిన రెండేళ్లలో వారి కోసం అన్ని రకాల చర్యలను ప్రభుత్వం తీసుకుంది. రైలు, వాయు, రోడ్డు మార్గాలతో పాటు మన రైతుబజార్లు, మార్కెట్ల ద్వారా వారికి అన్ని రకాలుగా తోడ్పాడునందించాం. ముఖ్యమంత్రిగారు ప్రతి వారం దీనిపై అత్యంత సూక్ష్మంగా సమీక్ష చేస్తూనే ఉన్నారు.

ఉద్యానవనశాఖ తరపున మేం కూడా రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నాం. రైతులు సంఘాలుగా ఏర్పడ్డంలోనూ మేం సహకారమందించాం. రైతులు సంఘటితంగా ఉంటేనే వారికి మేలు జరుగుతుంది. ఒక్క ఉద్యానవనశాఖలోనే దాదాపు 250 ఎఫ్‌పీఓలు ఉన్నాయి.

ఉద్యానవనశాఖ– సాంకేతిక పరిజ్ఞానం

మేం ఉద్యానశాఖలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. డ్రోన్ల ద్వారా ఎరువులు స్ప్రే వంటివి త్వరలోనే మీరు చూస్తారు.
రైతు పంటలకు సంబంధించి సర్టిఫికేట్‌ కూడా మంజూరు చేయబోతున్నాం. రైతులు ఉత్తమ ఉద్యానసాగు విధానాలు అవలంభినప్పుడు.. వాటిని మనం సర్టిఫై చేస్తాం. రైతుల వాటిని చూపించినప్పుడు వారి ఉత్పత్తులకు మంచి ధరలు లభిస్తాయి. ఈ సర్టిఫికేషన్‌ కూడా ప్రభుత్వ సంస్ధల ద్వారా కాకుండా అపెడా గుర్తింపు పొందిన స్వతంత్ర సంస్ధల ద్వారా నిర్ధారించేలా చూడాలని సీఎం గారు ఆదేశించారు. ఈ యేడాది దీన్ని ప్రారంభించబోతున్నాం. ఇది కూడా రైతులకు మంచి రేటు రావడానికి ఉపయోగపడుతుంది. ఇలా రైతులకు విత్తానాల నుంచి పంట అమ్ముకునేంత వరకు అన్ని దశలలోనూ జోక్యం చేసుకుంటూ వారి ఉత్పత్తులకు మెరుగైన ధర వచ్చేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశాల మేరకు నిరంతరం ప్రయత్నిస్తున్నాము.

( శ్రీమతి పూనం మాలకొండయ్య,  ఉద్యానవన శాఖ స్పెషల్‌ సీఎస్‌, ఆంధ్ర ప్రదేశ్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *