మళ్లీ స్వల్పంగా పెరిగిన ఆంధ్రా పాజిటివ్ కేసులు

నిన్న రికార్డు స్థాయిలో తగ్గిన ఆంధ్రప్రదేశ్ కోవిడ్ పాజిటివ్ కేసులు ఈ రోజు కొద్దిగా పెరిగాయి.  గత 24 గంటల్లో ( నిన్న ఉదయం 9  నుంచి ఈ ఉదయం 9 వరకు) 11,303 పాజిటివ్ కేసులు కనిపించాయి.  మొత్తంగా రాష్ట్రమంతా  93,704 శాంపిల్స్ పరీక్షించారు.ఈ వివరాలను కొద్ది సేపటి కిందట రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్ర వ్యాపితంగా  104 మరణాలు సంభవించాయి. మొత్తంగా కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య  11,034 మంది.

నిన్న ఆంధ్రప్రదేశ్ లో కరోన కేసులు భారీగా తగ్గాయి.  మొన్న నమోదయిన 13 వేల కేసులనుంచి  కొత్త పాజిటివ్ కేసులు  7943 లకు పడిపోయాయి. మృతుల సంఖ్య కూడా తగ్గినా  ఇంకా ఎక్కువగానే ఉంది.  గత 24గంటలలో   98 మంది మృతి చెందారు.

ఈసారి ఈ ఎక్కువ కేసులు తూర్పుగోదావరిజిల్లానుంచి కనిపించాయి.

ఇక మరణాలుకు సంబంధించి,  కోవిడ్ వల్ల పశ్చిమ గోదావరిలో ఇరవై మం ది చనిపోయారు.   చిత్తూర్ లో పద్నాలుగు మంది మృతిచెందారు. ఇక ఇతర జిల్లాలకు సబంధించి
అనంతపూర్ లో తొమ్మిది, గుంటూరులో తొమ్మిది, తూర్పు గోదావరిలో ఎనిమిది,విశాఖపట్నంలో ఏడుగురు, కృష్ణలో ఆరుగురు, కర్నూల్ లో ఆరుగురు, శ్రీకాకుళంలో
ఆరుగురు, విజయనగరంలో ఆరుగురు, వైఎస్ఆర్ కడపలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, ప్రకాశంలో నలుగురు మరణించారు.

గడచిన 24 గంటల్లో 18,257 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని
సంపూర్ణ ఆరోగ్య వంతులు అయ్యారు.

జిల్లాల వారీగా పాజిటివ్ కేసులు వివరాలు:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *