వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిన్నజరిగిన వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ఆంధ్ర ప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించింది.
13.74 లక్షల మందికి నిన్న ఒక్కరోజులోనే వ్యాక్సిన్ వేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇది ప్రపంచరికార్డు కూడా. మొత్తం 2,266 కేంద్రాల్లో జరిగిన టీకా కార్యక్రమంలో గతంలోని 6.28 లక్షల సొంత రికార్డ్ ని బ్రేక్ చేస్తూ 13 లక్షలు దాటింది. 13.74 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసి సరికొత్త ప్రపంచ రికార్డ్ సృష్టించిన ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఆంధ్ర కు బయట దేశంలో బీహార్ లో మాత్రమే 5 లక్షలు వ్యాక్సినేషన్ ప్రక్రియ దాటింది. జూన్ 16 న బీహార్ లో 5.85 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసింది.
ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలోనూ ఏప్రిల్ 5 న అత్యధికంగా 5.13 లక్షలు మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది.
మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలోనూ ఏప్రియల్ 26 న 5.41 లక్షలు మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది.
పెద్ద రాష్ట్రాలని మించి ఒక్క రోజులోనే 13 లక్షల దాటడం ఆంధ్రలోనే జరిగింది. ఈ విషయంలో గ్రామ స్ధాయి నుంచి వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధ, వైద్య ఆరోగ్య శాఖ పక్కా ప్రణాళిక బాగా పని చేశాయి.
ఏపిలో నిన్న సింగిల్ డోసు వేసుకున్న వారి సంఖ్య 12,87,071. రెండవ డోసు తీసుకున్నవారు 87142.
ఏడు జిల్లాలలో లక్షకు మించి వ్యాక్సిన్లు వేశారు. అవి:
పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్టణం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు. అత్యధికంగా వ్యాక్సినేషన్ జరిగిన జిల్లాలు ఇవే..
పశ్చిమగోదావరి- 1.65 లక్షలు
తూర్పుగోదావరి- 1.55 లక్షలు
కృష్ణా జిల్లా – 1.41 లక్షలు
విశాఖపట్నం- 1.12 లక్షలు
గుంటూరు- 1.07 లక్షలు
ప్రకాశం- 1.03 లక్షలు
చిత్తూరు – 1.02 లక్షలు