ఇండియా స్టీల్ ఫ్రేం వంగిపోయింది… తెలంగాణలో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి కెసిఆర్ కు సిద్దిపేట కలెక్టర్ పాదాభివందనం వీడియో ఇది. నిన్నటి నుంచి వైరలవుతున్న వీడియో ఇది. అదివారం నాడు  కొత్త కార్యాలయం కొత్త కూర్చీలో ముఖ్యమంత్రి స్వయంగా కూర్చోబెడుతూనే తన జన్మధన్యమయిందనుకున్నట్లుకున్నారు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. తనకేదో పట్టాభిషేకం జరిగిదనట్లు ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు.

సివిల్ సర్వీసెస్ ను భారతదేశం మొదటి హోం మంత్రి ‘ఉక్కుమనిషి’  సర్దార్ పటేల్ ‘Steel Frame of India’అన్నారు. అంటే ఈ సర్వీసెస్ లో ఉన్న వాళ్లు ఎటువడితే అటువొంగరని, నిటారుగా, అప్ రైట్ గా ఉంటారని ఆ పెద్దాయన వూహించారు. ఏప్రిల్ 21, 1947న స్వతంత్ర భారతదేశంపు మొదటి బ్యాచ్ ఐఎఎస్ అధికారులను ఉద్దేశిస్తూ ఢిల్లీలోని మెట్ కాఫ్ హౌస్ లో ప్రసంగింస్తూ ఈ సర్వీసులను స్టీల్ ఫ్రేం అని వర్ణించారు. అందుకే ఈ తారీఖుని (ఏప్రిల్ 21)ని సివిల్ సర్వీసెస్ డేగా జరుపుకుంటున్నారు. స్వాతంత్య్రం రాక ముందు ఈ సర్వీసెస్ ను ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ICS) అనే వాళ్లు.

భారతదేశంలో సుపరిపాలనకు ఈ సర్వీసెస్ పునాదివేస్తాయని ,జాతికి సేవచేస్తాయని అని సర్దార్ పెటేల్ కలగన్నారు. వాళ్లు స్వతంత్రంగా పనిచేస్తారని ఆయన ఆశపడ్డారు.ఆవేశపడ్డారు. నిజానికి చాలా కాలం వరకు ఐఎఎస్ అధికారులు తెరవెనకే పనిచేశారు.వార్తల్లోకి ఎపుడూ రాలేదు. కనిపించే పని అంటే ప్రారంభోత్సవాలు, ఇఫ్తార్ పార్టీలు,వివాహాలకు హాజరుకావడంవంటి పనులను ‘నేత’లకు వదిలేసి ఐఎఎస్ అధికారులు పరిపాలన చూసే వారు తెరవెనక నుంచి. కాని పరిస్థితి ఇపుడు మారిపోతూఉంది. పటేల్ తన ప్రసంగంలో పేర్కొన్న ఆణి ముత్యం వంటి మాట ఏమిటంటే…

“Your predecessors were brought up in traditions which kept them aloof from the common run of the people. It will be your bounden duty to treat the common man as your own.”

ఇలా వంగి పోతూంటే స్టీల్ ఎక్కడున్నట్లు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో వూహించుకోవచ్చు. ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎటువోతున్నాయో రోజూ మనం జూస్తున్నాం. రిటైరయ్యాక ఏదో ఒక పోస్టింగ్ కోసం ఐఎఎస్ లు ఎంత తాపత్రయ పడుతుంటారో చూస్తుంటాం. ఇది ఇలా కలెక్టర్ స్థాయి నుంచే మొదలవుతుంది.

 

ఇది కొత్త కాదు. గతంలో ఒక సారి ఒక కలెక్టర్ నాటి నిజామా బాద్ ఎంపి కవి కాళ్ల దగ్గిర కూర్చుని ముచ్చట్లాడటం సంచలనం సృష్టించింది.

పతనం ఎపుడో మొదలయింది

నిజానికి ఐఎఎస్ సర్వీసులు పతనం ఎపుడో మొదలయింది. ఈ విషయాన్ని ఎవరోబయటి వ్యక్తి  అసూయతో చెప్పలేదు. 1951 ఐఎఎస్ బ్యాచ్ బీహార్ క్యాడర్ కు చెందిన పిఎస్ అప్పు గొప్పగా చెప్పారు. ఆయన Decline, Debasement and Devastation in the All India Services అనే పేరుతో ఈ సర్వీసులలో  మొదలయిన పతనం గురించి 2005లో ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ లో అద్భుతంగా  రాశారు. ఈ సర్వీసెస్ రాజకీయ నాయకులకు విదేయంగా ఉండకుండా రాజ్యాంగానికి విధేయంగా ఉండాలన్న పటేల్ కల చెదిరిందని ఆయన రాశారు. ఆల్ ఇండియా సర్వీస్ లవారు ఇలా స్టీల్ ఫ్రేం లాగా వంగి పో కుండా ఉండేందుకురాజ్యాంగంలో ఎన లేనిభద్రత కల్పించారు.

అయితే, ఒక రెండు దశాబ్దాల పాటు(1947-1962) ఐఎఎస్ వంటి అఖిల భారత సర్వీసులు మన రాజ్యాంగ నిర్మాతల, తొలినాళ్లభారత ప్రభుత్వం అంచనాల ప్రకారం పనిచేసిందని, ఆ తర్వాత పతనం ప్రారంభమయింది అని అప్పు రాశారు.

For some two decades the All India Services, by and large, functioned as envisaged by the founding fathers. Then the decline started, first slowly, and later at an accelerated pace. The nadir was reached in Gujarat in recent weeks. The IAS and IPS have been laid prostrate. The once superb administrative structure lies in ruins, reduced to a shambles. Evidently, these Services no longer serve the purpose for which they were established.

అప్పు బీహార్ లో తన అనుభవం గురించి రాసినా అది అన్ని  రాష్ట్రాలకు వర్తిస్తుంది. దీని పతాక స్థాయి తెలంగాణలో నిన్న కనిపించింది.

ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకు అధికారులు ఆరాటపడం ఈ మధ్య ఎక్కువయింది.  ముఖ్యమంత్రినచ్చేలా పనిచేయడం ఇప్పటి ట్రెండ్. ముఖ్యమంత్రి నచ్చకపోతే, మంచి మంచిపోస్టింగులు రావని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రికి నచ్చకపోతే, వేర్ హౌసింగ కార్పరేషన్ లేదాడిపార్ల్ మెంట్ ఆప్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, మైనారిటీ వెల్ ఫేర్ వంటి  వాటిలో పడేస్తారని చాలా మంది ఐఎఎస్ లు అందోళన చెందుతూ ఉంటారు. పవర్ లో ఉన్న వాళ్లకి భయపడకుండా పనిచేస్తూ, ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పనిచేస్తాననే అధికారులు బాగా తక్కువ. ఇది అన్ని రాష్ట్రాలలో కనిపిస్తూ  ఉంది. ముఖ్యమంత్రులుకూడా రిటైరయ్యాక అడ్వయిజర్ల  పోస్టులను ఆశపెట్టి అధికారులను నియంత్రిస్తూ ఉంటారు.

ఐఎఎస్ వ్యవస్థ నిజాయితీగా, నిటారుగా నిలబడి పనిచేయాలని ఆశించిన వాళ్లంతా   పిఎస్ అప్పు రాసిన అర్టికిల్ ని తప్పక చదవండి.

One thought on “ఇండియా స్టీల్ ఫ్రేం వంగిపోయింది… తెలంగాణలో కొత్త అధ్యాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *