అలా లాక్ డౌన్ ఎత్తేసి, ఇలా జనం మధ్యకు వచ్చిన కెసిఆర్ (ఫోటో గ్యాలరీ)

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కోవిడ్ లాక్ డౌన్ ఎత్తేస్తున్నట్లు ప్రకటించిన పన్నెండు గంటల్లోనే జనం మధ్యకు వచ్చారు. ఆదివారం ఆయన అనేక ప్రారంభోత్సవాలలో పాల్గొన్నారు. ప్రసంగించారు. తనదైన శైలిలో హాస్యం గుప్పిస్తూ అందరిని చాలా కాలం తర్వాత నవ్వించారు.

ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి వాయుమార్గంలో బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ 12 గంటలకు సిద్దిపేటకు చేరుకున్నారు.

– సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి హరీశ్ రావు, ఎంపీ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

– తన రాక సందర్భంగా అక్కడకు చేరుకున్న సిద్దిపేట ప్రజలను, పుర ప్రముఖులను ఆప్యాయంగా పేరు పేరునా పలకరించిన సీఎం కెసిఆర్ వారితో కలిసి గ్రూపు ఫోటో దిగారు.

(

– సీఎంపై సిద్దిపేట ప్రజల అభిమానం వెల్లువెత్తింది. జై కెసిఆర్ జై తెలంగాణ నినాదాలతో క్యాంప్ కార్యాలయం మార్మోగింది.

– అక్కడి నుంచి సీఎం కేసీఆర్ కొండపాక మండలం రాంపల్లి శివారులో నిర్మించిన పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ప్రారంభానికి అక్కడి కి చేరుకున్నారు. అక్కడ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాండ్ బృందం స్వాగతం పలికింది.

– పోలీసు గౌరవ వందనం స్వీకరించిన తర్వాత పోలీసు కమిషనరేట్ ను సీఎం ప్రారంభించారు. అనంతరం కార్యాలయం కలియదిరిగి పరిశీలించారు. నిర్మాణాల పట్ల సీఎం సంతృప్తిని వ్యక్తం చేశారు.

– అనంతరం సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం దుద్దెడ శివారులో కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించడానికి సీఎం కలెక్టరేట్ కు చేరుకున్నారు.

అక్కడ సీఎంకు పూర్ణ కుంభంతో, వేదమంత్రాలతో పండితులు స్వాగతం పలికారు.

– అనంతరం జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కలెక్టర్ ఛాంబర్ ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డిని ఆశీర్వదించారు.

– విశాలమైన కారిడార్లతో, ఎత్తైన స్లాబులతో, క్రాస్ వెంటిలేషన్ తో నిర్మితమైన కలెక్టరేట్ లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తుండటాన్ని స్వయంగా చూసిన ముఖ్యమంత్రి కలెక్టరేట్ నిర్మాణ ఆర్కిటెక్ట్ ను, వారి టీమును ప్రశంసించారు. అద్భుతమైన రీతిలో కలెక్టరేట్ ను తీర్చిదిద్దారని మెచ్చుకున్నారు. “యూ ఆర్ డాటర్ ఆఫ్ తెలంగాణ .. ఐయామ్ ప్రౌడాఫ్ యూ.. ” అని సీఎం కేసీఆర్ ఆర్కిటెక్చర్ ఉషారెడ్డి ని అభినందించారు.

– నిర్మాణంలో భాగస్వాములైన అధికారులు గణపతిరెడ్డికి, సుద్దాల సుధాకర్ తేజకు, నిర్మాణ ఏజెన్సీ షాపూర్ జీ పల్లోంజీ ప్రతినిధులకు, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, సీఎస్ సోమేశ్ కుమార్ కు, కలెక్టర్ వెంకట్రాంరెడ్డికి శాలువా కప్పి, మెమెంటో ఇచ్చి సత్కరించారు.

– అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్సు హాలులో పాల్గొన్న వారినుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పాలనా సంస్కరణలు సహా, పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల పనితీరును, అవి ప్రజలకు అందిస్తున్న ఫలాల గురించి పేరుపేరునా పథకాలను సీఎం సోదాహరణలతో వివరించి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *