ఆంధ్ర వ్యాక్సినేషన్ మీద మరింత క్లారిటీ!

ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సిన్ ఎవరికి ఇస్తారు, ఎపుడు ఇస్తారనే విషయాలమీద రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇచ్చింది.ఈ రోజు వ్యాక్సిన్ వేస్తారని భావించి చాలాచోట్ల వ్యాక్సిన్ కేంద్రాలకు ప్రజలుచేరుకున్నారు. క్యూ కట్టారు.అయితే, నిదానంగా ఈ రోజు వ్యాక్సిన్ లేదు అని బోర్డు పెట్టారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ గురించి రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘల్ వెల్లడించారు.

*కేంద్రం నుంచి స్టాక్‌ వచ్చకే  అందరికీ వ్యాక్సిన్లు.

*కోటా ప్రకారమే రాష్ట్రాలకు కేంద్రమే వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్నది. డబ్బులిచ్చి కొందామన్న లభించని పరిస్థితి.

*వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో ప్రాధాన్యత ప్రకారం వ్యాక్సిన్  ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

*2021 మే, 31వ తారీఖు వరకూ ఆంధ్రప్రదేశ్ లో  మొత్తం రెండవ డోసు వ్యాక్సిన్  మాత్రమే వేస్తారు.

*మొదటి డోసులు నిలిపి వేయాలని ఉత్తర్వులిచ్చాము.

*హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకి కూడా మొదటి డోసులు వేయకూడదు.

*హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకి మొదటి డోస్ వాక్సిన్ వెయ్యాలి అంటే జాయింట్ కలెక్టర్  దగ్గర నుండి వ్రాతపూర్వక పర్మిషన్ తెచ్చుకోవాలి (జనవరి 17వ తారీఖు నుండి వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు ఉపయోగించుకోలేదు)

*ప్రతి మండలం మొత్తానికి ఒకటే వాక్సినేషన్ కేంద్రము.. మునిసిపాలిటీల్లో జనాభా ఎక్కువ కనుక ఒకటి కంటే ఎక్కువ వాక్సినేషన్ కేంద్రాలకు అనుమతి ఇవ్వ బడుతుంది.

* 18- 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి వాక్సిన్ వెయ్యబడదు *(Online లో వారు చేసుకున్న రిజిస్ట్రేషన్ అన్నీ CANCEL చేయబడతాయి)

*జూన్ 1 తర్వాతే వాక్సిన్ మొదటి డోస్ వేయడం ప్రారంభిస్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *