అసుపత్రిలో బెడ్ దొరక్క ఆంధ్రలో జర్నలిస్టు మృతి

కరోనా మహమ్మారితో పోరాడి కొద్ది సేపటిక్రితం క్రిష్ణా జిల్లా అవనిగడ్డ NTV రిపోర్టర్ నంద్యాల శ్రీను అశువులుబాశాడు.అయితే, చిత్రమేమిటంటే ఆయన ఆసుపత్రిలో చేరాలనుకుంటే బెడ్ దొరకలేదు.

కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ కోవిడ్ సెంటర్లో 42 గంటలు పడిగాపులు కాచినా శ్రీను కు బెడ్ దొరకలేదు. దీనితో చివరివరకు ప్రాణాలతో కొట్టుమిట్టాడు.  బుధవారం రాత్రి వంటి గంట నుండి వీల్ చైర్ లోనే ఆక్సిజన్ అందశారు. పరిస్థితి తీవ్రంగా ఉనమనా ఆయనకు సస్పెక్టెడ్ వార్డులో చికిత్స చేస్తూ వచ్చారు.

ఈనెల 19న rtpcr చేయగా టెస్ట్ చేయగా ఇంతవరకు  రిపోర్టు రాకపోవడం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులైనా టెస్టులు చేయకపోవడం కరోనా వార్డులోకి చేర్చుకొనకపోవడం కుటుంబ సభ్యలంతా రోధిస్తూ వచ్చారు. చూస్తుండగానే క్షణక్షణానికీ క్షీణిస్తున్న రిపోర్టర్ శ్రీనివాస్ ఆరోగ్యం క్షీణించింది. ఆక్సిజన్ లెవెల్ 61 శాతంకు పడిపోవడంతో
తన భర్త ప్రాణాలు కాపాడాలంటూ ఆయన భార్య విలపిస్తూ విజ్ఞప్తి చేసింది.

రెండు రోజుల నుంచి తిండితిప్పలు మానేసి భర్తను కాపాడుకునేందుకు  ఆమె చేసిన  ప్రయత్నం ఫలించలేదు. కొద్ది సేపటి కిందట ఆయన చనిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *