సిద్దిపేట ప్రారంభోత్సవాలు ముగించుకుని హైదరాబాద్ వెళ్తుండగా ఆర్థిక మంత్రి హరీష్ రావు కాన్వాయిలోని ఒక కారుకు ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లో ముందు వెళ్తున్న కారుకు అడవి పందులు అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ వేగంగా దూసుకుపోతన్నపుడు అయిదారు పందులు రోడ్డు దాటబోతున్నాయి.
అడవి పందులు అడ్డురావడంతో డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేయడం తో ఆ కారు వెనుక పైలెట్ కారును ఢీ కొంది. దీనితో మంత్రి హరీష్ రావు కారు పైలట్ కారును ఢీ కొంది.
సడన్ బ్రేక్ వేసిన ముందు కారులోని వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. గాయాలయిన వ్యక్తిని ఆసుపత్రికి పంపించారు. మరోకారులో హరీష్ రావు హైదరాబాద్ చేరుకున్నారు.
కొండపాక మండలం బంధారం దర్గా కమాన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.