(వడ్డేపల్లి మల్లేశము)
సాధారణంగా ఒక రాష్ట్రం కాని దేశం
కానీ నూతనంగా ఆవిర్భవించడానికి ప్రజల ఆకాంక్షలు పోరాటాలు త్యాగాలు తప్పకుండా ఉంటాయి. ప్రజల ఆకాంక్షల పునాదుల మీద ఉన్నత ఆశయాలను సాధించే క్రమంలో ఉన్నత లక్ష్యాలను ముందుంచుకుని వ్యవస్థ నిర్మాణం చేయవలసి ఉంటుంది. ఇది కొత్తగా ఏర్పడిన టువంటి రాష్ట్రం కానీ దేశం కానీ చేయవలసిన తొలి కర్తవ్యం.
అసంబద్ధంగా నే 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్రం స్వతంత్రతను సాధించుకోవడానికి చేస్తున్న కృషిలో భాగంగా 1969 లో తొలి ఉద్యమంలో 370 మంది అమరులైన విషయం మనందరికీ తెలిసినదే. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఆశయాన్నే ముందుంచుకుని అనేక ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఆ భావజాలాన్ని ప్రజల మనసులో నుండి చెరిగిపోకుండా చేయగలిగినవి 1996 లో వరంగల్ లో జరిగినటువంటి డిక్లరేషన్ సభ తర్వాత తెలంగాణ ఆకాంక్ష మరింత ఉధృతమై నా దారుల్లో దాని సాధన కోసం జరిగింది కృషి.
2001లో టిఆర్ఎస్ పార్టీ రాజకీయ కృషితో పాటు సమాంతరంగా అనేక సంస్థలు ఉద్యమ సంస్థలు రాజకీయ పార్టీలు కూడా ఆ వైపుగా ఎనలేని కృషి చేసినవి ప్రజల సహకారంతో. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఏ ఒక్క పార్టీతోనూ సాధ్యమైంది అని చెప్పడానికి వీలు లేదు దాని వెనుక అనేక మంది త్యాగాలు బలవన్మరణాలు బలిదానాలు ఉన్నాయి.
2009 నుండి సాగిన టువంటి ప్రజా ఉద్యమంలో సకల జనుల సమ్మె వృత్తుల వారీగా ప్రజల యొక్క ఉద్యోగుల విద్యార్థి సంఘాల పోరాటాలు నిరసనలు ఆత్మహత్యల బలిదానాల నేపథ్యంలో దాదాపుగా 13 వందల మంది చనిపోగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన విషయం మీకు అందరికీ తెలిసినదే.
ఈ మలిదశ పోరాటానికి టిఆర్ఎస్ పార్టీ తో పాటు మిగతా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అన్ని కూడా బాధ్యత సమర్థంగా నిర్వహించిన విషయం. నగ్నసత్యం.
తెలంగాణ ఆకాంక్షలు- పోరాట నేపథ్యం:-
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం
నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవానికి నోచుకోకుండా వివక్షతకు గురి అయిందని దాన కారణంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమం ప్రారంభమైన విషయం తెలిసిందే.
నిజంగా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవం మాత్రమే సరిపోవు. అనేక అంశాలు కూడా వాటితో అనుసంధానమై ఉంటాయి. టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ పోరాట క్రమంలో అనేక వాగ్దానాలు ఆలోచనలు ఆకాంక్షలు ముత్యాలు సంఘర్షణలు వచ్చినప్పటికీ ముందుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ప్రధానం అనే చిత్తశుద్ధితో విభిన్న వర్గాల వారు ఏకైక లక్ష్యంతోనే తెలంగాణ సాధనకు సహకరించిన విషయం తెలిసిందే.
ప్రాజెక్టుల్లో ఉద్యోగాల నియామకంలో బడ్జెట్ అలాట్మెంట్ లో కూడా తెలంగాణ ప్రాంతం వివక్షకు గురైందని అనేక దఫాలుగా భాష పేరు మీద బ్రతుకు పేరుమీద అనేక రకాలుగా ఈ ప్రాంతం వివక్షకు గురై అవమానాల పాలు అయిందని గాన రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రపంచమే నివ్వెరపోయే స్థాయిలో పరిపాలన ఉంటుందని స్వయంగా నేటి ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రకటించిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి.
అడుగుల సవ్వడి:
గమ్యాన్ని చేరుకోవడానికి సమయం పడుతుంది కానీ ఆ వైపుగా ప్రయాణం చేస్తేనే కదా చేరుకునేది. మన రాష్ట్ర ఆకాంక్షను అమలు చేసుకునే క్రమంలో ఏడేళ్లయినా ప్రగతి నామమాత్రమేనని విశ్లేషకులు అంటుంటే దానికి కారణాన్ని వెదికినప్పుడు మన ప్రయాణ దిశ వ్యతిరేక
దిక్కు లో ఉండడం వల్లనే అది సాధ్యం కాలేదని అర్థం చేసుకోవలసి ఉంటుంది.
అమలు కాని హామీలు:
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని ఇచ్చిన హామీ తో సహా దళితులకు 3 ఎకరాల ఉచిత భూమి అన్న హామీలు నామమాత్రంగానే మిగిలిపోయినావి. టీవీ సినిమా ప్రసారాల లోని అసంబద్ధత ను నివారించి ప్రజా దృక్పథంతో నిర్వహిస్తామని ఇచ్చిన హామీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గుట్టలు ప్రకృతి విధ్వంసం గురించి ఉద్యమకాలంలో మాట్లాడినప్పటికీ ఇప్పటికీ యధేచ్ఛగా ప్రకృతి విధ్వంసం కొనసాగుతూనే ఉన్నది.
కీలక విషయాలలో అఖిల పక్షాలు ప్రజా సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఇచ్చిన హామీ ఎండమావిగానే మిగిలిపోయింది. కరోనా ప్రమాద సన్నివేశంలోనూ సంఘాలు అఖిల పక్షాలతో ఏనాడు చర్చించలేదు. కనీసం ప్రతిపక్షాలతో సహా అధికార పక్ష శాసనసభ్యులు మంత్రులు కూడా ప్రవేశ అర్హత లేకపోవడం మనం చూస్తున్నదే.
కొన్ని అసంబద్ధ నిర్ణయాలు:
వాస్తవంగా క్షేత్రస్థాయిలో పని చేస్తున్న రైతులకు కాకుండా భూయజమానులకు రైతుబంధు ఇవ్వడంతోపాటు ఎకరాలు ఉన్నవారికి కూడా లక్షలాది రూపాయలు కట్టబెట్టడం అందులో మంత్రులు శాసనసభ్యులు కలెక్టర్లు అధికారులు కోటీశ్వరులు కూడా ఉండడాన్ని ఏవిధంగా పరిగణించాలి. ఐదు లేదా పది ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయడం ద్వారా కోటాను కోట్ల రూపాయలను ఆదా చేయవచ్చు ఇప్పటికైనా వెంటనే అమలు చేయాలి.
ఇష్టంగా ఉన్న సచివాలయాన్ని కొల్లగొట్టడం తిరిగి ఆరు వందల కోట్లతో నిర్మాణానికి కోరుకోవడం అంతకంటే ముఖ్యమైనటువంటి మౌలిక సౌకర్యాల పట్ల శ్రద్ధ చూపకపోవడం అసంబద్ధం కాదా.
పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం, ఎన్నికల కోసం మాత్రమే ప్రాధాన్యతనివ్వడం, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగ పరచడం, ప్రతిపక్షాలను నిర్వీర్య పరచడం, ఎన్నికల సమయంలోనే వాగ్దానాలు చేయడం సుపరిపాలన ఎలా అవుతుంది?
పెన్షన్లు ఇవ్వడం, వేతనాలు అందించడం, రోజువారీ కార్యక్రమాలు చేయడం మాత్రమే పరిపాలన కాదు. నిరుద్యోగ నిర్మూలన తోపాటు పేదరికాన్ని నిర్మూలించి, సమానత్వాన్ని సాధించి, అంతరాలను తొలగించి, ఉపాధి కల్పించి పేద వారికి కూడా రాజ్యాధికారంలో వాటా కల్పించే దిశగా చర్యలు చేపట్టినప్పుడు నిజమైన టువంటి పరిపాలన కనపడుతుంది అది మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి అవసరము.
అవినీతి- -ఆత్మ గౌరవం:
వ్యాసకర్త గా ఉన్న నేను వ్యక్తిగతంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సామ్యవాద తరహా సమాజం ఏర్పడుతుందని ఆశించిన వాళ్ళలో నేను ఒకరిని. కానీ ఆత్మగౌరవ నినాదం చాడ కూడా లేకుండా పోయింది. దాని స్థానంలో వ్యక్తిపూజ ,పాలాభిషేకాలు ,సన్మానాలు, ప్రశంసలతో పాటు ఎన్నికల సభలు అంటే డబ్బు, మద్యం అనే కొత్త నిర్వచనాన్ని ఇచ్చినట్లయింది గత ఏడు సంవత్సరాల నుండే. సీనియర్ మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారిని కలుసుకోవడం గగనకుసుమం అని సీనియర్ మంత్రులు చెబుతున్న మాటలు టీవీ పత్రికల్లో విన్నాము చూసినాము.
ఇక జిల్లా స్థాయి అధికారితో పాటు ఒక ఎమ్మార్వో కూడా కోట్లాది రూపాయలు లంచంగా తీసుకున్న టువంటి చరిత్ర కూడా భారతదేశాన్ని ఆశ్చర్యపరిచింది. యారో తో పాటు అనేక వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయిందని ప్రభుత్వమే ఆ వ్యవస్థలను సాధించిన సంగతి తెలిసిందే అంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అనేక మంది శాసనసభ్యులు మంత్రులపై కూడా భూకబ్జాలు, ఫామ్ హౌస్ నిర్మాణానికి పాల్పడ్డారని రోజు యూట్యూబ్ పత్రికల్లో టీవీ లో అనేక ఆరోపణలు వస్తున్నవి.
ఆసుపత్రులు, వాటర్ ట్యాంకులు ప్రాజెక్టు కాలువలు నాశిరకంగా నిర్మించడం వలన, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూలిన వైనం ఇటీవలనే కళ్ళారా చూచినాము.
మిషన్ భగీరథ కారణంగా రాష్ట్రంలోని రోడ్లన్నీ ధ్వంసమై పోయి అనేక ప్రమాదాలకు చిరునామాగా రాష్ట్ర రహదారులు మిగిలిపోయిన వి.
విద్యా వైద్య రంగాలలో కూడా ప్రభుత్వం యొక్క పాత్ర ఇంకా తగ్గిస్తూ ప్రైవేటు యాజమాన్యాల వాటా పెంచడం వలన ప్రభుత్వానికి అజమాయిషీ లేకుండా పోయినది ఆ కారణంగానే అనేక ప్రైవేట్ ఆసుపత్రులు లక్షలాది రూపాయలు దండుకుంటున్నా ఆరోగ్య శ్రీ లో చేర్చకపోవడం, ప్రైవేటు ఆస్పత్రులను స్వాధీనం చేసుకోవడం పేద ప్రజలకు నష్టం చేసినట్లే కదా!
మరిచిన తక్షణ కర్తవ్యాలు:
కాళేశ్వరం ప్రాజెక్టు తో సహా కొన్ని ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిన ప్పటికీ అవినీతి బాగా జరిగిందనే ఆరోపణలునివృత్తి చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంత ఉన్నది.
యువత ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలో కాపు గా మూడు లక్షల ఉద్యోగ ఖాళీలు చేయకుండా ఉన్నట్లు ప్రతిపక్షాలు కొన్ని కమిటీలు ప్రకటిస్తున్న వేల ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోక పోవడం శోచనీయం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయకపోవడం బాధాకరమే కదా. ప్రభుత్వము తక్షణమే యువజన విధానాన్ని ప్రకటించి లక్షలాదిగా ఉన్న యువతకు అనువైన టువంటి ఆది రుణ సౌకర్యాలను కల్పించడం ద్వారా జన జీవన స్రవంతిలోకి తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములను చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.
ప్రధానంగా ప్రభుత్వానికి ఆదాయాన్ని దోచిపెట్టే మద్యం షాపులను యువతను నిర్వీర్యం చేస్తున్న చూసీచూడనట్లు ఊరుకోవడం ఇదేనా తెలంగాణ ఆకాంక్ష.
ఆహార పదార్థాలలో కల్తీలు, మద్యం మత్తు గుట్కాలు, అశ్లీలమైన ఇటువంటి కార్యక్రమాలకు వేదిక లైన అనేక క్లబ్బులో తో పాటు సినీ సీరియల్లో , సెల్ ఫోన్లలో అశ్లీల చిత్రాలు అశ్లీల సాహిత్యం నిర్మూలించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తద్వారా యువతను రక్షించవచ్చు.
ప్రధానంగా యువకులే ఎక్కువగా కరోనాతో చనిపోతున్నా ఈ సందర్భంలో 18 నుండి 44 సంవత్సరాల వయసు వారికి ముందుగా వ్యాక్సిన్ వేయించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా కేంద్రంతో పోరాడి అమలు చేయించవలసిన అవసరం తక్షణ కర్తవ్యం.
హామీలను ప్రజా కోణంలో రాష్ట్ర ప్రభుత్వం అవతరణ దినోత్సవం సందర్భంగా సంఘాలు అఖిల పక్షాలతో చర్చించి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే దిశగా నూతనమైన చర్యలు తీసుకోవడం ద్వారా సమానత్వాన్ని సాధించడానికి పేదరికాన్ని నిర్మూలిస్తూ ఖాయిలా పడిన పరిశ్రమలు తినిపించడం ద్వారా నూతన పరిశ్రమలకు శ్రీకారం చుట్టి యువతకు ఉపాధి కల్పించడం ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి
ఆ లక్ష్య సాధన చేరుకోవాలంటే ప్రయాణ గమ్యాన్ని బలంగా నిర్దేశించుకొని ప్రయాణ దిశను మరొక్కసారి సరి చూసుకోవడం ద్వారా మాత్రమే విజయాన్ని సాధించ గలుగుతాము.
( కర్త కవి రచయిత సామాజిక రాజకీయ విశ్లేషకులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)
తెలంగాణ ఆవిర్భావం గురించి తర్వాత ఉన్న పరిస్థితులు చక్కగా వివరించారు
ప్రాణహిత కవుల సంగమం అధ్యక్షులు