సీఎం జగన్ మీదకు మద్యం బాణమేసిన రెబెల్ ఎంపి రఘురామ

సీఎం జగన్ కు వైసిపి ఎంపీ రఘురామకృష్ణరాజు తొమ్మిదో లేఖ రాశాారు. నిజాని కి  ఇది చాలా మంచి లేఖ.వూరికే తగవు పెట్టుకోకుండా విషయాన్ని పరిపాలన వైఫల్యం మీదకు మళ్లించిన లేఖ.

చాలా మంది ప్రజలు పైకి చెప్పుకోలేక పోతున్న బాధని ఆయన వ్యక్తం చేశారు. ఆయన ఈ సారి ముఖ్యమంత్రి మీదకు మద్యం బాణ మేశారు. ఆంధ్రలో మద్యపాన నిషేధం ఎలా ఉంది, ప్రధాన బ్రాండ్లు దొరక్కుండా చేసి, లోకల్ బ్రాండ్లు సృష్టించి రాష్ట్రంలో మద్యం మీద కోట్లు దండుకుంటున్న విధానాన్ని, మద్యం రేట్లను ను ప్రస్తావించారు.

ఈ వ్యవహారం మద్యం కాబట్టి, ప్రభుత్వాన్ని బయటకు తిట్టలేక, లోన మౌనంగా ఉండలేక మద్యాంధ్రులు బాధపడ్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ    రఘురామకృష్ణ ఈ లేఖ రాశారు.

రాజు ఇక తన పోరాటాన్ని ఇలాంటి ప్రజాసమస్యలమీదకు, అక్రమాలకు మీదకు మళ్లించాలి. తొమ్మిదో లేఖలో  నర్సాపురం ఎంపి సంపూర్ణ మద్య నిషేధం హామీపై సీఎంని గట్టిగా ప్రశ్నించారు.

Kanumuru Raghu Rama krishnamraju ycp mp (Facebook picture)

ఆంధ్రలో మధ్య పాన నిషేధం ఒక ఫార్స్.  అది ఏమాత్రం అమలు కావడం లేదు. దాని పేరు  మీద భారీగా మద్యం వ్యాపారం, అక్రమాలు జరుగుతున్న విషయాన్ని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికల హామీ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కావడం లేదని  ఆయన వెేలెత్తి చూపారు.

నిషేధం అమలుజరగక పోవడం కాదు, మద్యపానాన్ని  ప్రోత్సాహించడం జరుగుతోందని, ఏపీలో గతేడాదితో పోలిస్తే ఈ సారి 16 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయాని ఆయన అన్నారు.

మద్యనిషేధం అమలు హామీతోనే మహిళలు వైసీపీకి ఓటువేశారని గుర్తు చేస్తూ, అమ్మ ఒడి ద్వారా పేదలకు మీరిచ్చే డబ్బు  మద్యం ధరల పెంపుతో తిరిగి వసూలు చేస్తున్నారన్న చర్చ మొదలైందని ఆయన పేర్కొ్నారు.

అమ్మ ఒడి-నాన్న బుద్డి పథకం అని ఎగతాళి చేస్తున్నారని అన్నారు. అంతేకాదు, ప్రపంచంలో ఎక్కడాలేని పేర్లతో కొంతమంది నాసిరకం మందు తయార చేసిన ఆంధ్రలో పండగ చేసుకుంటున్న విషయాన్ని ఆయన  ప్రస్తావించారు.

సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయండి లేదా కనీసం నాణ్యమైన మద్యాన్ని అందించండని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

మద్యం రేట్లను కూడా తగ్గించాలని  ఆయన కోరారు.

వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే మన పథకాన్ని ఇల్లు గుల్ల..ఒళ్లు గుల్ల పథకంగా ప్రజలు చెప్పుకుంటారని రఘురామకృష్ణరాజు చురక వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *