జగన్ జాబ్ క్యాలెండర్ కు ఉద్యోగుల మద్దతు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు సంబంధించి 2021-2022 సంవత్సరపు జాబ్ క్యాలెండర్ విడుదల చేయటాన్ని AP JAC అమరావతి స్వాగతించింది.

ఈ మేరకు AP JAC అమరావతి నేతలు బొప్పరాజు, వైవీ రావు ఒక ప్రకటన విడుదల చేశారు.

◆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలకే సుమారు 6,03,756 ఉద్యోగాలు అనగా లక్షలాది గ్రామ సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటరీస్, APSRTC కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవటం ఒక  సాహసోపేతమైన నిర్ణయమని వారు పేర్కొన్నారు.

◆ APSRTC ఉద్యోగులను ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించినట్లు ఎలా చూపిస్తారని కొంతమంది రాజకీయ నాయకులు మీడియా ముందు ప్రస్తావించడం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

◆ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అడిగితే ‘మీరు కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఎలా అడుగుతారు’ అని ప్రశ్నించిన నాయకులు ఈ రోజు ఈ విధమైన ప్రకటనలు ఎలా చేస్తున్నారో మాకు అర్ధం కావడం లేదు అని వారు అన్నారు.

◆ APSRTC నష్టాల బాటలో నడుస్తూ వేల కోట్ల రూపాయలు అప్పుల్లో వుండి జీతాలకే ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కార్మిక సంఘాలు 2013 లోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినాయి. ఆనాటి నుండి ఆర్టీసీ ని ప్రభుత్వ పరం చేయాలనే డిమాండ్ తో అనేక ఉద్యమాలు చేసిన పరిస్తితి. ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.

◆ కానీ, ఆనాడు పాదయాత్ర చేస్తున్న శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గార్ని ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయవలసిన ఆవశ్యకతను కార్మిక సంఘాలు వారికి తెలియ చేయగా.. అధికారంలోకి వచ్చిన వెంటనే విలీనం చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి తొలి కేబినెట్ మీటింగ్ లోనే దాదాపు యాభై రెండువేల మంది కార్మికులను ప్రభుత్వం లోకి విలీన ప్రక్రియ ప్రారంభించి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మన గౌ11ముఖ్యమంత్రి గారిని PTD ఉద్యోగులు ఎన్నటికీ మరువలేరని అన్నారు.

◆ ఆర్టీసీ కార్మికులుగా జీతాలకే ఇబ్బందులు పడుతున్న షుమారు 51,387 మందిని 01/01/2920 నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్మెంట్ వయస్సు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు 2019 సెప్టెంబర్ నుండి పెంచి PTD(RTC) ఉద్యోగులలో మనో ధైర్యాన్ని నింపారు అని అన్నారు.

◆ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందునే, ఈ కరోనా కష్ట కాలంలో గత సంవత్సర కాలంగా RTC సంస్థ ఆర్ధికంగా తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నప్పటికి, అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చినందున, నేడు PTD(RTC) శాఖలో పనో చేస్తున్న ప్రతి ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 1వ తారీకున జీతభత్యాలు తీసుకుంటున్నారని, వారందరి కుటుంబాలలో వెలుగులు నింపిన గౌరవ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అన్నారు.

◆ ప్రభుత్వంలో విలీనం జరిగిన తరువాత PTD ఉద్యోగులకు ఇటీవలే సర్వీస్ రూల్స్ కూడా ప్రభుత్వం ఆమోదించినప్పటికి, ఇప్పటికి PTD (RTC) శాఖాలోని కొందరికి వారి వారి సర్వీస్ రూల్స్ నందు కొన్ని ఇబ్బందికరమైన రూల్స్ కు సవరణలు అవసరమైనందున, 2014 కు ముందు ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు పెన్షన్ అమలుచేయటం తదితర అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా సానుకూలంగా స్పందిస్తారనే ఆశాభావాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నామని బొప్పరాజు& వైవీ రావు లు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *