గాంధీ ఆసుపత్రిలో రోగులను పరామర్శించిన కెసిఆర్

ఎట్టకేలకు హైదరాబాద్ గాంధీ  ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ పర్యటించారు. గాంధీ ఆస్పత్రితో పాటు అక్కడ కరోనా చికిత్స తీసుకుంటున్నరోగులను,   కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు.

ప్రగతిభవన్‌ నుంచి నేరుగా సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రికి చేరుకున్న ఆయన అక్కడ కరోనా చికిత్స ఏర్పాట్లు, సదుపాయాలపై ఆరా తీశారు.ముఖ్యమంత్రిగాని, మంత్రులు గాని ఆసుపత్రులెలా వున్నాయి, రోగులెలా ఉన్నారు, మందులు అందుతున్నాయా అనే విషయాలను పట్టించుకోవడం లేదనే విమర్శ వచ్చింది, కేవలం రివ్యూలకు పరిమితమయి పోతున్నారని ప్రతిపక్షాలు విమర్శించారు. మరీ ఎక్కువగా ఇసోలేషన్ లో ఉంటున్నదెవరు? అంటూ ట్రెండింగ్ తెలుగు న్యూస్ కూడా  రాజకీయ నాయకుల తీరు మీద రాసింది.

గాంధీ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి కెసిఆర్

ఈ నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి గాంధీ ఆసుపత్రి వచ్చారు.

అక్కడ  ఆక్సిజన్‌, ఔషధాల లభ్యత గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గాంధీ దవాఖానలోని కోవిడ్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషంట్లను పరామర్శించారు. గాంధీలో సేవలందిస్తున్న జూనియర్ డాక్టర్ లను, వైద్య సిబ్బందిని, అభినందించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషంట్లను పరామర్శిస్తూ, వారికి ధైర్యాన్నిచ్చారు.

ఔట్ పేషెంట్ వార్డుకి కూడా వచ్చారు.  కరోనా చికిత్స పొందుతున్న పేషంట్లకు అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

https://trendingtelugunews.com/top-stories/features/isolation-home-quarantine-political-leaders-chief-ministers/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *