5 నెలల తర్వాత TSPSC బోర్డు ఏర్పాటు… హైకోర్టు జోక్యం తర్వాత

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) చైర్మన్ గా ఐఎఎస్ అధికారి  డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి నియమించినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన  వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన 1996 బ్యాచ్ ఐఎఎస్ అధికారి.గతంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఉండేవారు. ఆయన పదవీ కాలం డిసెంబర్ 16నే  అయిపోయినా  ఈ పోస్టుకుమరొకరిని నియమించలేదు. గత కమిషన్ ను 2014 డిసెంబర్ న నియమించారు. వీరంతా ఒకేసారి రిటైర్ కావడంతో  మొత్తం కమిషన్ ఖాళీ అయింది. ఇలా సాధారణంగా జరగుదు.అంటే గత నాలుగు నెలలుగా పాలక మండలి లేకుండానే టిఎస్ పిఎస్ సి నడించింది. రాజ్యాంగలోని 316వ అధికరణం ప్రకారం, కమిషన్ చెయిర్మన్ ఎవరినీ రెండో సారి నియమించడానికి వీల్లేదు. అందువల్ల ఈ మధ్యలో తాత్కాలిక చెయిర్మన్ నియమించారు. అది ప్రతిపక్షాలకు నచ్చలేదు. కమిషన్ కు చెయిర్మన్ కు సభ్యలను, నియమించకుండా జాప్యం చేయడం బాగా విమర్శలకు గురయయింది.

తెలంగాణలో లక్షలాది నిరుద్యోగులు ఉద్యోగాలకోసం ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఎదురుచూస్తున్నారు. డబ్బు ఖర్చు చేస్తూ హైదరాబాద్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ వస్తాయని గంపెడాశతో నిరుద్యోగులు, తల్లితండ్రులు ఎదురుచూస్తున్నారు.నోటిఫికేషన్ రాక, ఉద్యోగాలు రాక చాలా మంది నిరుద్యోగులు నిరాశతో ఆత్మ హత్య కూడా చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో బాగా నిరుత్సాహానికి గురైన వర్గం యువకులూ, నిరుద్యోగులే. నోటిఫికేషన్లు లేవు,రిక్రూట్ మెంట్లు లేవు, నిరుద్యోగ భృతి హామీ అమలుకాలేదు.

ఇాలాంటపుడు హైకోర్టు జోక్యం చేసుకుంది. నాలుగు వారాల లోపు కమిషన్ ను నియమించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశిచండంతో ఇపుడు ఈ నియామకం జరిగిందని వేరే చెప్పాల్సిన పనిలేదు.

జె శంకర్ అనే నిరుద్యోగి కమిషన్ నియమించకుండా జాప్యం చేస్తుండటం మీద హైకోర్టులో పిటిషన్ వేశారు. దీని మీద ఏప్రిల్ 29న విచారణ జరిగింది. కమిషన్ ను మూసేయాలనుకుంటున్నారా అని కోర్టు అపుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నాలుగువారాలలో కమిషన్ ని నియమించండి అని తీర్పు చెప్పింది.

ఇపుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చైర్మన్ తో పాటు సభ్యులను కూడా నామినేట్ చేశారని తెలిసింది. సభ్యులు: రమావత్ ధన్ సింగ్ (బిటెక్ సివిల్, రిటైర్డ్ ఈఎన్సీ)., ప్రొ. బి. లింగారెడ్డి (ప్రొ. హెడ్ డిపార్డ్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ సిబిఐటి)., కోట్ల అరుణ కుమారి (స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ ) సుమిత్రా ఆనంద్ తనోబా తెలుగు పండిట్ )., కారం రవీందర్ రెడ్డి (రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి) ఆరజర్నలిస్ట్).

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *