తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ కరోనా పాజిటివ్

తెలంగాణ మునిసిపల్, ఐటి మంత్రి కెటి రామారావు (కెటిఆర్ )కు కరోనా సోకింది. తాను కరోనా పాజిటివ్ అని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్టు చేశారు.

“నాకు కరోనా సోకింది.కొద్ది రోగలక్షణాలున్నాయి. ఇంటివద్ద ఐసోలేషన్ లో ఉంటున్నాను. గత కొద్ది రోజులగా నన్ను కలసిన వారంతా జాగత్తగా ఉండండి, కరోనా ప్రొటోకోల్ పాటించింది. పరీక్షలు చేయించుకోండి.” అని ఆయన ట్వీట్ చేశారు.

‘I’ve tested COVID positive with mild symptoms. Currently isolated at home Those of you who have met me last few days, kindly follow the covid protocol, get tested & take care.’

ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్ కు కరోనా సోకింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన రెండు రోజుల కిందట యశోదా ఆసుపత్రిలో పరీక్ష లు చేయించుకున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని పార్టీ  వర్గాలు చెబుతున్నాయి.

ఆయన గజ్వేల్ సమీపంలొని తన ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

తర్వాత  ఆయన మేనల్లుడు, రాజ్యసభ సభ్యుడు జోగిన పల్లి సంతోష్ కుమార్ కూడా కరోనా పాజిటివ్ అని ట్విట్టర్ ద్వార ప్రకటించారు. మొత్తానికి తెలంగానలో కరోనా వైరస్ విచ్చలవిడిగా తిరుగుతూ ఉంది. ఎంతో భద్రత ఉన్నా, కరోనా ప్రొటొకోల్స్ చాలా కఠినంగా పాటిస్తున్నా  వివిఐపిల ఇళ్లలోకి వైరస్ చొరబడింది. అంటే సామాన్యులు, చాలా జాగ్రత్తగా ఉండాలనేది హెచ్చరిక.