ఆనందయ్య వైద్యానికి 15 మంది ఆల్లోపతి పెద్ద డాక్టర్ల స్పందన

ప్రపంచం కరోనా మహమ్మారి గుప్పెట్లో విలవిల్లాడుతున్నది. భారత దేశంలో కరోనా రెండోదశ తీవ్ర స్థాయిలో విరుచుకుపడి కొనసాగుతోంది.మరికొన్ని వారాల వరకైనా నెమ్మదించే సూచనలు లేవు.వైరస్ చికిత్సకి ఆధునిక వైద్యం లో వివిధ ఔషధాల్ని ప్రయత్నిస్తున్నారు.

అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల మేరకు చికిత్సా విధానాన్ని మార్పులూ చేర్పులతో అమలుపరుస్తూన్నారు.ఇతమిద్ధంగా ‘ఇదీ ఖచ్చితమైన చికిత్స’అంటూ అంతిమ నిర్ణయం జరగలేదు.

అయితే నివారణ పద్ధతులు,టీకా పాత్ర పై వాటి ప్రభావశీలతపై స్పష్టత ఉంది.కాబట్టి వాటిని పక్కాగా అమలు చేయడమే తొలి ప్రాధమ్యం కావాలి.

నయానో, భయానో, సానుభూతి తోనో,సహకారం తోనో చెయ్యాల్సిన మొదటిపని అది.

రెండోది ప్రచారం లోకి వస్తున్న అనవసరపు గందరగోళాన్ని తొలగించడం. నెల్లూరులో ఆనందయ్య మూలికలతో వైద్యం చేయడంపై చాలా రభస జరిగింది.అది నివారింప దగ్గ గందరగోళం.

హానిలేని మూలికలతో ఆయన మందు అందిస్తున్నపుడు, వాటిని ఆయన లాభాపేక్ష లేదా వేరే దురుద్దేశం తో చేయనపుడు మరీ విరుచుకుపడనక్కరలేదు.

ఆయన పద్ధతిలో కంటిలో చుక్కలు వెయ్యడం లాంటివి నిరోధిస్తే చాలు, చూపు కి ప్రమాదం ఉంటుంది కాబట్టి. అలాగే ఆ మందు కి ఎగబడుతూ కరోనా నివారణ పద్ధతులకు తిలోదకాలివ్వడాన్ని నియంత్రించాలి.

మందులకే కాదు,టీకాలకైనా,దేనికైనా ఎగబడే పరిస్థితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేరంగా చూడాలి. అలాగే ఏ వైద్య విధానంలోని చికిత్స తీసుకున్నా అది ఆధునిక వైద్యానికి కాంప్లిమెంట్ గానే భావించి,తగు జాగ్రత్తలు తీసుకొనేలా చూడాలి.లేదంటే వ్యాధి ముదరడమే కాదు వ్యాప్తి కూడా పెరిగి అందరినీ ముంచేస్తుంది.కరోనా రెండో దశ వచ్చిన రెండుమూడు మాసాల్లోనే దేశంలో 260మంది వైద్యులు రోగులకు సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయారు. వేల మంది ప్రాణాలొడ్డి రేయింబవళ్లు సేవలు చేస్తున్నారు.వారితో బాటు,ముందువరస కరోనా యోధులకు నైతికస్థైర్యం అవసరం.చులకన చేసి మాట్లాడే అతితెలివి అధికారుల్ని,నేతల్ని కట్టడి చెయ్యాలి.

ఈ సమయంలో ప్రయివేటు వైద్యం సహకారం లేకుండా కుదరదు.వారిలో చాలామంది పూర్తి లాభాపేక్ష తో రోగుల్ని పిండేస్తున్నారు.కాబట్టి మహమ్మారి గండం గడిచేవరకూ అన్ని అస్పత్రుల్ని జాతీయం చెయ్యాలి.ప్రభుత్వమే నిర్వహించాలి.కరోనా యుద్ధం లో ప్రజలంతా సైనికులే అయితే వారందరి చేతికి ఆయుధం ఇవ్వడం అవసరం.టీకా ఆయుధమనుకుంటే అది వారికి అందనివ్వకుండా యుద్ధం చెయ్యమనడం అర్ధరహితం.ప్రభుత్వం బాధ్యత పడాలి.

– డా. డి.వి.జి.శంకర రావు , మాజీ ఎంపీ, పార్వతీపురం. 94408 36931.

Dr. D.V.G. Sankar Rao, MD
Professor (Anae), Maharaja Medical College, Vijayanagaram
Ex. M.P. Parvathipuram
Ph : 9440836931

Dr. M. Ramani, MD
Former Director of Medical Education, Telangana State
Ph : 9849134064

Dr. K.V. Rajasekhar Rao, M.S., M.Ch.
Heart Transplantation Surgeon
Care Hospital, Hyderabad
Ph : 6281887105

Dr. D. Mohan Krishna, M.S., M.Ch.
Plastic Surgeion
Former Superintendent, Gandhi Hospital, Hyderabad
9440047956

Dr. Siva Sankara Rao, M.S.,
Professor and HOD, General Surgeory
Siddhartha Medical College,
Superintendent, Gov. General Hospital, Vijayawada
Ph : 9866041540

Dr. N. Subba Rao, MD, DM
Professor & HOD Onocology, NRI Medical College
Chinakakani
Director, American Onocology Institute
Ph : 9849285992

Dr. Appalanaidu, MD
Ex. Registror, NTRUHS
9848130881

Dr. G. Balaji, MD. Hospital Admn), MBA (Health Care Management)
Chief Executive Officer, KIMS, Amalapuram
Ph : 9949939991

Dr. S.K. Latif, MD
Associate Professor, Katuri Medical College
Ph : 8978988114
Dr. Uppala Srinivasa Rao, M.S.,
Associate Professor, RIMS, Kadapa
Ph : 9493442229

Dr. Sk. Rafi, MD
Professor in General Medicin
Hyderabad
Ph : 9849155960

Dr. Ande Venkateswara Rao, MD (Pulmonologist)
Guntur
Ph : 9848192947

Dr. Ala Venkateswalu, MD
Pediatrician, Guntur
Ph : 7337302256

Dr. B. Swamy, MD
Pediatrician, Hyderabad
Ph : 9290953720

Dr. Sk. Dastagiri, MBBS, DO
Opthomologist
9440357034

Dr. T. Sivaiah, MD.
Social and Preventive Medican
Associate Professor, Govt. Medical College, Anantapur
Ph : 7036167007

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *