బందరు మెడికల్ కాలేజీ పేరు డా.వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ

కృష్ణా జిల్లా మచిలీపట్నం లో రూ.550 కోట్లతో నిర్మించనున్న 150 పడకల మెడికల్ కళాశాలకు వర్చువల్ ప్రక్రియలో ఉదయం 11గంటలకు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు.

మచిలీపట్నం వైద్య కళాశాలకు డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మెడికల్ కాలేజీగా నామకరణం చేస్తారు.

 

మెడికల్ కళాశాల పూర్తయితే హ్యూమన్ అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఇమ్యునాలజీ, ప్రసూతి వైద్యం (ఆబ్స్‌టెట్రిక్స్, గైనకాలజీ), ఎనస్తీషియాలజీ, అంతర్గత వైద్యం (ఇంటర్నల్ మెడిసిన్), కుటుంబ వైద్యం, శస్త్రచికిత్స (సర్జరీ), జెనిటిక్స్, పాథాలజీ (రోగ నిర్ధారక శాస్త్రం) తదితర సబ్జక్ట్స్ లో భోదన

కళాశాలకు గుండె, కన్ను, ముక్కు, చెవి, చర్మం, మెదడు, మానసిక ప్రవృత్తి వంటి విభాగాల్లో నిపుణులైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు అందుబాటు

ప్రాథమిక శాస్త్రం, పారా క్లినిక్, క్లినిక్ విభాగాలు, పెద్ద స్థాయి ఆధునిక చికిత్సా విభాగాలు అనుభవ్జ్ణులైన నిపుణులతో మచిలీపట్నం వైద్య కళాశాల

వైద్యవిద్యకు అనుబంధంగా నర్సింగ్, ఫిజియోథెరపీ, లాబొరేటరీ టెక్నాలజీ వంటి కోర్సులు రానున్నాయి.

వైద్య కళాశాల ఏర్పాటుతో దానికి అనుబంధంగా ప్రభుత్వ అసుపత్రి ద్వారా అందనున్న మరింత మెరుగైన వైద్య సదుపాయం

రాష్ట్ర రవాణా,సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట రామయ్య (నాని) మచిలీపట్నం నుంచి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.

జిల్లాకలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ కె. మాధవీలత తదితరులు కూడా హాజరు అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *