జూన్ రెండో వారం నుంచి రష్యా స్పుత్నిక్ –V టీకాలు వేయనున్నట్లు అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది. ఒక డోస్ ధర రు. 1195 అని కూడా అపోలో ప్రకటించింది. ఇందులో రు. 995 వ్యాక్సిన్ ధర అని, మరొక రు. 200 అడ్మినిష్ట్రేషన్ ఖర్చు అని అపోలో గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆపోలో ఇప్పటికే స్పుత్నిక్ వ్యాక్సిన్ ఇవ్వడం మొదలుపెట్టిందని, దేశంలోని 80 సెంటర్లనుంచి ఇంతవరకు పది లక్షల మంది వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని అపోలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెశిడెంట్ శోభనా కామినేని ప్రకటనలో తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ప్రంట్లైన్ వర్కర్స్, హైరిస్క్ పాపులేషన్స్, కార్పొరేట్ ఉద్యోగులని ప్రజలను వర్గీకరించి ప్రాధాన్యత ప్రకారం వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ఆమె చెప్పారు.
జూన్ లో పదిలక్షల మందికి స్పూత్నిక్ –V వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, జూలై దీనిని రెట్టింపు చేస్తామని చెబుతూ సెప్టంబర్ నాటికి 20 మిలియన్లు మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామని ఆమె చెపారు.