ఇండియాలో నాలుగో రోజు తగ్గిన కరోనా కేసులు!

ఇండియాలో కొన్ని ప్రాంతాల నుంచి కోవిడ్ కేసులు తగ్గుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాలలో కోవిడ్ వ్యాప్తి గ్రాఫ్ నిటారుగా పెరగడం మానేసి సమతలానికి (plateau) మారుతున్నట్లుందని  కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.

మహారాష్ట్ర,పంజాబ్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ లలో ఇలాంటి ధోరణి కనిపించినట్లు కోవిడ్ బులెటీన్లలోని లెక్కలు చెబుతున్నాయి.గత 15 రోజులలో మహారాష్ట్రలోని 12 జిల్లాలో కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. ముఖ్యంగా ముంబై నగరంలో కేసులు బాగా తగ్గాయి. కరోనా సతమతమయిన ఈ మహానగరంలో సోమవారం నాడు నమోదయిన కేసులు 2,624 మాత్రమే. ఈ నంబర్ చాలా ఊరట కలిగిస్తుంది. భవిషత్తు మీద భరోసా కలిగిస్తుంది.సంక్షోభ దశ ముగిసిట్లేనని అధికారలు చెబుతున్నారు. పోతే, మరణాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి.సోమవారం నాడు ముంబైలో  78 మంది కోవిడ్ తో చనిపోయారు. మరణాల రేటు (CFR) 2.9 శాతం. ఇది ప్రస్తుతానికి ఎక్కువే. అయితే, ఈ వారంలో  ఇది సమతలం అవుతుందని అధికారులు ఆశిస్తున్నారు.

మే 1 నుంచి కేంద్రానికి అందుతున్న కొత్త పాజిటివ్ కేసుల లెక్కలను బట్టి  ఈ వ్యాఖ్య చేశారు.

ఉదాహరణకు మే ఒకటో తేదీన  400,000  కొత్త కరోనా  కేసులు నమోదయ్యాయి. మే 2 వ తేదీన వీటి సంఖ్య  392,000 తగ్గింది.

ఆ మరుసటి రోజు అంటే ఆదివారం నాడు 367,000 కు పడిపోయాయి. అంటే కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు కనిపిస్తూ ఉందని  కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు.

సోమవారం నాడు కొత్త కేసులు ఇంకా తగ్గి 357,229 కి చేరుకున్నాయి. ఈ వివరాలను కేంద్రం మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు విడుదల చేసింది.

అమెరికా తో సమానమయిన ఇండియా

ఈ రిపోర్టు ప్రకారం భారతదేశంలో  పాండెమిక్ మొదలయినప్పటినుంచి నమోదయిన మొత్తం కరోనా కేసులు రెండు కోట్లు దాటాయి. ఇలా ప్రపంచంలో రెండు కోట్ల కేసులు దాటిన దేశాలలో భారత్ రెండోది. మొదటిది అమెరికా. భారత దేశంలో మొత్తం కేస్ కౌంట్ 2,02,74,921. అమెరికా కేస్ కౌంట్ 3.3 కోట్లు. బ్రెజిల్ కౌంట్ 1.5 కోట్లు.

అయితే,  మూడు లక్షలకు మించి కొత్త కేసులు నమోదు కావడం వరుసగా ఇది  13వ రోజు.  గత 24 గంటలలో దేశంలో 3,449 మంది చనిపోయారు. ఆసుపత్రులలో  మందులు, పడకలు, ఆక్సిజన్ కొరత ఇంకా తీవ్రంగానే ఉంది.

అయితే, అపుడు కరోనా తగ్గుతున్నదని సంబరపడాల్సిందేమీలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ముందే ప్రకటిస్తే ప్రమాదమని కూడా వారు చెబుతున్నారు.  ఈ మూడు రోజుల్లో కేసులు తగ్గేందుకు కారణం, కొన్ని రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు తగ్గించడం, లేదా తక్కువగా చేస్తుండటమన కారణమని ఈ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

One thought on “ఇండియాలో నాలుగో రోజు తగ్గిన కరోనా కేసులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *