టోసిలీజుమాబ్ డ్రగ్ సరఫరాపై త్రిసభ్య కమిటీ

హైదరాబాద్: విపరీతంగా డిమాండ్, కొరత బ్లాక్ మార్కెట్ సమస్య ఎదుర్కొంటున్న టోసిలీజుమాబ్ డ్రగ్  వ్యవహారం తెలంగాణ ప్రభుత్వ పరిశీలనకు వచ్చింది. ఈ  ఇంజక్షన్ కు సంబంధించిన సరఫరా సమస్యను  పరిశీలించి పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది.

కమిటీలో  నిమ్స్ డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ సభ్యలుగా ఉన్నారు.  పేషంట్ల ఆరోగ్య పరిస్థితిపై నిపుణుల సూచన మేరకే
టోసిలీజుమాబ్ డ్రగ్ సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ ఇంజక్ష్ న్ విపరీతంగా బ్లాక్ మార్కెట్ అవుతున్నది. తాము రు. 2.15 లక్షలకు ఒక ఇంజక్షన్ కొనేందుకు సిద్ధమయ్యాయని, ఈ లోపు రోగి మరణించారని రోగి బంధువులు తెలిపారు. ఈ ఇంజక్షన్ రెండు తెలుగు రాష్ట్రాలలో గాలించడం జరిగిందని,ఎక్కడా అందుబాటులో లేదని  తెలిసింది. అందువల్ల అవసరమయిన రోగులకు, ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో, టోసిలిజుమాబ్ కచ్చితంగా అందేందుకు  ఈ కమిటీ చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకుప్రభుత్వం జివొ విడుదల చేసింది.

జివో టోసిలిజుమాబ్ ను ఎలా ప్రిస్క్రబ్ చేయాలో కూడా విధానం నిర్ణయించింది.

ఈ జివొ ప్రకారం రోగికి ఈ మందు ఇచ్చేందుకు నాలుగు షరతులను పాటించాలి. ఆ పైన ఆసుపత్రికి చెందిన కనీసం ముగ్గురు నిపుణులు టోసిలి జుమాబ్ ఇంజక్షన్ అవసరమని భావించాలి. అపుడు రోగి అసవరమయిన ఇంజక్షన్ కోసం ఇండెంట్ మెడికల్ డైరెక్టర్ అందుతుంది. ఈ అభ్యర్థనలను కమిటీ పరిశీలించిన తర్వాతే కమిటీ ఈ ఇంజక్షన్ ఎవరికి అందివ్వాలన్నది నిర్ణయిస్తుంది.

The office of the Director of Medical Education will receive the request for Tocilizumab from the hospitals for specific patients and place it immediately before the committee.

The patient-wise request from the hospitals should have a detailed recommendation of a team of three specialists doctors from the hospital, which is indenting the drug, after assessment of the patient’s situation.

The Committee shall allocate the drug after satisfying the following criteria:

1.No active Bacterial/Fungal /Tubercular infection

2.No Improvement despite the use of steroid

3.Significantly raised inflammatory markers (CRP& or IL-6)

4.Presence of severe disease (preferably within 24 to 48 hours of the onset of severe disease /ICU admission

అయితే, చాలా ప్రయివేటు ఆసుపత్రులు ఇంత ప్రాసెస్ అనుసరిస్తాయా అనే అనుమానం వ్యక్తమవుతున్నది. భారీగా ఫీజు తీసుకుంటున్నప్పటికీ ఇంజక్షన్ తెచ్చుకోమని డాక్టర్లు రోగులకే చెబుతున్న, ఈ ఇంజక్షన్ కోసం రోగుల బంధువులు పడరాని పాట్లు పడుతున్నారు. దీనితో భారీ బాక్ల మార్కెట్ తయారయింది. ఈ ఇంజక్షన్ ధర బ్లాక్ లో రు.2.75లక్షల దాకా వెళ్లిందని, అయితే, చావు బతుకుల సమస్య కాబట్టి ఈ ధర పెట్టి కొంటున్నారని తెలిసింది. అంతేకాదు బ్లాక్ మార్కెట్ లో కొనేందుకు రాజకీయ పలుకుబడి ఉపయోగించాల్సి వస్తున్నదని చెబుతున్నారు.

 

 

 

One thought on “టోసిలీజుమాబ్ డ్రగ్ సరఫరాపై త్రిసభ్య కమిటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *