బిజెపికి కాంగ్రెస్ సవాల్ గా మారుతుందా: జర్నలిస్టు శేఖర్ గుప్తా విశ్లేషణ

2024 సార్వత్రిక ఎన్నికలు జరిగే నాటికి 16 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.

వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాలలో అంటే ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాల, మణిపూర్ లలో 2022 ఫిబ్రవరి-మార్చిలో, గుజరాత్, హిమాచల్ ప్రదేశలలో అక్టోబర్ –డిసెంబర్ ఎన్నికలు జరుగుతాయి.

ఇక 2023 లో,  తొమ్మిది రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలలో  ఫిబ్రవరిలో,  కర్నాటకలో మే నెలలో, తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీష్ గడ్, తెలంగాణ, మిజోరాంలలో ఎన్నికలు జరుగుతాయి.

విశేషమేమిటంటే,  ఈ రాష్ట్రాలలో ఒక్క ఉత్తర ప్రదేశ్ లో తప్ప అన్ని చోట్లా  బిజెపికి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే.

2018 నుంచి జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే, ఒకటి రెండు చోట్ల మినహా అన్ని చోట్లా బిజెపి పరాజయం పాలయింది.  2018 నుంచి మొత్తంగా 23 ఎన్నికలు జరిగితే, బిజెపికి స్వతంత్రంగా మెజారిటీ వచ్చిన రాష్ట్రాలు రెండే, త్రిపుర, అరుణచాల్ ప్రదేశ్.  మొన్న జరిగిన ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాం ను నిలుకున్నారు.  ఈ ఒరవడే కొనసాగితే, కాంగ్రెస్ కు  2024 నాటికి పుంజుకుంటుందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇపుడుబిజెపికి కాంగ్రెస్ చాలా చాలా దూరాన ఉంది. ఎంత దూరాన ఉన్నా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే బిజెపికి ప్రత్యామ్నయంగా కనిపిస్తుంది. ఈ 16 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ తన ప్రాబల్యం కాపాడుకున్నా చాలా  2024 ఎన్నికలనాటికి అది పార్టీ కార్యకర్తలను బాగా ఉత్సాహపరుస్తుంది.

2024 నాటికి బిజెపికి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాం లేకపోలేదని ప్రముఖ్య జర్నలిస్టు శేఖర్ గుప్తా చెబుతున్నారు. 2014, 2019 ఎన్నికలను చూస్తే ఇది అంత నమ్మశక్యమయిన వాదన అనిపించదు.  ఎందుకంటే,  2014 నాటికంటే  2019 నాటికి కాంగ్రెస్ పరిస్థితి దిగజారింది.  2014లో బిజెపి కాంగ్రెస్ లకు వచ్చిన ఓట్ల శాతం 88:12. 2010 నాటికి ఇది 92:8 శాతానికి పడిపోయింది. అయినా కూడా బిజెపికి దూరంగానే ఉన్న పోటీ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆయన ది ప్రింట్ లో రాశారు. మోదీ చేతిలో రెండు భారీ ఎదురు దెబ్బలు తగిలినా కాంగ్రెస్ పార్టీ 20 శాతం ఓట్లను కాపాడుకుంది. అందువల్ల దేశంలో మరొక ఇతర పార్టీ రెండో స్థానం నుంచి కాంగ్రెస్ ను తొలిగించలేదని ఆయన అన్నారు. ఈవిషయం తెలుసుకాబట్టే కాంగ్రెస్ మచ్చుకైనా కానరాని బెంగాల్  ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తూ వచ్చారు. నెహ్రూ-గాంధీ కుటుంబాన్నే విమర్శిస్తూప్రచారం చేశారు.

కాంగ్రెస్  బలపడేందుకు అవకాశం ఉందని గ్రహించారు కాబట్టి, బాగా బలహీనపడినా రాహుల్ గాంధీని పప్పు అని, సోనియా గాంధీని విదేశీ మహిళ అని వదలకుండావిమర్శిస్తూ వస్తున్నారు.

మోదీ, అమిత్ షాలకు మూడు విషయాలు బాగా తెలుసు

  1. బిజెపికి ఎప్పటికై సవాల్ విసిరేది కాంగ్రెస్ పార్టీయే.
  2. బిజెపిని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కు కాషాయ పార్టీకంటే ఎక్కువ వోట్లు రావలసిన అసవరం లేదు. ఇపుడున్న 20 శాతం కాంగ్రెస్ ఓట్లు 25 శాతానికి పెరిగితే చాలు, దేశ రాజకీయాలు మారిపోతాయి. ఒకవేళ వచ్చేది కూడా బిజెపి-ఎన్ డిఎ ప్రభుత్వమే అయినా, అపుడు అది రియల్ ఎన్డీయే ప్రభుత్వం అవుతుంది. బిజెపి పెత్తనం తగ్గిపోతుంది.
  3. కాంగ్రెస్ ను సమైక్యంగా ఉంచే శక్తి ఒక్క గాంధీ కుటుంబానికి మాత్రమే ఉంది. అందుకే నిరంతరం ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీ,షా లు  కాంగ్రెస్ మీదే దాడిచేస్తూ ఉండాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *