ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో “జగనన్న వసతి దీవెన” అనే నగదు పథకం మొదలయింది. ఈ పథకం కింద విద్యార్థులకు వసతి, భోజనం ఖర్చులకు అయ్యే మొత్తాన్ని తల్లితండ్రులకు చెల్లిస్తారు. రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన మొత్తాన్ని ప్రతి అకౌంటులో నేరుగా జమ అవుతుంది.
ఈ రోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న వసతి దీవెన నగదు జమ్మ అయ్యేలా నొక్కి సీఎం వైయస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి పథకం ప్రారంభించారు.
మొత్తంగా ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బుధవారం రూ.1,048.94 కోట్లను జమ చేశారు.
2020–2021 సంవత్సరానికి మొత్తం 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం నగదు జమచేశారు.
గత వారం విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మొదటి త్రైమాసికం కింద రూ.671.45 కోట్లు వారి తల్లుల ఖాతాలకు జమ చేశారు.
ఇప్పుడు వసతి, భోజన ఖర్చులకు రూ.1,048.94 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేల చొప్పున, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చులను జగనన్న వసతి దీవెన కార్యక్రమం కింద ఇలా జమచేస్తారు.
జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఇప్పటికే రూ.1,220.99 కోట్లను చెల్లించారు. బుధవారం మొదటి విడతగా రూ.1,048.94 కోట్లను చెల్లిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు జగనన్న వసతి దీవెన కింద రూ.2,269.93 కోట్లు చెల్లించినట్లు అవుతుంది.
ఉదాహరణకు రాయచోటి నియోజక వర్గంలో జగనన్న వసతి దీవెన క్రింద 2020-2021 మొదటి త్రైమాసిక లబ్ది: రూ 7,92, 17,500 జమచేశారు.
వాటి వివరాలు…
ఎస్ సి వెల్ఫేర్: విద్యార్థుల సంఖ్య:824,అర్హులైన తల్లుల సంఖ్య :726 , లబ్దిపొందుతున్న మొత్తం: రూ 79,92,500.
ఎస్ టి వెల్ఫేర్: విద్యార్థుల సంఖ్య: 211 ,అర్హులైన తల్లుల సంఖ్య : 190 , లబ్ది పొందుతున్న మొత్తం:రూ 20,07,500,
బి సి వెల్ఫేర్: విద్యార్థుల సంఖ్య: 3306 ,అర్హులైన తల్లుల సంఖ్య :2933 , లబ్దిపొందుతున్న మొత్తం:రూ 3,19,27,500,
ఈ బి సి వెల్ఫేర్: విద్యార్థుల సంఖ్య: 1359,అర్హులైన తల్లుల సంఖ్య : 1204 , లబ్దిపొందుతున్న మొత్తం:రూ 1,32,47,500,
కాపు వెల్ఫేర్: విద్యార్థుల సంఖ్య: 773 ,అర్హులైన తల్లుల సంఖ్య : 697, లబ్దిపొందుతున్న మొత్తం:రూ 74,77,500,
ముస్లిం మైనారిటీ: విద్యార్థుల సంఖ్య: 1692 ,అర్హులైన తల్లుల సంఖ్య :1505 , లబ్దిపొందుతున్న మొత్తం:రూ1,64,85,000,
క్రిస్టియన్ మైనారిటీ : విద్యార్థుల సంఖ్య:8 ,అర్హులైన తల్లుల సంఖ్య : 6,లబ్ధిపొందుతున్న మొత్తం:రూ 80,000.