తెలంగాణలో కొండెక్కనున్న కోడి గుడ్డు ధర…

మనం తినే ఆహార పదార్థాలలో సులభంగా, చౌకగా ప్రొటీన్లను అందించే వస్తువు కోడిగుడ్డు మాత్రమే. ఇపుడు కోడిగుడ్డు హైదరాబాద్ లో దొరకడం కష్టమవుతున్నది. ఖరీదూ అవుతున్నది. రాష్ట్రంలో కోడిగుడ్ల ఉత్పత్తి కూడా బాగా పడిపోయింది. అంటే కోవిడ్ కారణంగా డిమాండ్ విపరీతంగా పెరగడం, ఉత్పత్తి పడిపోవడం, కోళ్ల దాణ ధరలు పెరగడంతో తెలంగాణలో కోడిగడ్ల ధర కొండెక్కే అవకాశం మెండుగా ఉంది.

కోవిడ్ పాండెమిక్ లో మంచి ప్రొటీన్లు ఫుడ్ తీసుకోవాలనేది ఒక నియమం కావడంతో అంతా కోడి గుడ్లమీద పడిపోయారు. దీనితో గుడ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. కోడి గుడ్ల కరువొచ్చే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీనితో గడ్డు ధర  6 రుపాయలు దాటింది. గతంలో ఎపుడూ గుడ్డుధర రు.6 దాట లేదు. ఇపుడు ప్రాంతాన్ని బట్టి హైదరాబాద్లో ఆరునుంచి ఏడు రుపాయల  దాకా గుడ్డు  అమ్ముడవుతూ ఉంది. డజన్ గుడ్ల ధర రు.75  నుంచి 80 దాకా పలుకుతూ ఉంది.

కోవిడ్ వచ్చినవాళ్లు తొందరగా కోలుకోవాలంటే మంచి ప్రొటినస్ ఫుడ్ తినాలనే ప్రచారం బాగా జరుగుతూ ఉంది. దీనితో ఆహారపదార్ధాల డిమాండ్ పెరిగింది.  ఫలితంగా తలసరి గుడ్ల వాడకం పెరిగింది. గతంలో  నెలకు పది పన్నెండు గుడ్లు తినే వ్యక్తి ఇపుడు దాదాపు రోజూ కు ఒకటి రెండు గుడ్లు తీసుకుంటున్నారు. కోవిడ్ వచ్చినవాళ్లు కోవాలని, కోవిడ్ రాని వాళ్లు అది రాకుండా ఇమ్యూనిటీ పెంచుకోవాలని గుడ్ల వాడకం పెంచారు.

గత ఏడాది కరోనావేవ్ 1 లాక్ డౌన్  సమయంలో దేశమంతా రవాణ బంద్ అయింది. అపుడు తెలంగాణ నుంచి గుడ్లు ఇతర రాష్ట్రాలకు రవాణా చేయడం బంద్ అయింది. దీనితో తెలంగాణలో ఉత్పత్తయిన గుడ్లున్ని ఇక్కడే ఇరుక్కుపోయాయి. దీనితో అపుడు గుడ్ల ధరలు బాగా పడిపోయాయి. ఒక డజను గుడ్ల ధర  రు. 30కంటే కిందికి పడిపోయింది. కోవిడ్ సెకండ్ వేవ్ ఇంటర్ స్టేట్ రవాణా బంద్ చేయడం లేదు. దీనితో తెలంగాణానుంచి కోడిగుడ్లు యాథావిధిగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతూ ఉన్నాయి. స్థానికంగా డిమాండ్ పెరగడం, ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతూ ఉండటంతో, తెలంగాణలో కోడిగుడ్ల కొరత వచ్చే అవకాశముందని చాలా మంది ఇండస్ట్రీ వాళ్లు అనుమానిస్తున్నారు.

మరొక విషయం ఏంటంటే, గతంలో గుడ్లు తినని వాళ్లు కూడా ఇపుడు గుడ్డకు అలవాటుపడుతున్నారు. వాడకం పెరగడంతో పాటు కోళ్ల దాణా ధర పెరగడం కూడా దీనికి కారణం. ఈ మధ్య కాలంలో కోళ్ల దాణలో వాడే సోయాబీన్ కేక్, మొక్కజొన్నల ధరలు విపరీతంగా పెరిగాయని, దీనితో కోళ్ల ఫారాల నిర్వహణ ఖరీదైన వ్యవహారం గా మారిందని నేషనల్ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ బిజినెస్ మేనేజర్ సంజీవ్ చింతావర్ తెలిపారు. దీనితో ఈకోళ్ల పరిశ్రమ సరిగ్గా నడవక  కోళ్లఫారాలుమూతపడుతున్నాయని, తెలంగాణలో  రోజూ మూడున్నర కోట్లు ఉన్న గుడ్ల ఉత్పత్తి ఇపుడు మూడు కోట్లకు పడిపోయిందని ఆయన చెప్పారు. జాతీయ స్థాయిలో కూడా కోడిగుడ్ల ఉత్పత్తి పడిపోయింది. 30కోట్ల గుడ్ల ఉత్పత్తి  24 కు తగ్గింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *