సింపుల్ గా తెలంగాణ అవతరణ సంబురాలు… క్యాబినెట్ నిర్ణయం

ఈ రోజు ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన  సమావేశమయిన తెలంగాణక్యాబినెట్ తీసుకున్న మరికొన్ని ముఖ్యమయిన నిర్ణయాలు:

 

1)లాక్ డౌన్ పొడిగింపు నేపధ్యంలో కొవిడ్ , లాక్ డౌన్ సడలింపు నిబంధనలను అనుసరించి  ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిష్ట్రేషన్లతో పాటు, రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతించాలి.

2) కరోనా వ్యాప్తి ఎక్కువగా వున్న ఖమ్మం, మధిర, సత్తుపల్లి, ఆలంపూర్, గద్వాల, నారాయణ్ పేట్, మక్తల్ ,నాగార్జున సాగర్, కోదాడ, హుజూర్ నగర్ వంటి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో హెల్త్ సెక్రటరీ తోపాటు రాష్ట్రస్థాయి వైద్యాధికారులు పర్యటించాలి. పరిస్థితి  సమీక్ష చేసి కరోనా నియంత్రణకు తగు చర్యలను తీసుకోవాలి.

3)సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, థర్డ్ వేవ్ వస్తుందనే వార్తల పట్ల వైద్యశాఖ పూర్తి అప్రమత్తతతో ఉండాలి. ధర్డ్ వేవ్ కు ముందే నియంత్రణ ప్రణాళికలను సిద్దం చేసుకోవాలి.
రాష్ట్రంలోని అన్ని ఏరియా, జిల్లా, తదితర దవాఖానల పరిస్తితుల మీద రివ్యూ చేయాలి.  అన్నిరకాల మౌలిక వసతులను కల్పనకు చర్యలు తీసుకోవాలి.

4)రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, వనపర్తి, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, మహబూబాబాద్ కొత్తగూడెంలలో 7 మెడికల్ కాలేజీలు , వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం. ఇప్పటికే మంజూరయిన వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు మంజూరు

5)వరంగల్ లో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణాన్ని, ప్రస్థుతం జైలు వున్న ప్రాంగణంలో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. జైలులో ప్రస్థుతం వున్న ఖైదీలను అనువైన ఇతర ప్రాంతానికి తరలించాలని, జైలు స్థలాన్ని నెలలోపు వైద్యశాఖకు అప్పగించాలని, హోం శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది.

6)మామునూరులో విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకుని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన జైలు నిర్మాణం చేపట్టాలి. దీని నిర్మాణ ప్రతిపాదనలను సిద్దం చేయాలని హోం శాఖ అధికారులను కేబినెట్ ఆదేశాలు.

7)విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెలుతున్నవిద్యార్ధుల సౌకర్యార్ధం, వారి అడ్మిషన్ లెటర్ ఆధారంగా కొవిడ్ వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రాధాన్యతనివ్వాలి.

8) ఇప్పుడు అమలు చేస్తున్న బిసీ రిజర్వేషన్లను మరో పది సంవత్సరాల పాటు పొడిగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి, కేబినెట్ ఆమోదం

9)పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా నెక్లెస్ రోడ్డుకు (5.5 కి.మీ) ‘పి వి నర్సింహారావు మార్గ్’ (పీవీఎన్ ఆర్) గా నామకరణానికి  కేబినెట్ ఆమోదం.

10)రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలను కొవిడ్ నిబంధనలను పాటిస్తూ అతి తక్కువ సంఖ్యలో హాజరై జరుపుకోవాలి. , ఆయా జిల్లాల్లో మంత్రులు అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలి.

11)వానకాలం వ్యవసాయం మొదలవుతున్న నేపథ్యంలో రైతులకు కావాల్సిన విత్తనాల లభ్యత, ఎరువులు ఫెస్టిసైడ్లు అందుబాటులో ఉండేలా చూడాలి. కల్తీ విత్తనాలు ఎరువులు తదితర కల్తీ పురుగుమందులు తయారీ దారుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి.  వ్యవసాయ శాఖ అధికారులను, హోంశాఖ, ఇంటిలిజెన్స్ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు.

12)రాష్ట్రంలోని రైతుబంధు సమితులను కార్యాచరణలోకి తేవాలని,రైతు శిక్షణాకార్యక్రమాలను నిరంతరం జరపాలి, రైతుబంధు సమితి సంఘాల అధ్యక్షులు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఇందులో పాల్గొనాలి. ఏఈవో క్లస్టర్లలో డిఎవోలు వ్యవసాయ శాఖ అధికారులు రైతు వేదికలను కేంద్రంగా చేసుకోని వ్యవసాయ శాఖ విధులను పర్యవేక్షించాలి.

13)ధాన్యం సేకరణ నూ పూర్తిగా చేపట్టకుండా తెలంగాణ పట్ల కేంద్రం అవలంబిస్తున్న అనుచిత వైఖరి గురించి చర్చించిన కేబినెట్ అసంతృప్తి. ఈ మేరకు ప్రధానికి లెటర్ రాయాలని నిర్ణయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *