రేపు తెలంగాాణ క్యాబినెట్ , కెసిఆర్ ఏమి ప్రకటిస్తారు?

రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు  ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశమవుతున్నది.

రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ గురించి చర్చ జరిగే అవకాశం ఉంది, దీని మీద ముఖ్యమంత్రి మరింత క్లారిటీ ఇస్తారని తెలిసింది.

ఎందుకంటే, కొన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నారు.  మరికొన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ ప్రకటిస్తున్నారు. దేశంలో  తెలంగాణ రాష్ట్రమొక్కటే అసలు లాక్ డౌన్ తో ప్రయోజనం లేదని ప్రకటిచింది. ‘ లాక్ డౌన్ అవసరంలేదు, లాక్ డౌన్ తో ప్రయోజనం లేదు,’ అని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ మొన్నా చాలా స్పష్టంగా చెప్పారు. క్యాబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి  దీనిని పునరుద్ఘాటిస్తారా? ఇదే ఇప్పటి ప్రశ్న.

తెలంగాణలో గత 24 గంటలలో కనిపించిన కోవిడ్ పాజిటివ్ కేసులు కేవలం 4,826 మాత్రమే.

ఇదే సమయంలో కోలుకున్నవారి సంఖ్య  7,754. అంటే తెలంగాణలో కొత్త గా వస్తున్న కేసుల కంటే,కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది.

తెలంగాణలో కోవిడ్ మరణాలు రేటు కేవలం 0.55 శాతమే. దేశ స్థాయిలో ఇది 1.1 శాతం. ఇపుడు ట్రీట్ మెంట్ లో ఉన్న కేసులు  కూడా 62,797 మాత్రమే.

కొత్త కేసులకు సంబంధించి జిహెచ్ ఎంసి నుంచి 723 కేసులునమోదయ్యాయి. ఇతర జిల్లాలకు సంబంధించి కేసులు ఎక్కువ గా కనిపించినవి: మేడ్చల్ –మల్కాజ్ గిరి 324, రంగారెడ్డి 302,నల్గొండ  295, వరంగల్ అర్బన్ 242, నాగర్ కర్నూల్   208 కేసులు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ అసవరం లేదని, కేసులు అదుపులోకి వస్తున్నాయని, ఇపుడున్న ఆంక్షలు అంతా తప్పనిసరిగా పాటిస్తే చాలునని ముఖ్యమంత్రి ప్రకటిస్తారని అనుకుంటున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *