“అఖిలేశ్ యాదవ్ ఇప్పుడు వీస్తున్న గాలి” విడుదల

“అఖిలేశ్ యాదవ్ ఇప్పుడు వీస్తున్న గాలి” (తెలుగు అనువాదం) పుస్తకం శనివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సమాజ్ వాది పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆవిష్కరించారు.

అఖిలేష్, ములాయం యాదవ్ ల రాజకీయ జీవితాలపై సునీతా ఆరోన్ ఇంగ్లిషు లో రాసిన ఈ పుస్తకాన్ని ప్రఖ్యాత ఇండియన్ బుక్ పబ్లిషింగ్ సంస్థ వెస్ట్ లేండ్ గ్రూప్ ప్రచురించింది. ఆధిపత్య కులాల పెత్తనం క్రూరంగా ఉండే హిందీ భాషా ప్రాంతంలో అణచబడ్డ కులాలలో చైతన్యం ఎలా ప్రోదిగొలిపి 23 కోట్ల జనాభా గల ఉత్తరప్రదేశ్ లో సొంతంగా ఈ కులాల అభివృద్ధి కోసం ఒక పార్టీ స్థాపించి అధికారంలోకి ఎలా వచ్చారు? అనే విషయాలు పుస్తకం లో వివరించారు.

ఈ పుస్తకం తెలుగులోకి అనువదిస్తే…ఇక్కడి బీసీ కులాలు చదివితే….తెలుగు ప్రాంతంలో ఈ వర్గాలవారిని చైతన్యపర్చడానికి, మనవాళ్ళు స్ఫూర్తి పొంది ఆర్గనైజ్ కావడానికి ఈ పుస్తకం ఒక ప్రధాన సాధనంగా, ఆయుధంగా ఉపయోగపడుతందన్న లక్ష్యంతో మలసాని పబ్లికేషన్స్ ద్వారా ఈ పుస్తకం ప్రచురించారు. పుస్తకం అఖిలేష్ యాదవ్ గారి చేత సాహు మహరాజ్ జన్మదినం రోజు జూన్ 26న ఆవిష్కరింప చేయలని ఈ రోజు కొంతమంది యాదవ మిత్రులం లక్నో కు చేరుకున్నామని మధు బొట్టా యాదవ్ చెప్పారు.

అఖిలేష్  తన నివాసంలో ఈ సాయంత్రం పుస్తకం ఆవిష్కరించి ఎంతో ఉత్తేజకరంగా, ప్రోత్సాహకరంగా, చనువుగా మాట్లాడారు.

తెలుగు లోకి ఇది అద్భుతమైన పుస్తకంగా రావడానికి కృషి చేసిన వారు మలసాని శ్రీనివాస్, మెరుగుమాల నాంచరయ్య, జి.వెంకటేష్ లు. సాంఘిక న్యాయ ఆలోచనాపరులైన మలసాని శ్రీనివాస్  , నాంచరయ్య , ప్రింట్ వర్క్ చేసిన వెంకటేష్ ఈ ముగ్గురూ లక్నోలో జరిగిన ఆవిష్కరణలో లేకపోవడం పెద్ద లోటు.

ఈ పుస్తకంలో ఉత్తర ప్రదేశ్ లో బీసీ ల అభివృద్ధి కోసం కృషి జరిగిన తీరుతెన్నులూ, బీసీ లను సంఘటితంగా ఏర్పచడంలోరామ్ మనోహర్ లోహియా  ములయామ్ యాదవ్ గార్ల కృషి గురించి విపులంగా చర్చించారు.

వారి దారిలో ఇప్పుడు అఖిలేష్ యాదవ్  బీసీ ఎస్సీ ఎస్టీ ల సమగ్రాభివృద్ది కి చేస్తున్న కృషి తదితర విషయాలు ఆసక్తికరంగా చెప్పడం జరిగింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *