‘హిడెన్ స్ప్రౌట్స్’ స్కూల్ ని కూల్చేసేందుకు ఎలా మనసొప్పింది: చంద్రబాబు

విశాఖపట్నంలోని వివిధ రకాల మానసిక , శారీరక లోపాలు గల పిల్లల పాఠశాల హిడెన్ స్ప్రౌట్స్‌ (Hidden Sprouts) ను కూల్చివేయడం పై  ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

ఈ మధ్య ఈ పాఠశాలను అధికారులు కూల్చివేశారు. లాభాపేక్ష లేకుండా నడుపుతున్న ఈ పాఠశాలను కూల్చివేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు  నాయుడు లేఖ రాశారు.

• వైసీపీ ప్రభుత్వ కూల్చివేత చర్యలలో తాజాగా విశాఖపట్నంలో చోటుచేసుకున్న కూల్చివేత చర్య అత్యంత హేయకరమైనది.
• లాభాపేక్షలేని వివిధ మేధో మరియు శారీరక సామర్థ్యత గల పిల్లల పాఠశాల హిడెన్ స్ప్రౌట్స్‌ ను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడం విచారకరం.
• గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) 2013 లో ఈ పాఠశాలను రెండు గదులతో లీజుకు తీసుకుంది. ప్రస్తుతం ఇది సుమారు 190 మంది విద్యార్థులతో నడుస్తోంది.
• పాఠశాలలో చదువుతున్న పిల్లలలో చాలా మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి వచ్చిన వారే.

 

• ప్రభుత్వ అధికారులు 05 జూన్ 2021, శనివారం నాడు తాత్కాలిక షెడ్లను కూల్చివేసి, పాఠశాల ప్రాంగణాన్ని 6 జూన్ 2021, ఆదివారం నాడు స్వాధీనం చేసుకున్నారు.
• పాఠశాలకు ఎటువంటి వ్రాతపూర్వక నోటీసు ఇవ్వకుండా సహజ న్యాయం సూత్రాలకు వ్యతిరేకంగా కూల్చివేత జరిగింది.
• నాగరిక సమాజంలో ఇటువంటి దారుణమైన చర్యకు అనుమతించడం సిగ్గుచేటు.
• మనలాంటి ప్రజాస్వామ్య మరియు రాజ్యాంగబద్ధంగా పాలన సాగించే దేశంలో ఇటువంటి చర్యల వల్ల కలిగే ఆవేదన మాటల్లో వ్యక్తపరచలేము.
• చట్టం, న్యాయం అనే నాగరిక నిబంధనలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.
• 2021 జూన్ 5 న మానసిన వికాలాంగుల పిల్లల పాఠశాలను కూల్చివేసిన తరువాత వైసీపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉండటానికి నైతిక హక్కును కోల్పోయింది.
• ఈ నేపథ్యంలో, సమాజానికి నిజమైన సేవా స్ఫూర్తితో పని చేస్తున్న లాభాపేక్షలేని సంస్థలకు గట్టి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
• అత్యవసర ప్రాతిపదికన వివిధ మేధో మరియు శారీరక సామర్థ్యత కలిగిన పిల్లల పాఠశాల అయిన హిడెన్ స్ప్రౌట్స్‌ లో చదువుతున్న పిల్లలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది,.
• ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారుల సహకారంతో ఇటువంటి భయంకరమైన చర్యలకు కారణమైన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *