కోవిషీల్డ్ డోస్ లకే 12 వారాల గ్యాప్, కోవ్యాగ్జిన్ కు లేదు, ఎందుచేత?

మొదటి డోస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నా రెండువ డోస్ ఎపుడేసుకోవాలి? ఈ వ్యవధిని భారత ప్రభుత్వం మూడుసార్లు పెంచింది.  కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ని ఆక్స్ ఫోర్డ్-యాస్ట్రా జెనెకా (Oxford-AstraZeneca) తయారుచేసిన వ్యాక్సిన్.ఇదే భారతదేశంలో ప్రధానంగా అందిస్తున్న టీకా.  దీనిని ఇండియాలో సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)తయారు చేస్తూ ఉంది.

దీనికి సంబంధించిన వ్యాక్సినేషన్ జనవరిలో మొదలయింది.  మొదటి డోస్ వ్యాక్సిన్ వేశాక నాలుగు  నుంచి ఆరు వారాల విరామంతో తర్వాత రెండో డోస్ వేసుకోవచ్చని చెప్పారు. తర్వాత  ఈ విరామాన్ని నాలుగు నుంచి ఎనిమిది వారాలు అన్నారు. ఆపైన  మొదటి డోస్ వేసుకున్నాక  12 నుంచి 16 వారాల గ్యాప్ తో వేసుకోవచ్చని చెప్పారు. ఇది చాలా కన్ ఫ్యూజన్ సృష్టించింది. దీని మీద చాలా వ్యంగ్య చిత్రాలు కూడా వచ్చాయి. క్లినికల్ ట్రయల్స్ తర్వాత గ్యాప్ పెరుగుతూ ఉంది. భారతదేశంలో లాగే స్పెయిన్ కూడా  12 వారాల గడువుతర్వాతే సెకండ్ డోస్ ఇస్తూ ఉంది.

కేంద ప్రభుత్వం వ్యాక్సిన్ కొరత ను అధిగమించేందుకు ఇలా చేస్తున్నదనే విమర్శ కూడా వచ్చింది. అయితే, దీని వెనక ఉన్న కారణం పురోగమిస్తున్న వ్యాక్సిన్ సైన్స్. ఈ నిర్ణయం సైన్స్ ఆధారంగా తీసుకున్నదని నిపుణులు చెబుతున్నారు.

అయితే, భారత్ బయోటెక్ తయారుచేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు సంబంధించి మొదటి డోస్, రెండో డోస్ ల మధ్య న్న విరామాన్ని మార్చలేదు.

కోవిషీల్డ్ కే వ్యవధినే ఎందుకు మార్చారు? దీనికి ఐసిఎం ఆర్ డైరెక్టర్ జనరల్  డాక్టర్ బల్ రామ్ భార్గవ చెప్పారు. ఈ విషయాన్ని హిందూస్తాన్ టైమ్స్ రిపోర్టు చేసింది.

“కోవిషీల్డ్  మొదటి డోస్ వ్యాక్సిన్ ఇవ్వగానే  ఇమ్యూనిటీ బాగా పెరుగుతూ ఉంది.ఇది  12 వారాలాదాకా శక్తి వంతగాఉంటున్నది. అందువల్ల, దీనిని పరిశీలించాకే  కోవిషీల్డ్ సెకండ్ డోస్ కోసం 12 నుంచి 16 వారాలా దాకా ఆగవచ్చని  నిర్ణయించాం. ఇలా  కోవాగ్జిన్ విషయం లో జరగడం లేదు. కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నపుడు ఇమ్యూనిటీ అంత ఎక్కువగా పెరగడంలేదు. కోవాగ్జిన్ విషయంలో రెండు డోసులు పూర్తయ్యాకే ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంది,” అని  డాక్టర్ బల్ రామ్ భార్గవ చెప్పారు.

“It has been seen that the first dose of Covishield results in a great deal of protection, which can stay around 12 weeks. But you do not achieve a similar kind of protection after the first dose of Covaxin. It is only after both the doses of Covaxin are administered, the protection reaches the optimum level.”

కోవిషీల్డ్ రెండుడోసుల మధ్య వ్యవధి పెంచడమనే సైన్స్ పురోగతి (evolving science)అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *