కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా దేశాన్ని తాకడంతో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి.దీనితో వ్యాపారాలు, వాణిజ్యం,ఫ్యాక్టరీలు మూత పడటంలో, పాక్షికంగా మాత్రమే నడవడమోజరిగింది.దీనితో చాలా మంది ఉపాధి కోల్పోయారు, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) లెక్కల ప్రకారం కరోనా సెకండ్ వేవ్‌లో కోటి మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. 97శాతం మంది ఇళ్లలో ఆదాయం తగ్గింది.దీనికితో అన్ని కుటుంబాలలో పాండెమిక్ వల్ల వ్యయం పెరిగింది.
పాండెమిక్ ముందున్న వేతన ఉద్యోగాలు (Salaried Jobs) సుమారు 85 మిలియన్ల నుంచి 73-74 మిలియన్లకు పడిపోయాయి. అంటే దాదాపు కోటి పదిలక్షల నుంచి కోటి పదకొండ లక్షల మందికి ఉపాధి పోయిందన్నమాట.
“ India had 403.5 million jobs before being hit by the COVID-19 pandemic. In April 2020, about 126 million jobs were lost of which 90 million were those of daily wagers. The figure recovered and reached 400 million jobs in January 2021 or December 2020. However, after the second wave, India has 390 million jobs.”
దేశంలో ఏప్రిల్ నెలలో 8 శాతం నిరుద్యోగం ఉంటే మే లో ఇది 12 శాతానికి చేరుకుందని సిఎంఐఇ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేశ్ వ్యాస్ తెలిపారు.
రేపు లాక్ డౌన్ ఎత్తేసినా ఉపాధి పోయిన వాళ్లలో కొందరికే మళ్లీ ఉద్యోగాలు వస్తాయని, అందరికి రావని ఆయన అన్నారు. మంచి ఉద్యోగాలు రావడానికి మరొక ఏడాది పడుతుందని ఆయన అన్నారు.
సెకండ్ వేవ్ సమయంలో ఏప్రిల్ లో ఈ సంస్థ 1.75 లక్షల కుటుంబాలను సర్వేచేసింది. వాటి ఆదాయం వనరులెలా ఉన్నాయని కనుగొనడం ఈ సర్వే ఉద్దేశం. సర్వేలో పాల్గొన్నకుటుంబాలలో 3 శాతం మాత్రమే తమ ఆదాయం పెరిగినట్లు చెప్పాయి. 55 శాతం కుటంబాలు తమ ఆదాయం పడిపోయినట్లు వెల్లడించాయి. 42 శాతం కుటుంబాలు తమ ఆదాయంలో మార్పు లేదని చెప్పాయి.