కోవిషీల్డ్, కోవాగ్జిన్ లు ఇండియన్ వైరస్ మీద ఎలా పనిచేస్తున్నాయంటే

ఇండియన్ స్ట్రెయిన్ కరోనా వైరస్ (B.1.617) కు వ్యతిరేకంగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తున్నాయనే దాని మీద భారతీయ శాస్త్రవేత్తల పరిశోధనల్లో చాలా ఆసక్తి కరమయిన విషయాలు వెల్లడయ్యాయి. ఇపుడు భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తున్న వైరస్, గత ఏడాదికనిపించిన  వైరస్ వేర్వేరు. గత ఏడాది కనిపించిన వైరస్  B.1. ఇపుడు కనిపిస్తున్నది దాని రూపాంతరం B.1.617.  కోవిషీల్డ్, కోవాగ్జిన్ గత ఏడాది వైరస్ నమూనానుంచి తయారుచేసినవి.  అందువల్ల  వ్యాక్సిన్ లు ఇపుడు దేశాన్ని అతలాకుతలం చేస్తున్న B.1.617 మీద ఏ మేరకు పనిచేస్తున్నాయో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.

ఈ రెండు వ్యాక్సిన్ లను ఇపుడు భారతదేశంలో విరివిగాఇస్తున్నారు. స్పుత్నిక్ ఇంకా వూపందుకోలేదు. ఇది జూలై తర్వాత ఇండియాలో తయారు కావడం మొదలయితే  ఎక్కువగావినియోగంలోకి వస్తుంది. ఇపుడు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న స్పుత్నిక్ –V నిన్న మొదటి సారి ఎక్కించారు.  ఇతర వ్యాక్సిన్లు ప్రస్తుతానికి అందుబాటులో లేవు.

ఈ నేపథ్యంలో ఇండియాలో ఇపుడు ప్రబలుతున్న B.1.617 ఇండియన్ వైరస్ మీద భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ కౌన్సి ల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (Indian Council of Medical Research  ICMR) శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన చేశారు. వీటి ప్రాథమిక రిపోర్టు ప్రకారం కోవిషీల్డ్, కోవాగ్జిన్ లు రోగ నిరోధక శక్తిని సగమే సృష్టిస్తున్నాయి. అంటే ఒరిజినల్ SARS-CoV-2 మీద పనిచేసినంతగా B.1.617  మీద పనిచేయడం  లేదు. ఒరిజినల్ వైరస్ మీద  సృష్టించిన యాంటిబాడీలలో సగం మాత్రమే  ఇండియన్ వేరియాంట్ కేసులో పుడుతున్నాయి.  అయితే, అంతమాత్రాన కోవిడ్-19 ను నివారించే ఆయుధంగా ఈ కోవిషీల్డ్, కోవాగ్జిన్ ల ప్రాముఖ్యం తగ్గదని ఐసిఎంఆర్ కుచెందిన శాస్త్రవేత్తలు ’ది హిందూ‘కు చెప్పారు.

ఐసిఎంఆర్ కు,  పుణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి చెందిన శాస్త్రవేత్తలు గత జనవరి నుంచి ధేశంలో కరోనా పాజిటివ్ కేసులను శాంపిల్స్ సేకరించి వారిలో ఉన్న కరోనావైరస్ ఇంటర్నేషనల్ వేరియాంట్ ఏమిటో పరిశీలిస్తున్నారు.  ముఖ్యంగా B.1..7(UK ), B.1.315 (South Africa), P2(Brazil), B.1.617(India) . భారతదేశంలో ప్రధానంగా కనిపించినవి B.1.617 కు సంబంధించిన మూడు వైరసులే.

కోవిషీల్డ్, కోవాగ్జిన్ లు గత ఏడాది భారత దేశంమంతా విసర్తించి ఉన్న B1 అనే వైరస్ నమూనాను ఆధారం చేసుకుని తయారు చేసినవే. B1 గత ఏడాది ఏప్రిల్లో భారతదేశంలో ప్రధానంగా కనిపించిన వేరియాంట్.  ఇటీవల కనిపిస్తున్న కరోనా వైరస్ వేరియాంట్స్ కు రోగనిరోధక శక్తిని, యాంటిబాడీలను తప్పించుకునే శక్తి ఉందనే నివేదికలు వస్తున్నందున  కోవిషీల్డ్, కోవాగ్జిన్ ఈ కొత్త వేరియాంట్స్ మీద ఎలా పనిచేస్తున్నాయనే విషయం  మీద శాస్త్రవేత్తలు కన్నేశారు.

ఈ నేపథ్యంలో NIV శాస్త్రవేత్తలు కూడా కోవాగ్జిన్ రెండు డోసులు వేసుకున్నవారి రక్త సీరం నుంచి సేకరించిన యాంటిబాడీల మీద B.1.617 వైరస్ ప్రభావాన్ని పరిశిలించారు. గత ఏడాది కనిపించిన B1 ఒరిజినల్ వైరస్ మీద పుట్టించిన యాంటిబాడీలలో సగం మాత్రమే B.1.617 విషయంలో కనిపించాయి.

ఇలాంటి ప్రయోగానే కోవిషీల్డ్ మీద కూడా చేశారు.  యాంటిబాడీస్ సంఖ్యను కొలిచే విధానాన్ని జియోమెట్రిక్ మీన్ టైటర్ (Geometric Mean Titer: GMT) అంటారు. B1 వైరస్ మీద కోవిషీల్డ్  GMT  42.92 కాగా B.1.617 విషయంలో GMT కేవలం 21.9 మాత్రమే. అంటే సగమే.

ఇదే GMT ని యుకె వేరియాంట్  (B.1.1.7) ప్రయోగించారు. యాంటిబాడీలు 6 శాతమే తగ్గాయి. మళ్లీ బ్రెజీలియన్ (P2) విషయంలో  యాంటిబాడీల తగ్గుదల 50 శాతం కనిపించింది.

భారతదేశానికి చెందిన రెండు వ్యాక్సిన్ లు అంటే  కోవిషీల్డ్, కోవాగ్జిన్ లు   B.1.617 మీద ఒకలాగే పనిచేయడం కనిపించిందని ఈ రీసెర్చ్ పేపర్ల సహ రచయిత  డాక్టర సమీరన్ పాండా (ఐసిఎంఆర్ ఎపిడిమియాలజీ డివిజన్) తెలిపారు.

అయితే, రెండు రెట్లు తక్కువ కనిపించడాన్ని అంత పరిగణనలోనికి తీసుకోవనసరం లేదని ఐసిఎంఆర్ మాజీ డైరెక్టర్  రాకేశ్ మిశ్రా అన్నారు. యాంటిబాడీల తగ్గుదల పదిరెట్లున్నపుడే ఆలోచించాలని ఆయన చెప్పారని ‘ది హిందూ ’రాసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *